హైదరాబాద్: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ ట్రాన్స్‌జెండర్‌ను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపిన మేరకు.. నింబోలిఅడ్డాకు చెందిన జి.అవంతిక భార్గవ్ అలియాస్ శ్రవణ్ కుమార్(33) అనే ట్రాన్స్‌జెండర్ ఓ బాలుడి(14)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


