నల్గొండ జిల్లాలో దారుణం.. లేడీ హోంగార్డును కడతేర్చిన భర్త! | Nalgonda Woman Home Guard Murder Case Telangana | Sakshi
Sakshi News home page

నల్గొండ జిల్లాలో దారుణం.. లేడీ హోంగార్డును కడతేర్చిన భర్త!

Nov 10 2026 1:34 PM | Updated on Nov 10 2026 1:45 PM

Nalgonda Woman Home Guard Murder Case Telangana

సాక్షి, నల్గొండ: భార్యకు అండగా ఉండాల్సిన భర్తే ఆమె ప్రాణాలు తీశాడు. జీవితాంతం తోడుంటానన్న వ్యక్తే ఆమె పాలిట మృత్యువయ్యాడు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాలో, హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డ్‌గా మెహబూబ్‌ బీ విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మరోసారి వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త సతీష్‌ భార్యను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే, హత్యకు సంబంధించిన పూర్తి విషయాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: రోజూ రాత్రి భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడితో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement