ఎనిమిది రోజులైనా దొరకని శ్రీజ ఆచూకీ | Telangana Student Goes Missing In US | Sakshi
Sakshi News home page

ఎనిమిది రోజులైనా దొరకని శ్రీజ ఆచూకీ

Nov 10 2026 11:28 AM | Updated on Nov 10 2026 11:31 AM

Telangana Student Goes Missing In US

నల్లగొండ జిల్లా: అమెరికాలో అదృశ్యమైన నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ శ్రీజ ఆచూకీ ఎనిమి ది రోజులైనా లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు ఎప్పుడు తిరిగి వస్తుందోనని ఎదురుచూస్తూ శ్రీజ తల్లి రూప, తండ్రి యాదగిరిరెడ్డి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా శ్రీజ ఇంటికి వచ్చి తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోతున్నారు. గ్రామంలో బాబాయిలు, చిన్నమ్మలతో ఎంతో సరదాగా గడిపిన కూతురు అదృశ్యం కావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 శ్రీజ ఆచూకీ కనుగొనే విషయంలో అమెరికా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె తండ్రి యాదగిరిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 2వ తేదీన శ్రీజ అదృశ్యం కాగా, 3వ తేదీ తెల్లవారుజామున అమెరికా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. తన కుమార్తె గదికి సుమారు అర కిలోమీటరు దూరంలో ఫోన్‌ సిగ్నల్‌ చూపిస్తోందని, అక్కడే తమను ఆచూకీ తెలుసుకోవాలని పోలీసులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. తమ కుమార్తె ఆచూకీ కనుగొనే విషయంలో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలని శ్రీజ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

అమెరికా ప్రభుత్వం, సంబంధి త అధికారులతో సంప్రదింపులు జరిపి తమ కుమార్తెను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి శనివారం శాబ్దుల్లాపురం గ్రామానికి చేరుకుని శ్రీజ తండ్రి యాదగిరిరెడ్డిని పరామర్శించా రు. ఆమె అదృశ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులను ఓదార్చా రు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement