ఆ ఐదు గ్రామాలపై ‘అఖిలపక్షం’! | Five Villages Around Bhadrachalam to Return to Telangana | Sakshi
Sakshi News home page

ఆ ఐదు గ్రామాలపై ‘అఖిలపక్షం’!

Nov 10 2026 4:41 AM | Updated on Nov 10 2026 4:41 AM

Five Villages Around Bhadrachalam to Return to Telangana

ఏపీలో కలిపిన భద్రాచలం పరిసర గ్రామాలను మళ్లీ తెచ్చుకునే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

జన సమితి నేతలతో చర్చ సందర్భంగా ఆ గ్రామాల ప్రస్తావన  

అటు ఢిల్లీ, ఇటు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని సీఎం రేవంత్‌ భరోసా 

డిప్యూటీ సీఎం నేతృత్వంలో అఖిలపక్షం ఏర్పాటు చేయించే ప్రతిపాదన 

సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు త్వరలోనే ఉంటుందనే సంకేతాలు 

బుల్లెట్‌ ట్రైన్‌ వయా సూర్యాపేట అంశం తన చేతిలో లేదని స్పష్టికరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన భద్రా చలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిసింది. ఈ అంశంపై వీలున్నంత త్వరలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి.. అక్కడ వెల్లడయ్యే అభిప్రాయాల మేరకు కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌ ఆలోచిస్తున్నారు.

 ఇటీవల తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) నేతలు కలిసిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని, భద్రా చలం సమీపంలోని ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావాలని టీజేఎస్‌ నేతలు కోరగా, అటు కేంద్ర ప్రభు త్వ పెద్దలు, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పెద్ద లతో తాను మాట్లాడతానని, ఈ మేరకు ఒత్తిడి తెస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో దీనిపై మాట్లాడాలని, ఆయనతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరు మంత్రులను సమన్వయం చేసుకోవాలని, డిప్యూటీ సీఎం నేతృత్వంలో త్వరలోనే ఈ అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేయిస్తానని టీజేఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం.  

అన్నీ చేస్తున్నాం 
టీజేఎస్‌ నేతలతో భేటీలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ చేసిన తప్పిదాలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం గురించి ఆయన ఏకరువు పెట్టినట్టు సమాచారం. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు చెల్లించాల్సి వస్తుందని అప్పట్లో వయో పరిమితిని సడలించారని, ఇప్పుడు వారంతా రిటైర్‌ కావడంతో నెలనెలా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్ల రూపంలోనే రూ.1,000 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించిన సీఎం.. ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వీలున్నంత మేర ప్రజాధనాన్ని సది్వనియోగం చేస్తున్నామని, అన్నీ చేసుకుంటూ వెళుతున్నామని, క్రమంగా అన్నీ సర్దుకుంటాయని చెప్పారు.

వృద్ధాప్య పింఛన్లను రూ.2 వేల నుంచి త్వరలోనే రూ.4వేలకు పెంచుతామనే సంకేతాలు కూడా ఇచ్చారు. శంషాబాద్‌ నుంచి చెన్నై వరకు బుల్లెట్‌ రైలు వయా సూర్యాపేట తీసుకెళ్లాలంటూ టీజేఎస్‌ నేతలు వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా రైలు మార్గం నిర్ణయించడం తన చేతుల్లో లేదని, రైలు మార్గానికి కేంద్రం అనుమతి వచ్చిన తర్వాత భూసేకరణ మాత్రమే తాము చేస్తామని స్పష్టం చేశారు. ఇక, టీజేఎస్‌ నేతలకు నామినేటెడ్‌ పదవులను కూడా సర్దుబాటు చేస్తానని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement