భాగ్యలక్ష్మి ‘కాయిన్‌’ కోసం.. | Bhagyalakshmi Special Treasure Distribution | Sakshi
Sakshi News home page

భాగ్యలక్ష్మి ‘కాయిన్‌’ కోసం..

Nov 10 2026 11:23 AM | Updated on Nov 10 2026 11:26 AM

Bhagyalakshmi Special Treasure Distribution

హైదరాబాద్‌: చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈనెల 6న ధన త్రయోదశి పూజలతో ప్రారంభమైన దీపావళి ఉత్సవాలు బుధవారంతో ముగియనున్నాయి. ఈనెల 8 సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమైన ఖజానా (అమ్మవారి చిత్రంతో ముద్రించిన వెండి కాయిన్‌) పంపిణీ రాత్రింబవళ్లు కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు అమ్మవారి మొదటి దర్శనం ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటలకు ముగియనుంది. ఖజానా పంపిణీ రాత్రి 11.30 గంటలకు ముగియనుంది. దీంతో చారి్మనార్‌ నలువైపులా రోడ్లను మూసివేశారు. కాలినడకన భక్తులు ఆలయానికి చేరుకొని గంటల తరబడి బారికేడ్లలో దర్శనం కోసం క్యూ కడుతున్నారు. 

ఇదీ చదవండి: లోన్‌ యాప్‌ వేధింపులు.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement