సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం మండలం హర్షగూడలో విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో బెటాలియన్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ముడావత్ శ్రీను (31) 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివిధ ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. అప్పులు చెల్లించాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
మొబైల్‌కు మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు కూడా శ్రీను పాల్పడినట్లు సమాచారం. తల్లి ఫిర్యాదుతో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లోన్ యాప్‌ల నిర్వాహకులు, వేధింపులకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్లు, మెసేజ్‌లు సహా డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫోన్‌లో మాట్లాడొద్దన్న భర్త.. మనస్తాపంతో..


