మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 8లోu ● ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద కొత్తవాల్‌ గూడ నుంచి నియోజకవర్గంలోని నాచారం వరకు రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో 82కిలోమీటర్ల దూరం నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ● రూ.2,100 కోట్లతో మక్తల్‌ – నారాయణపేట – కొడంగల్‌ ఎత్తిపోతల రెండో దశ పనులకు శంకుస్థాపన. కొడంగల్‌ నియోజకవర్గంలో పనులు ప్రారంభమవుతాయి. ● లగచర్ల ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రూ.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ● రూ.42 కోట్లతో కొడంగల్‌, కోస్గి, మద్దూరు బస్టాండ్ల ఆధునీకరణకు భూమిపూజ ● రూ.5 కోట్లతో కొడంగల్‌ నిరంజన మఠం నవీకరణ పనులకు శ్రీకారం ● రూ.1,410 కోట్లతో కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు ప్రారంభం ● రూ.118 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల నిర్మాణానికి భూమిపూజ ● కొడంగల్‌ మండలం అప్పాయిపల్లి శివారులో రూ.123 కోట్లతో వ్యవసాయ కళాశాల నిర్మాణం పనులు ప్రారంభం ● లగచర్ల ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్‌ నిర్మాణం. ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ప్రయోజనార్థం చేపట్టిన పలు పనులను ప్రారంభించారు. తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాలకు తాగునీరు అందించే పథకాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

న్యూస్‌రీల్‌

కొడంగల్‌ మండలం పర్సాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకొంటున్న రేవంత్‌రెడ్డి

హకీంపేట్‌ సభాస్థలికి పాదయాత్రగా వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్‌, దామోదర, పొంగులేటి, ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ తదితరులు

ప్రజలకు అభివాదం చేస్తున్న రేవంత్‌రెడ్డి

ఆన..

పోలేపల్లి ఎల్లమ్మ

తల్లి మీద

కొడంగల్‌: ‘పోలేపల్లి ఎల్లమ్మ తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. 2028 వరకు కొడంగల్‌కు సాగునీరు అందిస్తా.. బీడు భూముల్లో పచ్చటి పంట లు పండాలే.. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కాదు, ఎంతైనా వెనకడుగు వేసేది లేదు.. 70 ఏండ్లుగా వెనుకబాటుకు గురైంది. గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదు.. నిర్లక్ష్యం చేశారు. 2009లో పాలమూరు నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించాం. పదేండ్లు అధికారంలో ఉండి కూడా కొడంగల్‌పై కనికరించలేదు. అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది.. ఈ ప్రాంత ప్రగతిపై ఎవడైనా ఏడ్చినా.. అడ్డుకోవడానికి ప్రయత్నించినా పండబెట్టి తొక్కుతం’ అంటూ ప్రత్యర్థులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి దుద్యాల మండలం హకీంపేట శివారులో రైతు మేళా సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కొడంగల్‌ ప్రాంతానికి ఇన్నాళ్లు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నిజాం పాలన నుంచి విముక్తి లభించిన తర్వాత అధికారంలోకి వచ్చిన పెద్దలు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ఈ ప్రాంతంపై కక్ష కట్టారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకాలను పక్కన పెట్టారని విమర్శించారు. మక్తల్‌ – నారాయణపేట – కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేసి కృష్ణ జలాలను కొడంగల్‌లో పారిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రిగా తన బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ్మ, జూపలి కృష్ణారావు, అజా రొద్దీన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్‌ దీపక్‌ తివారి పాల్గొన్నారు.

రూ.9,100 కోట్లతో అభివృద్ధి పనులు

నియోజకవర్గంలో రూ.9,100 కోట్లతో చేపట్టను న్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. సభా ప్రాంగణంలో వర్చువల్‌గా వివిధ పనులను ప్రా రంభించారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు.

పాదయాత్రగా..

బొంరాస్‌పేట: మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి దుద్యాల మండలంలోని పోలేపల్లి రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు, కోలాటం, బతుకమ్మ ఆట పాట, డప్పులు, పులి వేషాలు ఆకట్టుకున్నాయి. ఎల్లమ్మ ఆలయం నుంచి హకీంపేట మీదుగా ఎడ్యుకేషన్‌ హబ్‌ సమీపంలోని బహిరంగ సభ వరకు పాదయాత్రగా సీఎం చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఆవుటి శేఖర్‌, నర్సింహారెడ్డి, సింగర్‌ నర్సింలు, రెడ్డి శ్రీను, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పోలీస్‌ భవనాలు ప్రారంభం

కొడంగల్‌: పట్టణంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. భవనాలను పరిశీలించి స్టేషన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రులు దామోదర రాజనర్సింహ్మ, తుమ్మల నాగేశ్వరరావు, వాకటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

బొంరాస్‌పేటలో..

బొంరాస్‌పేట: మండల పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన భవనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. దుద్యాల మండలం హకీంపేటలో జెడ్పీహెచ్‌ఎస్‌ భవనం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం, మహిళా సమాఖ్య భవనం, దుద్యాల గేటు వద్ద పోలీస్‌ స్టేషన్‌ను, రైతు వేదిక వద్ద మండల సమీకృత కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శేరి రాజేశ్‌రెడ్డి, వీబీజీరాంజీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు నర్సింలుగౌడ్‌, నాయకులు వెంకట్రాములుగౌడ్‌, అంజిల్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, మల్లేశ్‌, నర్సింలు నాయుడు, సర్పంచ్‌ వీరేశలింగం పాల్గొన్నారు.

దౌల్తాబాద్‌లో జూనియర్‌ కళాశాల..

దౌల్తాబాద్‌: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement