కాన్పు కోసం వెళ్తే కాదు పొమ్మన్నారు | - | Sakshi
Sakshi News home page

కాన్పు కోసం వెళ్తే కాదు పొమ్మన్నారు

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

షాద్‌నగర్‌: పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే వైద్యులు కాదు పొమ్మన్నారు. కనీస కనికరం చూపకుండా రిపోర్టులు లేవనే సాకుతో మరో ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. మార్గమధ్యలో గర్భిణి 108 వాహనంలో ప్రసవించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. ఫరూఖ్‌నగర్‌కు చెందిన షాహీన్‌కు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే బంధువులు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యానికి కావాల్సిన రిపోర్టులు లేవని వైద్యులు ఆమెను హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని రెఫర్‌ చేశారు. దీంతో వారు 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో పరిస్థితి గమనించిన అంబులెన్స్‌ ఈఎంటీ సత్యనారాయణ, పైలెట్‌ గణేశ్‌ అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ఆమెకు సాధారణ ప్రసవం జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పురిటి నొప్పులు వస్తున్నా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పట్టించుకోకపోవడం సరికాదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రిలో మాతాశిశు మరణ ఘటన మరవక ముందే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా ప్రసవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement