నేటి నుంచి మెథడిస్టు జాతర | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మెథడిస్టు జాతర

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

● పూర్తయిన ఏర్పాట్లు.. వెలసిన దుకాణాలు

ధారూరు: ధారూరు మెథడిస్టు క్రిస్టియన్‌ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి (మంగళవారం) నుంచి ఆదివారం వరకు వేడుకలు జరుగనున్నాయి. జాతర ప్రాంగణంలో దుకాణాలు వెలిసాయి. ప్రధాన శిలువ వద్ద స్టేజ్‌ని వివిధ రకాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే పలువురు పాస్టర్లు చేరుకున్నారు. లక్షలాది మంది యాత్రికులు రానుండటంతో కాగ్నా నదిపై సీసీ పైపులు వేసి మరో దారిని ఏర్పాటు చేశారు. పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు.

జాతరను విజయవంతం చేయాలి

అనంతగిరి: నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్న ధారూరు మెథడిస్టు జాతరను విజయ వంతం చేయాలని హైదరాబాద్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌ ఇన్‌చార్జ్‌ బిషప్‌ సీజీ దయానంద్‌ కోరారు. సోమవారం వికారాబాద్‌లో ఆయన మాట్లాడారు. ఉత్సవాలు బెంగళూర్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌ బిషప్‌ అనిల్‌, హైదరాబాద్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షతన జరుగుతాయన్నారు. ప్రస్తుతం జరిగేది 104వ జాతర అని తెలిపారు. వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు వస్తారన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాన్ఫరెన్స్‌ లే లీడర్‌ జోజెఫ్‌, ట్రెజరర్‌ రాజు, జిల్లా డీఎస్‌ జాన్‌వెస్లీ, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement