breaking news
Ranga Reddy District Latest News
-
నిధులు అందవు..పనులు సాగవు
● రెండేళ్లుగా కొనసాగుతున్న రోడ్డు నిర్మాణం ● ఎమ్మెల్యే ఆదేశించినా పురోగతి లేని వైనం ● ఇబ్బంది పడుతున్న ప్రజలు యాచారం: మాడ్గుల–యాచారం మండలాల సరిహద్దు కలిసే రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పనులు ప్రారంభించి రెండేళ్లు దాటినా పనుల్లో పురోగతి లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఫిర్యాదులు చేసిన స్పందన లేదని వాపోతున్నారు. 2023 ఆగస్టు 24న అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కొత్తపల్లి–కొత్తపల్లి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు మంజూరు చేయించి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తిగా అటవీ ప్రాంతంలో గుట్టల మధ్య నుంచి వెళ్లే మార్గాన్ని బీటీ రోడ్డుగా మారిస్తే యాచారం–మాడ్గుల మండలాల సరిహద్దు ప్రయాణికుల రాకపోకలకు సులభం అవుతుంది. పనులు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తపల్లి–కిషన్‌పల్లి రోడ్డు అంతే.. కొత్తపల్లి నుంచి మాల్ మార్కెట్‌కు చేరుకోవడానికి కిషన్‌పల్లి వరకు అదే రోజు పంచాయతీ రాజ్ శాఖ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పూర్తయితే కొత్తపల్లి గ్రామస్తులకు ఆరుకిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. రెండేళ్లు దాటినా రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకనే సాగడంతో కొత్తపల్లి గ్రామస్తులకు ఇబ్బంది తప్పడం లేదు. రూ.3.5 కోట్ల బకాయి కొత్తపల్లి–కొత్తపల్లి తండా వరకు ఆరు కిలోమీటర్లు, కొత్తపల్లి–కిషన్‌పల్లి వరకు నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం కోసం పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ నుంచి రూ.7.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నేటి వరకు దాదాపు రూ.3.5 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. ప్రభుత్వం నుంచి నయా పైసా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు సాగడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారే తప్పా.. బిల్లులు ఎందుకు రాలేదో చెప్పడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నా రు. వడ్డీ తెచ్చి పనులు చేపడితే సకాలంలో బి ల్లులు అందక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సగం నిధులు ఇప్పించినా సకాలంలో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. -
ఆలయాల అభివృద్ధికి ‘ఐక్యత’ సహకారం
ఆమనగల్లు: ఆలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందిస్తుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ పరిధిలోని కర్కస్తండాలో మంగళవారం సుంకిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యాలుగా ఐక్యత ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పారు. అలాగే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయాల పునరుద్ధరణ, అబివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణం కోసం ఆర్థికసహాకారం అందిస్తున్నామని వివరించారు. కల్వకుర్తి నియోజక వర్గంలో ఇప్పటివరకు 160 ఆలయాల అభివృద్ధికి సాయం అందించామని ఆయన గుర్తుచేశారు. కర్కస్తండాలో ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి అవసరమైన ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, నాయకులు శంకర్‌నాయక్, నర్సింహ, రవి, కరుణాకర్‌రెడ్డి, గోపాల్‌నాయక్, శ్రీను, శివాజీ, మల్లేశ్, రాజేందర్, నార్య, సంతోశ్, కృష్ణ, బాలకోటి, దేవేందర్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి -
ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు
షాద్‌నగర్: చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. పోషణ్ అభియాన్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చించోడ్ జెడ్పీహెచ్ఎస్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారుల తల్లులకు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహించొద్దని సూచించారు. చిన్నారులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని అన్నారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఎంఈఓ మనోహర్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యను అభ్యసించి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్న ప్రాసన, గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సవ్రంతి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, హెచ్ఎం రాంచందర్, ఎన్జీఓ సభ్యులు నవ్య, తులసి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి -
వాటర్‌మెన్ మృతి
కందుకూరు: కందుకూరు పంచాయతీ పరిధిలో వాటర్ మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న రొట్టెల అంజయ్య(59) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటూనే విధులకు హాజరవుతున్నారు. సోమవారం రాత్రి మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మరణించారు. ఆయన గత 25 ఏళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని నివాళులర్పించారు. పనికోసం వచ్చిన కూలీ అదృశ్యం మొయినాబాద్‌రూరల్: పనికోసం వచ్చిన కూలీ అదృశ్యమయ్యా డు. ఈ ఘటన మొయి నాబాద్ ఠాణా పరిధిలోని అజీజ్‌నగర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జార్ఖ్ండ్కు చెందిన సుదేశ్ బ్రిజియా ఈ నెల 11వ తేదీన అజీజ్‌నగర్ సమీపంలో శ్రీనిధి పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బావమరిది అరుణ్ బ్రిజియా వద్దకు వచ్చాడు. ఈ నెల 12న సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు మంగళవారం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఎయిర్‌పోర్టులో ఈ–సిగరెట్ల పట్టివేత శంషాబాద్: దుబాయ్ నుంచి పెద్ద మొత్తంలో ఈ–సిగరెట్లతో పాటు విదేశీ సిగరెట్లు తీసుకొచ్చిన ప్రయాణికులు సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. దుబాయ్ నుంచి ఈకే–524 విమానం మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు తనిఖీలు పూర్తి చేసుకుని అరవైల్ బయటికి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు అతడిని వద్ద ఉన్న మూడు నల్లరంగు పెద్ద బ్యాగులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో 259 ఈ–సిగరెట్లతో పాటు 200 బాక్సుల విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. తీసుకొచ్చిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు పెరుమల్పట్టుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తీసుకొచ్చిన సిగరెట్లను అతడి నుంచి తీసుకునేందుకు డిపార్చుర్ దగ్గర ఉన్న వ్యక్తి మహ్మద్ ఇంతియాజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సిగరెట్లతో పాటు నిందితులిద్దరిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. -
కదలికలను గమనించి.. కళ్లలో కారం కొట్టి
రంగారెడ్డి జిల్లా: కొన్నాళ్లుగా మహిళ కదలికలను గమనిస్తున్న ఓ దుండగుడు ఇంట్లోకి దూరి కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసి పుస్తెలతాడును అపహరణకు యత్నించాడు. పారిపోతున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం శంకర్పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గాన్కు చెందిన కుంబారే సిద్ధారెడ్డి, సునీత దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్‌పల్లికి వచ్చారు. పట్టణంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజుమాదిరిగానే టిఫిన్ సెంటర్‌కు వచ్చిన సునీత పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేందుకు ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లింది. కొన్నాళ్లుగా ఈ దంపతుల కదలికలను గమనిస్తున్న దుండగుడు మంకీ క్యాప్ ధరించి హఠాత్తుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సునీత కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. అక్కడే కార్ వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రవీణ్ గమనించి వెంటనే పట్టుకుని తనిఖీ చేశాడు. బ్యాగులో కారం పొడి, మంకీక్యాప్, పుస్తెలతాడు లభించింది. అప్పటికే సునీత భర్తకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న సిద్ధారెడ్డి దుండగుడు టిఫిన్ సెంటర్ ఎదురుగా అద్దెకు ఉండే వాసు(45)గా గుర్తించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వాసు డైలీ ఫైనాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరు పరచారు. రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో బీజేపీ కార్యకర్త మృతి
అంతిమ యాత్రలో పాల్గొన్న ఆచారి కడ్తాల్: మండల కేంద్రానికి చెందిన బీజేపీ కార్యకర్త జల్కం శేఖర్(36) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మంగళవారం పరామర్శించారు. జల్కం శేఖర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోసారు.అదే విధంగా బాధిత కుటుంబాన్ని వివిధ పార్టీల, సంఘాల నాయకులు పరామర్శించారు. పంచాయతీ ట్రాక్టర్ నుంచి బ్యాటరీ చోరీ నందిగామ: పార్క్ చేసిన చాకలిదాని గుట్టతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నుంచి గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి బ్యాటరీ చోరీ చేశారు. కారోబార్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. సోమవారం గ్రామంలో పనులు చేసిన తర్వాత సాయంత్రం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ట్రాక్టర్‌కు తాళం వేసుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం ట్రాక్టర్ తీసుకెళ్లేందుకు వెళ్లగా బ్యాటరీ చోరీ విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఇదే పంచాయతీలో పలుమార్లు దొంగలు పడ్డారు. ఇప్పటికై నా పోలీసులు దర్యాప్తు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదృశ్యమైన మహిళ.. శవమై తేలింది మీర్‌పేట: బడంగ్‌పేటలో అదృశ్యమైన మహిళ మీర్‌పేట మంత్రాల చెరువులో శవమై తేలింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన ప్రకారం. బడంగ్‌పేట సమతానగర్‌కు చెందిన మీసాల కమల (55)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటోంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు కమల ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుమారుడు రాజశేఖర్ అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంత్రాల చెరువులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన వాకర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హైడ్రా సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని వెలికితీసి కమలగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కమల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిందని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్ శంషాబాద్: విమానాశ్రయంలో బాంబులు పెడితే వివిధ ఏజెన్సీలన్నీ సమన్వయంగా సమస్యను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు ప్రతి సంవత్సరం నిర్వహించిన మాదిరిగా ఈ ఏడాది బాంబులు పెడితే కలిగే నష్టం..దానిని నివారించే విధానంపై డ్రిల్ చేపట్టారు. కార్గో ఏరియాలో చేపట్టిన ఈ డ్రిల్‌లో సీఐఎస్ఎఫ్ అధికారుల బృందంతో పాటు రక్ష సెక్యూరిటీ, వైద్యులు, రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక పోలీసులు పాల్గొన్నారు. తనిఖీలు, నిర్వీర్యం, వైద్యసాయం తదితర అంశాలపై మాక్‌డ్రిల్ విజయవంతంగా పూర్తిగా చేశారు. ముజ్రా పార్టీ భగ్నం మహేశ్వరం: మహేశ్వరం ఠాణా పరిధిలోని కొరుపోలు చంద్రారెడ్డి (కేసీఆర్ రిసార్ట్స్) రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీ మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలోని కేసీఆర్ రిసార్ట్స్‌లో మంగళవారం వేద అగ్రికల్చర్ ఇన్నోవేషన్ సీడ్ కంపెనీ డైరెక్టర్ గాజులరామారానికి చెందిన తిరుపతి రెడ్డి, రాందాస్‌పల్లికి చెందిన రాక్‌స్టార్ హైబ్రిడ్ సీడ్ కంపెనీ డైరెక్టర్ సైదారెడ్డి వేర్వేరుగా విత్తన కంపెనీ డీలర్లకు విందు ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు, 52 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో రెండు కాటన్ల బీర్లు, మూడు ఫుల్‌బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. రిసార్ట్ యజమాని రాకేశ్‌రెడ్డి, ఈవెంట్ మేనేజర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు బాలురపైనా లైంగిక దాడి! సైదాబాద్: సైదాబాద్ జైలు గార్డెన్‌లోని ప్రభుత్వ బాలల సదనంలో ఒక బాలుడిపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లైంగిక దాడి చేయడం కలకలం సృష్టించిన సంగతి విదితమే. అయితే పోలీసుల విచారణలో అతడు మరో నలుగురు బాలురిపైనా లైంగిక దాడులు చేశాడని తేలినట్లు తెలుస్తోంది. బాలుడిపై లైంగిక దాడి ఘటనను సీరియస్‌గా విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నామయని సమాచారం. ప్రస్తుతం సదనంలో 80 మంది బాలలు ఉండగా వారందరితో పోలీసులు ఒక్కొక్కరిగా మాట్లాడి విషయాలు రాబడుతున్నారు. ప్రస్తుతం సదనంలో కాకుండా ఇండ్లకు వెళ్లిన వారిని సైతం వారు విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ బాలుడిపై దాడి విషయం వెలుగులోకి వచ్చిన తరువాత జువైనల్ విభాగం ఉన్నతాధికారులు మహిళా సూపరింటెండెంట్ మైథిలిని దర్యాప్తు అధికారిగా నియమించారు. ఆమె పూర్తి వివరాలతో నివేదికను అధికారులకు సమర్పించారు. ఇప్పటికే బాలుడిపై దాడి ఘటనలో నిందితుడైన ఔట్సోర్సింగ్ ఉద్యోగి రహమాన్‌ను విధుల నుంచి అధికారులు తొలిగించారు. హెడ్ సూపర్వైజర్ షఫీని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఉద్యోగులకు చార్జి మెమో జారీ చేశారు. సైదాబాద్ పోలీసుల విచారణ పూర్తయితే ప్రభుత్వ బాలల సదనంలో దాడుల విషయమై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకా శం ఉంది. బాలల సదనంలో లైంగిక దాడి ఘటనపై కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు పూర్తి నివేదిక పంపాలని అడిగారని తెలుస్తోంది. హెచ్‌సీఏలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల కలకలం సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌సీఏపై మరో వివాదంవెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏలో నకిలీ, డబుల్ బర్త్ సర్టిఫికెట్లతో పలువురు క్రీడాకారులు ప్రవేశం పొందినట్లు ఓ బాధితుడి తండ్రి అనంత్ రెడ్డి మంగళవారం ఉప్పల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అండర్– 16, అండర్–19, అండర్–23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్లు డబుల్ బర్త్ సర్టిఫికెట్లతో ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్‌లో ఆడే విధంగా హెచ్‌సీఏ అవకాశం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై గతంలో ఆరుగురు ప్లేయర్లను గుర్తించిన బీసీసీఐ..వారిపై నిషేధం విధించిందని ఆయన గుర్తు చేశారు. ఎక్కువ వయసు ఉన్న వారికి ఇలా అక్రమమార్గంలో లీగ్‌లో ఆడే అవకాశం ఇవ్వడం వల్ల ప్రతిభ ఉన్న నిజమైన క్రీడాకారులకు నష్టం వాటిల్లుతుందని ఆయన వాపోయారు. అవినీతికి పాల్పడుతూ టాలెంట్ లేకున్నా ప్లేయర్లను ఆడనిస్తున్న హెచ్‌సీఏ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన సీపీకి ఫిర్యాదు చేశారు. -
పరుగులు తీ సేలా..
నగరం నలువైపుల నుంచి సులువుగా వెళ్లేలా.. ● రేడియల్ రోడ్లతో అనుసంధానం ● గండిపేట నుంచి ఫిల్మ్ సిటీ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ● కొత్వాల్‌గూడ నుంచి లగచర్ల వరకు రహదారి ● చందన్వెల్లి, సీతారాంపూర్ సెజ్లతో లింక్సాక్షి, సిటీబ్యూరో: మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయడంతో పాటు నది పరీవాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పర్యాటక మూసీకి నగరం నలువైపుల నుంచి సులువుగా చేరుకునేలా పటిష్టమైన రహదారి వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు తొలి దశలో మూసీకి పునరుజ్జీవం కల్పించనున్న గండిపేట నుంచి పలు మార్గాలలో గ్రీన్‌ఫీల్డ్ రహదారులను నిర్మించనున్నారు. దీంతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరం నలుదిక్కుల నుంచి మూసీకి రాకపోకలు సులువవుతాయని అధికారులు భావిస్తున్నారు. గండిపేట టు ఫిల్మ్ సిటీ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి దశలో జంట జలాశయాల నుంచి బాపూ ఘాట్ వరకు 21.5 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఫేజ్–1ఏ కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు 9.5 కి.మీ., ఫేజ్–1 బీ కింద ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు 11 కి.మీ. వరకు ఉంటుంది. కంపుకొట్టే మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయడంతో పాటు నది పరీవాహక ప్రాంతమైన గండిపేటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా నగరం నలువైపులా గండిపేటకు రాకపోకలు సులువుగా సాగేలా కొత్త రహదారులను నిర్మించాలని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) అధికారులు ప్రతిపాదించారు. నగరంలోని ఓఆర్ఆర్ను ఓఆర్ఆర్తో అనుసంధానించమే లక్ష్యంగా పలు రేడియల్ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా గండి పేట నుంచి ఫిల్మ్ సిటీ వరకూ మూసీ వెంట కొత్త రోడ్డును నిర్మించనున్నారు. దీంతో గండిపేట సమీ పంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి ఫిల్మ్ సిటీ వద్ద ఓఆర్ఆర్ వరకు ప్రస్తుత దూరం 85 కి.మీ.గా ఉండగా.. ఈ ప్రతిపాదిత రోడ్డుతో ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఏకంగా 30 కి.మీ. దూరం తగ్గుతుంది. ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’ దేశానికి ముఖద్వారమైన ‘గేట్ వే ఆఫ్ ముంబై’ తరహాలో తెలంగాణకు ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’ ఐకానిక్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రపంచ పర్యాటకులను స్వాగతించేలా హిమాయత్‌సాగర్ సమీపంలో గాంధీ సరోవర్ వద్ద ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత గేట్ వే ఆఫ్ హైదరాబాద్‌ను కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధిపరుస్తారు. ఈ ఐకానిక్ నిర్మాణం నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లను కలుపుతూ చందన్వెల్లి, సీతారాంపూర్ సెజ్‌లకు రేడియల్ రోడ్‌తో అనుసంధానించనున్నారు. ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్‌ను చించోలి హైవేకు కలుపుతుంది. దీంతో మూడు పారిశ్రామిక పార్క్‌లకు యాక్సెస్ మెరుగవుతుంది. కల్చరల్ గ్రిడ్‌గా మూసీ మూసీకి పూర్వవైభవం తీసుకురావాలంటే కేవలం నదిలో స్వచ్ఛమైన నీరు పారేలా చేయడం మాత్రమే కాదు.. నదిలో మురుగు నీరు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా నది చుట్టూ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నదిలో గోదావరి జలాలను పారేలా చేసేందుకు మల్లన్నసాగర్ ఆనకట్ట నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను నింపే ప్రయత్నాలను ప్రభుత్వం చేపట్టింది. ● మూసీని బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మరో ఆర్థిక చక్రంగా చేయనున్నారు. దశల వారీగా ఈ ప్రాజెక్ట్‌ను హెచ్ఎండీఏ పరిధిలోని 55 కి.మీ. మూసీ నదిని పునరుజ్జీవం కల్పించనున్నారు. మూసీని వాటర్ గ్రిడ్‌గా మాత్రమే కాకుండా సాంస్కృతిక గ్రిడ్‌గా కూడా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వం మంచిరేవులలోని 800 ఏళ్ల నాటి పురాతన శివాలయం, పాతబస్తీలోని మసీదు, సిఖ్చావనీలోని గురుద్వారా, ఉప్పల్‌లోని మెదక్ కేథడ్రిల్ తరహాలో చర్చిని అభివృద్ధి చేస్తారు. -
పదవుల్లో కీలకం
అభివృద్ధికి సహకారం ఆలయాల అభివృద్ధికి ఆర్థిక సహకరిస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. యాచారం: రాష్ట్రాన్ని శాసించే కీలక పదవుల్లో ఇబ్రహీంపట్నం ప్రాంత వాసులు కొనసాగుతున్నారు. అంతా వ్యవసాయ, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఉన్నత హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు రాష్ట్ర సేవలో తలమునకలవుతూనే ఇటు వీలుచిక్కినప్పుడలా పుట్టిన గడ్డకు తోడ్పాటునందిస్తూ ముందుకు సాగుతున్నారు. కీలక పదవుల్లో ఉన్న తమ ప్రాంత వాసులను చూసి స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. డీజీపీగా శివధర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల గ్రామానికి చెందిన బత్తుల శివధర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్లుగా పోలీస్ శాఖలో పలు కీలక పోస్టుల్లో పనిచేసి పదవికే వన్నె తెచ్చిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌లో కీలకమైన పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కష్టపడి చదివి ఐపీఎస్‌గా ఎంపికై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎస్పీగా, ఇంటెలిజెన్స్ బాస్‌గా విధులు నిర్వర్తించారు. పోలీస్ బాస్‌గా సేవలందిస్తూ ఇబ్రహీంపట్నం నియోజవర్గం ప్రజలు ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. యువత కనిపిస్తే కష్టపడి చదవాలి.. ఉన్నత ఉద్యోగాలు సాధించి పుట్టినగడ్డకు మంచి పేరు తేవాలని హితబోధ చేస్తూ.. వారిలో స్ఫూర్తిని నింపుతుంటారు. రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండారెడ్డి యాచారం మండల కేంద్రానికి చెందిన ముదిరెడ్డి కోదండరెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చినవారే. విద్యార్థి నేతగా, యువ నేతగా అంచెలంచెలుగా ఎదిగి నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, హూడా చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా ఏడాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, రోశయ్య, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తదితర సీఎంలతో సన్నిహితంగా మెలిగారు. ప్రస్తుతం ఫార్మాసిటీ రద్దు చేయించడం, భూభారతి చట్టం తీసుకురావడం, ఫ్యూచర్‌సిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రైతుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా పాటుపడుతున్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంత రైతులు ఎక్కడ కనిపించినా వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్‌రెడ్డి యాచారం మండలం మొగుళ్లవంపు గ్రామానికి చెందిన కర్నాటి ప్రతాప్‌రెడ్డి కాకతీయ యూనివర్సిటికీ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. యాచారం, మాడ్గుల మండల కేంద్రాల్లో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన ఆయన ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత పదవులు చేపట్టారు. ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ వ్యవసాయంపై మక్కువను మాత్రం వదులుకోలేదు. సమయం చిక్కినప్పుడల్లా సాదాసీదాగా గ్రామానికి వస్తూ తన వ్యవసాయ పొలంలో పంటలను పరిశీలిస్తూ తోటి రైతులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. యాచారం గ్రామస్తులు ఎక్కడ తారసపడినా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. వీసీగా వేలాది మంది యువతకు మార్గదర్శకుడిగా వారి ఉన్నతికి బాటలు వేస్తూ మనన్నలు పొందుతున్నారు. పుట్టినగడ్డపై మమకారం ఒకరు రాష్ట్రానికే పోలీస్ బాస్ ఇంకొకరు కాకతీయ వర్సిటీ వీసీ మరొకరు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ మురిసిపోతున్న ‘పట్నం’ గడ్డ -
పారదర్శకంగా ధాన్యం సేకరణ
● అక్రమాలకు తావివ్వొద్దు ● రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు ● కొనుగోళ్లు సాఫీగా సాగాలి ● అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ధాన్యం సేకరణలో అక్రమాలకు తావు లేకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కొనుగోళ్లు సాగేలా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దాదాపు 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, 6 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ఎఫ్ఏ క్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్య పర్చాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ధాన్యం సరఫరాకు వాహనాలను సమకూర్చుకోవాలని అన్నారు. అకాల వర్షాలతో తడిసిపోకుండా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ట్రక్ షీట్లలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను కేంద్రాలకు సమకూరుస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం తరఫున అన్ని సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. సదస్సులో డీఎస్ఓ వనజాత, సివిల్ సప్లై డీఏం హరీష్, డీసీఓ సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఉష తదితరులు పాల్గొన్నారు. -
గోవులను రక్షించుకుందాం
ఇబ్రహీంపట్నం: గో సంతతిని కాపాడుకోవాలని, గోవులను రక్షించుకుంటేనే ప్రకృతి పరంగా జీవరాసులన్నింటికీ మంచి భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ ప్రాంత గో సేవా ప్రముఖ్ వెంకట నివాస్జీ అన్నారు. జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలను మంగళవారం ఇబ్రహీంపట్నంలోని త్రిశక్తి అలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గో సంతతి పెరిగితేనే భూసారం పెరుగుతుందని తెలిపారు. గోవుల పాల ఉత్పత్తులతోపాటు గో ఆధారిత వ్యవసాయం చేస్తే మనమంతా ఉండగలుగుతామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా, 80 కోట్లకు పైగా పశు సంతతి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం 20 కోట్ల పశువులు మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంతతిని పెంపొందించుకునేందుకు, వాటిని రక్షించుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విభాగ్, జిల్లా గో సేవా ప్రముఖులు వేణుగోపాల్, రచమళ్ల అబ్బయ్య, సుధాకర్‌రెడ్డి, బుగ్గవరపు రమేష్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: సీజేఐ గవాయ్‌పై దాడి అంటే రాజ్యాంగం, పార్లమెంట్, దేశం మొత్తంపై జరిగిన దాడిగా చూడాల్సిందేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీజేఐపై దాడిని నిరసిస్తూ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామెల్ అధ్యక్షతన మంగళవారం ఇబ్రహీంపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సామెల్తోపాటు కార్యదర్శి ప్రకాశ్ కారత్, బీఎస్పీ నాయకుడు కొండ్రు రఘుపతి, తెలంగాణ ఉద్యమకారులు బోసుపల్లి వీరేష్‌కుమార్, రాములు, మారయ్య, పూస ల సంఘం రాష్ట్ర నాయకుడు పురుషోత్తం, రజక సంఘం నాయకుడు ముదిగొండ అజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాడి చేసిన.. దాని వెనుకల ఉన్న నిందితులను కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నారు. సమావేశంలో వెంకటేశ్, బండి సత్తయ్య, కాలె గణేశ్, కాళ్ల జంగయ్య, ఎం. రాజు, కరుణాకర్ పాల్గొన్నారు. యాచారం: మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 19, 68, 127లోని అసైన్డ్, ప్రభుత్వ భూములపై గ్రామ రైతులతో బుధవారం సమావేశం ఉంటుందని తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల కు జరిగే సమావేశానికి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. నోటిఫికేషన్ వేసిన 820 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి ఏం చేయాలనే విషయమై చర్చించడం జరుగుతుందని ఆయన వివరించారు. మహేశ్వరం: పెండింగ్ కమీషన్ డబ్బులు విడుదల చేయాలని మంగళవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ రఘునందన్‌రావును రేషన్ డీలర్ల సంఘం నాయకులు కలిశారు. కమీషన్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. రాష్ట్రం, కేంద్రం నుంచి వచ్చే పెండింగ్ కమీషన్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో విడుదలయ్యే విధంగా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. మంత్రులు, ఎంపీని కలిసిన వారిలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానుగౌడ్, ఆర్గనైజింగ్ సేక్రటరీగా విజయ్ సూర్య తదితరులు ఉన్నారు. -
28 మద్యం దుకాణాలకు 308 టెండర్లు
అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియలో భాగంగా హయత్‌నగర్ ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 28 షాపులకు 308 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సీఐ ధన్వంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఒక్క రోజే 86 అప్లికేషన్లు రాగా బండరావిరాలలో ఎస్టీ రిజర్వు అయిన దుకాణానికి ఒక్కటి కూడా రాలేదని చెప్పారు. ఈ నెల 18తో టెండర్ల ప్రక్రియ ముగియనుందని ఆయన పేర్కొన్నారు. కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ ట్రిపుల్ఆర్ రోడ్డు భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు మంగళవారం హైదరాబాద్‌లో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆయా రోడ్ల నిర్మాణంతో భూములు కోల్పోవడంతో పాటు రైతులకు కలిగే ఇబ్బందులను వివరించారు. అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్ జోగు వీరయ్య, మాజీ ఉప సర్పంచ్ ముత్యాలు, నాయకులు భిక్షపతి, వంశీ, లక్ష్మణ్, నర్సింహ తదితరులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: టీజీఐఐసీకి భూములు కోల్పోయిన అర్హులైన రైతులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అంనతరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎల్మినేడులో మంగళవారం భూ సేకరణ, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు పర్యటించారు. పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ పరిరక్షణ సమితి, ఇతర రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా ఆర్డీఓకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద అర్హుల జాబితా ఉందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వం చేసిన ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా త్వరలోనే లే ఔట్ చేసి ప్లాట్లు అప్పగించేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. -
కార్మికులకు మోదీ చేసిందేమీ లేదు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తుర్కయంజాల్: ప్రధాని నరేంద్రమోదీ సఫాయి కార్మికుల కాళ్లు కడుగుతూ ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప వారి కడుపు నింపడం లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. పురపాలక సంఘం పరిధి రాగన్నగూడలోని చలసాని కల్యాణ మండపంలో సంఘం జిల్లా కార్యదర్శి డి. కిషన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న తెలంగాణ మున్సిపల్ వర్క్‌ర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలకు మంగళవారం ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను భానిసత్వంలోకి నెట్టేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. మోదీ పేదలు, కార్మికుల కోసం చేసిందేమీ లేదని, హామీలకే పరమితమయ్యారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న అనేక లేబర్ కోడ్లను ఎత్తివేశారని దుయ్యబట్టారు. అంతకుముందు నాయకులు, కార్మికులు భారీ ర్యాలీగా రాగన్నగూడలోని జిల్లా కార్యాలయం నుంచి తరలి వచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఎస్.వి.రఘు, కార్యదర్శి జె.వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి రాజమల్లు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, చంద్రమోహన్, నాయకులు ఈ.నరసింహ, జగదీష్, స్వప్న, సత్యనారాయణ, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేవీలో మంచి అవకాశాలు
హుడాకాంప్లెక్స్: ‘డీజే షిప్పింగ్ సాగర్ మే సమ్మాన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సరూర్‌నగర్ వీఎంహోంలో స్కూల్ విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్ తరువాత ఉద్యోగావకాశాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీజే షిప్పింగ్ నోడల్ ఆఫీసర్, ట్రైనింగ్ రెహమాన్ కళాశాల ప్రిన్సిపాల్ డా.అశుతోష్ కుమార్ ఆపండ్కర్ మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మర్చంట్ నేవీలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నేవీ రంగంలో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని, మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ముదుకు వెళ్తున్నామని అన్నారు. మర్చంట్ నేవీలో 10వ తరగతి తరువాత ఒక సంవత్సరం శిక్షణ ఉంటుందని, ఇంటర్ తరువాత మూడేళ్లు బీఎస్సీ డిగ్రీ చదివిన వెంటనే వంద శాతం ఉద్యోగాలు మంచి వేతనంతో దొరుకుతాయని చెప్పారు. ట్రైనింగ్ షిప్ రెహమాన్ మర్చంట్ నేవీ శిక్షణలో అనేక కోర్సులు అందిస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మర్చంట్ నేవీలో విద్యార్థుల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. మర్చంట్ నేవీలో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థిని భీమగాని సత్య మాట్లాడుతూ.. విద్యార్థులు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించాలని, ప్రత్యేక శిక్షణతో నేవీ రంగంలోకి అడుగు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు మనీషా పాండే, వీఎంహోం ప్రిన్సిపాల్ పి.నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు భీమగాని మహేశ్వర్ పాల్గొన్నారు. కెప్టెన్ అశుతోష్ కుమార్ ఆపండ్కర్ -
ఆ పార్టీలవి కుట్ర రాజకీయాలు
ఆమనగల్లు: రాష్ట్రంలో విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర రాజకీయాలు సాగిస్తున్నాయని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆమనగల్లు పట్టణంలో సీఎస్ఆర్ నిధులు రూ.4 కోట్లతో నిర్మిస్తున్న బీసీ బాలుర వసతిగృహం నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర చెంచు యువజన సంఘం అధ్యక్షుడు మండ్లి రాములు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మాణయ్య పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి -
సీజేఐపై దాడి యత్నానికి నిరసన
ఇబ్రహీంపట్నం రూరల్: ఆధిపత్య శక్తుల ప్రభావంతోనే సీజేఐ గవాయిపై దాడి జరిగిందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై దాడి చేసిన అడ్వొకేట్ రాకేష్ కిషోర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం ఎంఆర్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. బీఆర్ గవాయిపై జరిగిన దాడిని భారత న్యాయవ్యవస్థ మీద, రాజ్యంగ స్ఫూర్తి మీద దాడిగా అభివర్ణించారు. కుల, మతాల పేరుతో విద్వేషాన్ని నింపుకొని దాడులకు దిగడం అనాగరికపు చర్యఅని పేర్కొన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేసి దాడి వెనక ఉన్న శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న అన్ని మండల కేంద్రాల్లో మండల కార్యాలయాలను ముట్టడిస్తామని, 22న చలో హైదరాబాద్ పేరుతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బాబు, బత్తిన సుధాకర్, కృష్ణ, రవి, రమేష్, సతీష్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల కొరత లేకుండా చూడాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం అధికారులతో సమన్వయ సమావే శం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..పత్తి,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇ ళ్లకు ఫేజ్‌లవారీగా బిల్లులు ఇచ్చేలా చూడాలన్నారు. గ్రామ, మున్సిపాలిటీ స్థాయిలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందు ఉంచేలా కృషి చేయాలన్నారు. ప్రజావాణికి 48 దరఖాస్తులు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నేరుగా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి 48 అర్జీలు అందినట్టు తెలిపారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు తుక్కుగూడ:పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అ న్నారు.కలెక్టర్ కార్యాలయంలో సోమవారం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మిగిలిపోయిన పిల్లలను గుర్తించి వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలన్నారు. పౌల్ట్రీఫామ్‌లు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణల వద్ద చిన్నారులను విస్మ రించొద్దని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి
ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలిసిన ఆచారి ఈనెల 31న జరిగే తన కుమారుడు భరత్ నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించారు. నాలుగు మండలాల కూడలి అయిన ఆమనగల్లు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అంతకుముందు ముఖ్యమంత్రిని సత్కరించారు. ముఖ్యమంత్రిని కలిసిన ఆసీఫ్‌అలీ కడ్తాల్: సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మండల కేంద్రానికి చెందిన రేవంత్‌మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్‌అలీ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌మిత్ర మండలి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి వివరించారు. ముగిసిన హార్స్ రైడింగ్ పోటీలు శంకర్పల్లి: మండల పరిధిలోని జన్వాడలో ఉన్న నాసర్ పోలో హార్స్ రైడింగ్ అకాడమీలో మూడు రోజుల పాటు నిర్వహించిన హైదరాబాద్ హార్స్ షో మాన్సూన్–2025 చాంపియన్ పోటీలు సోమవారం ముగిశాయి. షో జంపింగ్, డ్రెసాజ్ విభాగాల్లో ఈ పోటీలను అండర్–10, –12, –14, –16 ఓపేన్ కేటగిరీల్లో నిర్వహించగా సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నాసర్ పోలో హార్స్ రైడింగ్ అకాడమీ చైర్మన్ కుతుబుద్దీన్ ఖాన్ బహుమతులు అందజేశారు. నేడు డయల్ యువర్ డీఎం షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని కోరారు. 99592 26287 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న వీణకు శిక్షణ ఇబ్రహీంపట్నం: గ్రూప్–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా (ఆర్డీవో స్థాయి) ఎంపికై న నారాయణపేట జిల్లాకు చెందిన ఎస్.వీణ శాఖాపరమైన శిక్షణ పొందేందుకు ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయానికి అలాట్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమ వారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాయానికి వచ్చిన వీణ తహసీల్దార్ సునీతారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. మూడు వారాల పాటు జీపీఓగా, వారం పంచాయతీ కార్యదర్శిగా, మూడు వారాల పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఆమె శిక్షణ పొందనున్నారు. లోడ్ లారీలతో రోడ్లు ధ్వంసం పహాడీషరీఫ్: జల్పల్లి పరిసరాల్లో రాత్రి పూట అక్రమంగా తిరుగుతున్న మట్టి, బండరాళ్ల లారీలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా గ్రామ శివారులోని భారీ క్వారీని పూడ్చేందుకు కొందరు రాత్రి పూట వందల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి బండరాళ్లు, మట్టిని తీసుకొస్తున్నారు. ఎవరూ చూడరనే ఉద్దేశంతో భారీ లారీల్లో ప్రమాదపుటంచున నింపి తరలిస్తుండడంతో బండరాళ్లు కింద పడిపోతున్నాయి. మామిడిపల్లి రోడ్డులో అర్ధరాత్రి బండరాయి కింద పడడంతో వెనుకాల వస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. భారీ లోడ్ బండ్లతో కొత్తగా వేసిన రోడ్లు సైతం దెబ్బతింటున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై బాలాపూర్ మండల రెవెన్యూ అధికారులు, పహాడీషరీఫ్ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
పార్టీకోసం పనిచేసేవారికి పెద్దపీట
చేవెళ్ల: పార్టీని పటిష్ట పరిచి రెండోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు జిల్లా కమిటీలో ఎన్నికై న అధ్యక్షులు పనిచేయాల్సి ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్, తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్ అన్నారు. మండలకేంద్రంలో సోమవారం డీసీసీ అధ్యక్ష ఎన్నికపై అభిప్రాయసేకరణ సమావేశం నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాబర్ట్ బ్రూస్తోపాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పీసీసీ ఉపాధ్యక్షులు వినయ్‌రెడ్డి, విజయారెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఒబెదుల్లా కొత్వాల్, చల్లా నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకునే వారు, పోటీ చేస్తున్న వారిలో ఎవరికి మద్దతిస్తున్నారు తదితరాలపై అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా రాబర్ట్ బ్రూస్ మాట్లాడుతూ.. పార్టీకోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు అవకాశం కల్పించాలని.. ఎవరి ప్రమేయం, సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా జిల్లా అధ్యక్షుల ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలిపా రు. జిల్లా పరిఽధిలోని 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే విధంగా నాయకుడు ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, పీసీసీ నా యకుడు జనార్దన్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు వసంతం, షాబాద్ దర్శన్, జిల్లా నాయకులు గౌరీ సతీష్, ఆగిరెడ్డి, పీఏసీఎస్, మార్కెట్ కమిటీల చైర్మ న్లు వెంకట్‌రెడ్డి, పెంటయ్యగౌడ్, సురేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జె. శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం రసాభాస నియోజకవర్గంలో ఉన్న వర్గపోరు మరోసారి బయటపడింది. నేతల ప్రసంగాలు ముగిసిన అనంతరం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పార్టీలో బీసీలకు గౌరవం దక్కడం లేదని, అభిప్రాయ సేకరణలో కూడా ఒక వర్గం నాయకులకే అవకాశం ఎలా ఇస్తారని వాదించారు. దీంతో అక్కడే ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యే, మీరు పార్టీ సమావేశాలు పెట్టినప్పుడు మాకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇరువురి వాదనలతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో అద్దంకి దయాకర్, చల్లా నర్సింహారెడ్డి జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. పాత.. కొత్త నాయకుల అభిప్రాయంతోనే.. శంకర్పల్లి: పార్టీలోని పాత, కొత్త నాయకుల సమష్టి అభిప్రాయంతోనే జిల్లా అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ రాబర్ట్ బ్రూస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మరో ఇద్దరు పరిశీలకులు, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యకర్తలు తమకు నచ్చిన వ్యక్తిని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బలమైన నాయకుడిని ఎంపిక చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, నాయకులు మధుసూదన్‌రెడ్డి, గౌరీ సతీష్, ఉదయ్ మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భీంభరత్ వ్యాఖ్యలు చర్చనీయాంశం సమావేశం సందర్భంగా పామెన భీంభరత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. పార్టీలోకి ఎంతో మంది వస్తారు, పోతారు.. ఎవరున్నా, లేకున్నా పార్టీ ఎక్కడికి పోదు అన్నారు. పదవుల విషయంలో ప్రతీసారి చేవెళ్ల నియోజకవర్గ నాయకులకు అన్యాయం జరుగుతోందని, ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి ఇక్కడి నాయకులకు ఇవ్వాలని కోరారు. దీనిపై పరిశీలకులు స్పందిస్తూ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. -
సోలార్ సొబగులు!
పీఎం సూర్యఘర్ పథకానికి నందిగామ ఎంపిక సాక్షి, రంగారెడ్డిజిల్లా/ షాద్‌నగర్: జిల్లాలోని నందిగామ సిగలో ఇక సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ గ్రామంలోని ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, సంక్షేమ హాస్టళ్లు, రక్షకభట నిలయాలు ఇక పూర్తిగా సోలార్ విద్యుత్ కాంతులతో వెలిగిపోనున్నాయి. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను టీజీ రెడ్కో నెల రోజుల్లో సిద్ధం చేసి, కేంద్ర సంప్రదాయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖకు అందజేయనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆయా ప్రభుత్వ భవనాలపై ప్యానళ్లు ఏర్పాటు చేయనున్నారు. మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు.. సోలార్ విద్యుత్‌ను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.800 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా 800 గ్రామాలను ‘సోలార్ మోడల్ విలేజ్’లుగా తీర్చి దిద్దాలని నిర్ణయించింది. ఇందుకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఐదు వేల జనాభా కలిగి ఉండాలనే నిబంధన విధించింది. ఈ మేరకు జిల్లాలోని ఆరుట్ల, అబ్దుల్లాపూర్‌మె ట్, పాల్మాకుల, మాడ్గుల, షాబాద్, మహేశ్వరం, దండు మైలారం, రాయపోలు, ఇన్ముల్‌నర్వ, కడ్తాల్, ఆలూరు, చేవెళ్ల, కొందుర్గు రెవెన్యూ విలేజీలను గుర్తించి, సర్వే చేపట్టింది. ఇప్పటికే సోలార్ విద్యుత్‌పై అవగాహన కలిగి ఉండి, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని మెజార్టీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న నందిగామను మోడల్ విలేజ్‌గా ఎంపిక చేసింది. పోటీపడిన మరో 13 గ్రామాలు.. షాబాద్‌లో రెండు యూనిట్ల ద్వారా ఇప్పటికే 21 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, మహేశ్వరంలో ఎనిమిది యూనిట్ల నుంచి 670, చేవెళ్లలో 17 యూనిట్ల నుంచి 87.2, రాయపోలులో మూడు యూనిట్ల నుంచి 37, కడ్తాల్‌లో తొమ్మిది యూనిట్ల నుంచి 87.3, ఆలూరులో మూడు యూనిట్ల నుంచి 12, కొందుర్గులో మూడు యూనిట్ల నుంచి 1,009 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నందిగామలో పది యూనిట్ల నుంచి ఏకంగా 1,939 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించి పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. నెల రోజుల్లో సమగ్ర నివేదికను రూపొందించి ఎంఎన్ఆర్కు పంపనుంది. 25 ప్రభుత్వ భవనాల గుర్తింపు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత టెండర్ల ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయనుంది. రూ.కోటి ఖర్చుతో ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పంచాయతీ, మండల కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల గిడ్డంగులు సహా సుమారు 25 ప్రభుత్వ భవనాలపై కిలో వాట్ నుంచి మూడు కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ పలకలను అమర్చనుంది. ప్రభుత్వ భవనాలపై పూర్తి ఉచితంగా ప్యానళ్లు ఏర్పాటు చేయనుండగా, స్వయం సహాయ సంఘాల భవనాలకు 10 శాతం ఆర్థిక సహాయం అందించనుంది. ఆయా భవనాలపై ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించనుంది. దీంతో నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు విముక్తి కల్పించనుంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఇలాసామర్థ్యం ప్రభుత్వ సబ్సిడీ విద్యుత్ ఉత్పత్తి ఒక కిలోవాటు రూ.30 వేలు 120 యూనిట్లు రెండు కిలోవాట్లు రూ.60 వేలు 240 యూనిట్లు మూడు కిలోవాట్లు రూ.78 వేలు 360 యూనిట్లు గృహాలకు సబ్సిడీ ప్రభుత్వ భవనాలపైనే కాకుండా గ్రామంలోని తమ ఇళ్లపై ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావించే గృహ వినియోగదారులకు కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఒక కిలోవాట్ నుంచి మూడు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు వరకు సబ్సిడీ ఇస్తుంది. ఇంటిపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. https:// pmsuryaghar. gov. in పోర్టల్‌లో లాగినై ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ యూఎస్సీ నంబర్‌ను ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి. దీని ద్వారా ఎన్ని కిలోవాట్స్ సోలార్ పరికరాలు అవసరమనే వివరాలను నమోదు చేయాల్సి ఉంది. తర్వాత విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించి యూనిట్ ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తారు. ఇంటిపై ప్రభుత్వ సబ్సిడీతో ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానల్స్‌తో గృహ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు పెట్టిన పెట్టుబడిని.. ఐదేళ్ల వ్యవధిలోనే తిరిగి పొందొచ్చు. ఇలా ఒకసారి ఏర్పాటు చేసిన ప్యానల్స్ 25 ఏళ్ల పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ టి.వేణుగోపాల్ తెలిపారు. -
నేత్రదానానికి ముందుకు రావాలి
ఆమనగల్లు: నేత్రదానం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని లయన్స్‌క్లబ్ జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ కోరారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఆమనగల్లు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నేత్ర, అవయవదానంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తమ మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా మరో ఇద్దరికి దృష్టి భాగ్యం కలుగుతుందని చెప్పారు. శిబిరంలో కంటి వైద్యులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 65 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15 మందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం ఎనుగొండలోని రాంరెడ్డి లయన్స్‌కంటి ఆసుపత్రికి పంపించారు. కార్యక్రమంలో ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు మైమునాబేగం, ఎంపీహెచ్ఈఓ తిరుపతిరెడ్డి, లయన్స్‌క్లబ్ ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, కార్యదర్శి వెంకటయ్య, పీఆర్ఓ పాషా, మాజీ అధ్యక్షుడు యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
కారు–ఆటో ఢీ.. భార్యాభర్తలకు గాయాలు
ఆమనగల్లు: ఆటోను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ దంపతులు తీవ్రంగా గాయపడిన సంఘటన తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భార్యాభర్తలు అశోక్‌రెడ్డి, సుమతమ్మ సోమవారం సమీపంలోని తమ వ్యవసాయ పొలంలో పచ్చిగడ్డి కోసుకుని ఆటోలో గ్రా మా నికి వస్తుండగా ఆమనగల్లు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ టో కొద్ది దూరం వెళ్లి పల్టీ కొట్టడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే ఇరువురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యా ప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆర్టీసీ డ్రైవర్ మృతి ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్‌పల్లికి చెందిన కంతి కిషన్ (50) సోమవారం ఉదయం మృతిచెందాడు. ఇబ్రహీంపట్నం డిపోలో విధులు నిర్వర్తిస్తున్న కిషన్‌కు రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. బీఆర్ఎస్ నాయకు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, కొప్పు జంగయ్య తదితరులు మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రైవేటు హాస్టల్లో యువకుడి ఆత్మహత్య ● ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న మృతుడు ● ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం పహాడీషరీఫ్: ప్రైవేటు హాస్టల్లో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చేసుకుంది. ఎస్ఐ దయాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం చంద్రవంశ గ్రామానికి చెందిన కిష్టప్ప కుమారుడు భానుప్రసాద్(25) కందుకూరు మండలం రాచులూ ర్లోని ఓ వెంచర్లో కొద్ది రోజులుగా ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తూ, తుక్కుగూడలోని సాయిబాలాజీ హాస్టల్లో మరో నలుగురు యువకులతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హాస్టల్‌కు చేరుకున్న భానుప్రసాద్ రూమ్మేట్లు బయటికి వెళ్లిన సమయంలో తలుపులు వేసుకొని దుప్పటితో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం వరకూ తలుపులు తెరువకపోవడంతో స్నేహితులు వచ్చి, తలుపులు నెట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. తన తండ్రి గొంతుకు గడ్డలు అయ్యాయని, తాను పనిచేసే చోట డబ్బులు అడ్వాన్స్‌గా తీసుకొని చికిత్స చేయిస్తానని.. కొన్ని అప్పులు కూడా ఉన్నట్లు రూమ్‌లో ఉండే తమతో చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫిలింనగర్లో రూ.లక్ష నగదు పట్టివేత బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని అపర్ణ సి నార్ వ్యాలీ చౌరస్తాలో ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడి బైక్‌ను ఆపి తనిఖీలు చేయగా బ్యా గ్లో రూ.లక్ష తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ట్రిఫు ల్ ఎస్ వైన్‌షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్న భాస్కర్ షాపు మూసివేసిన అనంతరం ఆ రో జు కలెక్షన్‌ను తీసుకెళ్తున్నట్లుగా వెల్లడించాడు. -
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
షాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో కాంగ్రెస్ అగ్రనాయకులు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం రెండోరోజు రిలే దీక్షలకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా బీసీలకు అన్యాయం చేస్తూ అణగదొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయమైన వాటా అని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు జడల రాజేందర్‌గౌడ్, రాపోల్ నర్సింహులు, తమ్మలి రవీందర్, మాణెయ్య, రమేష్, దర్శన్, శేఖర్, కృష్ణ, రఘువరన్, నారాయణ, దీక్షలో రాము, వెంకటేశ్‌గౌడ్, రాములు, మల్లయ్య, మల్లేష్ తదితరులు ఉన్నారు. -
విద్యుత్ లైన్ అలైన్మెంట్ మార్చేలా చూడండి
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామా ల వ్యవసాయ పొలాల మీదుగా వేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్‌లైన్ మార్చాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతులు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ గోడు వెల్లబోసుకున్నారు. హైటెన్షన్ లైన్‌తో తీవ్రంగా నష్టపోతామని, అలైన్మెంట్ మార్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన కేటీఆర్ బాధిత రైతులకు న్యాయం జరిగేవరకు న్యాయస్థానాల్లో పోరాడేందుకు కూడా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన బస్సు
ముగ్గురికి తీవ్ర గాయాలు కొత్తూరు: ముందు వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని బస్సు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలోని పెంజర్ల కూడలి జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన నవీన్(40), మల్లేష్(45) అన్నదమ్ములు. వీరు కొన్నేళ్ల నుంచి రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదన్లో ఉంటున్నారు. ఆదివారం తమ స్వగ్రామంలో ఓ శుభకార్యం ఉండడంతో ఇద్దరితో పాటు మల్లేష్ కుమారుడు లోకేష్(12) బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు బైక్‌పై బయలుదేరగా పట్టణంలోని పెంజర్ల కూడలి వద్దకు రాగానే వెనకాల నుంచి వచ్చిన గుర్తు తెలియని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. హత్య కేసులో నిందితురాలి అరెస్టు 14 రోజుల రిమాండ్ తరలింపు కేశంపేట: భర్తను హత్య చేసిన ఘటనలో నిందితురాలైన భార్యను కేశంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నరహరి కథనం ప్రకారం.. మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొప్పు కుమార్(35) రోజూ మద్యం తాగి భార్య మాధవిని వేధిస్తుండేవాడు. ఈ నెల 11న రాత్రి సైతం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. భర్తను ఎలాగైనా అంతం చేయాలని భావించిన మాధవి అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని తల, ఛాతిపై సిమెంట్ ఇటుకతో బలంగా మోదింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె మృతదేహాన్ని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న రక్తం మరకలను తుడిచి, పౌడర్‌ను చల్లి ఆధారాలు దొరకుండా చేసి పరారైనట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టినట్లు తెలిపారు. కేశంపేట వైఎస్ఆర్ చౌరస్తా వద్ద మాధవిని సోమవారం అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆమె నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు ఆమెను కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కడ్తాల్: గుర్తుతెలియని కారు– బైకు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన జల్కం శేఖర్(36) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం పొలం పనులు ముగించుకుని, తన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా, శ్రీలక్ష్మి వెంచర్‌లోని మెకానిక్ షాపు సమీపంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన శేఖర్‌ను 108 వాహనంలో మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య శివలీల, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కన్న కొడుకుకు తల్లి తలకొరివి కందుకూరు: అనారోగ్యంతో మరణించిన కొడుకుకు తల్లి తలకొరివి పెట్టిన విషాద ఘటన మండల పరిధిలోని నేదునూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగుల నాగభూషణ్‌రెడ్డి, బాలమణికి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నాగభూషణ్‌రెడ్డి ఇరవై ఏళ్ల క్రితం మృతి చెందగా, ఐదేళ్ల క్రితం చిన్న కూతురు చనిపోయింది. పెద్ద కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపగా, కొడుకు భాస్కర్‌రెడ్డి (30)తో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ గ్రామంలోనే నివసిస్తున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడిన కొడుకు సోమవారం ఉదయం మరణించాడు. దీంతో తల్లి బాలమణి తలకొరివి పెట్టి, అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది. -
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయి!
● డీసీసీ అభిప్రాయ సేకరణ సమావేశానికి కాలె యాదయ్య ● అబ్జర్వర్లను కలిసి వెళ్లిపోయిన వైనం చేవెళ్ల: డీసీసీ అధ్యక్ష ఎన్నికపై సోమవారం చేవెళ్లలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధిష్టానం పంపించిన పార్టీ అబ్జర్వర్లు హాజరయ్యారు. మీటింగ్ మధ్యలో అక్కడికి చేరుకున్న లోకల్ ఎమ్మెల్యే యాదయ్య వచ్చిన అతిథులకు నమస్కరించి, కరచాలనం చేసి వెళ్లిపోయారు. పార్టీ ఫిరాయింపుల కేసు నేపథ్యంలోనే ఆయన మీటింగ్‌లో కూర్చోలేదని అక్కడున్న నేతలు గుసగుసలాడారు. ఇదిలా ఉండగా.. తాను పార్టీ మారలేదని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ మీటింగ్‌కు ఎందుకు వచ్చారో ఆయనకే తెలియాలని భీంభరత్ వర్గం అసహనం వ్యక్తం చేయగా, తన వర్గానికి నేనున్నానని సంకేతాన్నిచ్చేందుకే యాదయ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని కాంగ్రెస్‌లో చర్చసాగింది. -
భూమి పోతుందనే భయంతో..
గుండెపోటుతో వృద్ధుడి మృతి కొందుర్గు: రేడియల్ రోడ్డులో తన భూమి పోతుందనే భయంతో ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన వడ్ల మోనయ్య(68) సోమవారం రాత్రి ఇంట్లో టీవి చూస్తుండగా గుండెలో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా కొందుర్గు పీహెచ్‌సీకి తీసుకెళ్లే లోపే ఆయన మృతిచెందాడు. మృతుడికి భార్య జయమ్మతోపాటు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం ఉమ్మెంత్యాల శివారులో రేడియల్ రోడ్డు కోసం మార్కింగ్ వేశారు. ఈ రోడ్డులో తన భూమి పోతుందని మోనయ్య రెండురోజుల నుంచి బాధపడ్డారు. భూమి పోతుందనే ఆందోళనలోనే గుండెపోటుతో మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు వాపోయారు. నాగర్‌గూడ వైన్స్‌లో చోరీ షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు వైన్స్‌లో దూరి చోరీ చేసిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్లుగా మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కప్ప హరిబాబు నాగర్‌గూడ దుర్గా వైన్స్‌లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి వైన్స్ బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం వైన్స్‌లో దొంగలు పడ్డారని స్థానికులు తెలపడంతో హరిబాబు అక్కడికి వెళ్లాడు. దుండగులు రాత్రివేళ వైన్స్ వెనకాల గోడకు రంధ్రం చేసి షాపులో దూరి కౌంటర్లో ఉన్న రూ.43 వేలను ఎత్తుకెళ్లారు. నిర్వాహకులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అక్రమ కట్టడాలు తొలగించండి
కొత్తూరు: పాత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో ప్రభుత్వ పాఠశాల గేటుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని స్థానికులు సోమవారం కమిషనర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యాలయానికి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉందన్నారు. దానికి తోడు చిరు వ్యాపారులు ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదే అదునుగా కొందరు రోడ్డుకు ఇరువైపులా డబ్బాలు, అక్ర మ కట్టడాలు నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. మున్సిపాలిటీ అధికారులు అక్ర మంగా వెలసిన కట్టడాలను తొలగించిన తర్వాత రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరారు. లేని పక్షంలో ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రావణ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, కుమార్, నర్సింహ, సురేందర్, రాజు పాల్గొన్నారు. -
పోలీసులకు సవాల్‌గా దోపిడీ ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్: మండల కేంద్రంలో ఉన్న బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో రూ.1.07 కోట్లు దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇటీవల అర్ధరాత్రి కళాఽశాల కార్యాలయంలోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇంత పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడిన దుండుగులు పాత నేరస్తులై ఉండొచ్చని, వివరాలను సేకరించే పనిలో పడ్డారు. నగదు దోపిడీకి పాల్పడడంతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్‌లను అపహరించడాన్ని పరిశీలిస్తే దొంగతనాల్లో ఆరితేరిన వారై ఉంటారని భావిస్తున్నారు. కళాశాల పరిసరాలతో పాటు జాతీయ రహదారి సమీపంలో ఉన్న వివిధ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
తప్పిపోయిన వ్యక్తి అప్పగింత
మంచాల: ఏడాది కిందట తప్పిపోయిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన మంచాల పోలీస్‌స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా జగ్గసాగర్ గ్రామానికి చెందిన పూసల నరేందర్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోవడమేగాకుండా మతి స్థిమితం కోల్పోయాడు. దీంతో భిక్షాటన చేస్తూ మండలంలోని ఆగాపల్లి సమీపంలో కనిపించాడు. స్థానికుల సహాయంతో దయనీయ స్థితిలో ఉన్న నరేందర్‌ను మానవ సేవ ఆశ్రమం నిర్వాహకులు చేరదీశారు. 2025 జనవరిలో వారి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో నరేందర్ తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఆగాపల్లిలో మానవ సేవ ఆశ్రమంలో ఉన్నట్లు గుర్తించారు. నరేందర్‌ను వివరాలు అడిగి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం కుటుంబ సభ్యులైనా భార్య శ్రీలత, బావమరిది అనిల్‌కుమార్ రావడంతో అప్పగించారు. ఏడాది తర్వాత నరేందర్ కలవడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సతీష్ తదితరులు ఉన్నారు. -
కేజీబీవీ విద్యార్థిని నూతన ఆవిష్కరణ
కందుకూరు: దేశవ్యాప్తంగా వర్చువల్‌గా నిర్వహించిన వికసిత్ భారత్ బిల్డాథాన్ 2025 కార్యక్రమం సోమవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో నిర్వహించారు. ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ పాల్గొనగా ఏఐఎం, నీతిఆయోగ్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో కందుకూరు కేజీబీవీ విద్యార్థులు తమ ఆవిష్కరణలను వివరించారు. 9వ తరగతికి చెందిన కల్పన శ్రీక్లాత్ ప్రొటెక్షన్ ఫ్రం రెయిన్శ్రీ ప్రాజెక్టును ఆవిష్కరించింది. బట్టలు ఆరేసే తీగలకు సెన్సార్ ఏర్పాటు చేసి వర్షం కురిసినప్పుడు తడవకుండా అవంతట అవే నీడలోకి వచ్చి, మళ్లీ వర్షం తగ్గిన వెంటనే తిరిగి యథాస్థానంలోకి వచ్చేలా ఆవిష్కరణను వివరించి ఆకట్టుకుంది. వర్షం పడుతుండగానే తల్లి బట్టలు తడవకుండా పరుగులు తీసే దృశ్యం తనకు ప్రేరణ అయినట్లు తెలిపింది. తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు వివరించి అభినందనలు అందుకుంది. ఈ సందర్భంగా డీఈఓ సుశీంద్రరావు, జిల్లా సైన్స్ అధికారి ఎ.శ్రీనివాస్‌రావు, ఎంఈఓ హెచ్.నర్సింహులు, కేజీబీవీ జిల్లా డెవలప్మెంట్ అధికారి సుజాత, ప్రిన్సిపాల్ భార్గవి, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ చీఫ్ మేనేజర్ రామ్ తదితరులు విద్యార్థినిని అభినందించారు. -
క్రాప్ సర్వేతో మేలు
కొత్తూరు: రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సమగ్రంగా తెలుసుకుని వాటిని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది. ఆ వివరాలను శాటిలైట్‌కు అను సంధానం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మండలంలో సర్వే తుది అంకానికి చేరుకుంది. మండలంలో సాగుకు యోగ్యమైన భూమి 8,900 ఎకరాలు ఉండగా ఈ ఏడాది 8,800 ఎకరాల్లో రైతులు ఆయా రకాల పంటలను సాగు చేశారు. కాగా ఇప్పటికే వ్యవసాయ అధికారులు 8,200 ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మిగిలిన 600 ఎకరాల్లో సాగు చేసిన వివరాలను త్వరలో పూర్తి చేయనున్నారు. సర్వేతో ప్రయోజనాలు ● కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలకు ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుని రైతులకు న్యాయం చేస్తారు. ● క్రాప్ సర్వేతో రైతులు ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగు చేశారో? అన్ని వివరాలు సమగ్రంగా అధికారుల వద్ద ఉంటాయి. ● పంట దిగుబడి సమయంలో రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా మార్కెట్లో తమ పంటలను విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ● సర్వేను ప్రామాణికంగా తీసుకుని భవిష్యత్తులో రైతులకు అవసరమైన ఎరువులు, ఇతర అవసరాలను తీర్చడానికి సర్వే అంశాలు చాలా వరకు ఉపయోగపడతాయి. ● ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పడు రైతులకు త్వరగా పరిహారం అందించడంలో సర్వే వివరాలు దోహదపడతాయి. ● క్రాప్ సర్వే ఆధారంగా రైతులు నష్టపోయే పంటలను సాగు చేయకుండా చూడవచ్చు. ● అదే సమయంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి వాటిని సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహించవచ్చు. ● మండలంలోని క్లస్టర్ల వారీగా ఏఈవోలు తమకు కేటాయించిన గ్రామాల్లో మొబైల్ యాప్‌తో పంటలను సర్వే చేయాలి. అనంతరం సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వైపరీత్యాల సమయంలో త్వరగా పరిహారం పంటలు లాభాలకు అమ్ముకునే వెసులుబాటు నమోదు చేసుకోవాలని అధికారుల సూచన నమోదు చేశాం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన క్రాప్ సర్వే మండలంలో దాదాపు పూర్తయింది. 8,800 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇప్పటివరకు 8,200 ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. క్రాప్ సర్వేతో రైతులకు బహుళ ప్రయోజనాలన్నాయి. – గోపాల్‌నాయక్, ఏఓ, కొత్తూరు -
పర్యావరణ పరిరక్షణ సమష్టి బాధ్యత
యాచారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి సూచించారు. సోమవారం మండల పరిధిలోని గునుగల్, యాచారం గ్రామాల్లోని జీపీ ల్యాండ్స్, వెంచర్లలోని పది శాతం భూముల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాల్లో ఏర్పాటయ్యే వెంచర్లలో పంచాయతీలకు రిజిస్ట్రేషన్లు చేసిన పది శాతం భూముల్లో విరివిగా మొక్క లు నాటాలని సూచించారు. గ్రామాల్లోని కాలనీలు, రోడ్ల వెంట, పార్క్ స్థలాల్లో మొక్కలు నాటా లని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ చేయాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. ఈజీఎస్ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామని, అర్హులైన ఆసక్తి కలిగిన రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, ఈజీఎస్ ఏ పీఓ లింగయ్య, ఈసీ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలి మంచాల: గ్రామాల్లో మొక్కల పెంపకం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సుభాషిణి అన్నారు. సోమవారం మండలంలోని ఆగాపల్లి, కాగజ్‌ఘట్ గ్రామాల్లో ఎన్ఆర్ ఈజీఎస్ పథకం కింద నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడమేగాకుండా వాటిని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ వీరాంజనేయులు, ఈసీ విమల, పంచాయతీ కార్యదర్శులు అనిల్, శ్రీ ను, హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి -
రోడ్డు పాడు చేశారంటూ కారు డ్రైవర్‌పై ఫిర్యాదు
మణికొండ: భారీ వర్షాలతో గుంతల మయంగా మారిన రోడ్డు పనులను ఓ వైపు చేస్తుండగానే ఓ కారు దానిపైకి వచ్చి మొత్తం పాడు చేసింది. దాంతో ఇంజనీరింగ్ అఽధికారులు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కారును పోలీసులకు అప్పగించారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా నుంచి మర్రిచెట్టు వైపు ఉన్న రోడ్డు గుంతల మయంగా మారటంతో రెండు రోజులుగా కొత్త రోడ్డు పనులను చేపడుతున్నారు. ఆ విషయం గమనించకుండా ఆదివారం ఉదయం ఓ కారు వేస్తున్న రోడ్డుపైకి వచ్చి మొత్తం పాడు చేసింది. విషయం తెలుసుకుని మణికొండ మున్సిపల్ డీఈ శివసాయి సదరు కారు యజమానిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసి కారును వారికి అప్పగించినట్టు తెలిపారు. ప్రజలందరికీ అవసరమయ్యే పనులను చేపడుతున్నపుడు వారు సహకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పది రోజుల పాటు సదరు రోడ్డును మూసి ఉంచుతున్నామని, ప్రయాణికులు ఇతర రోడ్ల ద్వారా వెళ్లాలని ఆయన కోరారు. -
హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్
మొయినాబాద్‌రూరల్: ఆస్తి వివాదంలో వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించామని మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వివరాలు.. సురంగల్ పౌల్ట్రీ ఫామ్‌లో 250 గజాల ప్లాట్ విషయంలో తగాదా జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం రామగళ్ల ప్రసాద్, రామగళ్ల నందం, సావిత్రి దంపతులు రామగళ్ల శ్యామ్‌పై వేట కొడవలితో దాడి చేయంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
విధేయులకే పట్టం
గుట్కావిక్రేతలపై కేసు నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్న ఆరుగురిపై షాబాద్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పారదర్శకంగా...ప్రజాస్వామ్య బద్ధంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని, ఐదేళ్లుగా సభ్యత్వం ఉండి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్న కార్యకర్తనే డీసీసీ పీఠం వరిస్తుంది’అని ఏఐసీసీ జిల్లా పరిశీలకులు, ఎంపీ సి.రాబర్ట్ బ్రూస్ చెప్పారు. డీసీసీ ఎన్నికల పరిశీలకుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన గాంధీభవన్‌కు చేరుకున్నా రు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టకాలంలో పార్టీకి అందదండగా నిలిచి, అందరికి ఆమోద యోగ్యుడైన సమర్థుడినే డీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా నామినేటెడ్ పోస్టుల చైర్మన్లు, పార్టీ జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, బ్లాక్ స్థాయి, మండల స్థాయి అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే ఈ ఎంపిక ఉంటుందని చెప్పారు. నేడు చేవెళ్ల నేతలతో భేటీ కేవలం పార్టీ నేతల నుంచే కాకుండా పార్టీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేని సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజల నుంచి సైతం అభిప్రాయాలను సేకరించనున్నట్లు చెప్పారు. అయితే ఈ ఎంపికలో సాధారణ కార్యకర్త అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదన్నారు. సోమవారం(ఈనెల 13న) చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి, ఉదయం ఎ–బ్లాక్, మధ్యాహ్నం బి–బ్లాక్ కేడర్‌తో సమావేశమై, వారి అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలిపారు. 16వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గం కేడర్‌తో భేటీ కానున్నట్లు చెప్పారు. ఔత్సాహికులు తమ దరఖాస్తులను స్వయంగా అందజేయవచ్చని సూచించారు. ఈ నెల 19 వరకు మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, తుది జాబితాను ఏఐసీసీకి అందజేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు, పరిశీలకుల బృందం సభ్యుడు వినయ్‌రెడ్డి, కర్నె శ్రీనివాస్ పాల్గొన్నారు. డీసీసీ ఎంపికలో కేడర్ అభిప్రాయానికే పెద్దపీట రోజుకు రెండు బ్లాకుల చొప్పున సమావేశాలు నేడు చేవెళ్ల ముఖ్య నేతలతో భేటీ పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం ఏఐసీసీ జిల్లా పరిశీలకులు, ఎంపీ సి.రాబర్ట్బ్రూస్ ఇదిలా ఉంటే డీసీసీ పీఠం కోసం ఇప్పటికే 12 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఐదుగురు, మహేశ్వరం నియోజకవర్గం నుంచి నలుగురు, చేవెళ్ల నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ నేత బొక్క చెన్నారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్‌రెడ్డి డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఇక ఎల్బీనగర్ నుంచి నాగోల్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాజిరెడ్డి సహా చేవెళ్ల నియోజకవర్గం నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భీం భరత్, పీసీసీ సభ్యుడు గౌరి సతీశ్ సైతం రేసులో ఉన్నారు. ఇక కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ సహా మరికొంత మంది డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. వీరంతా ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టుల చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, ఎంపీపీలు, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అభిప్రాయ సేకరణలో భాగంగా అధిష్టానానికి తమ పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా వారు అభ్యర్థిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
అట్టహాసంగా ‘గ్లోబల్ గ్రేస్ కేన్సర్ రన్’
గచ్చిబౌలి: నగరంలో ఆదివారం జరిగిన గ్లోబల్ గ్రేస్ కేన్సర్ రన్‌కు అనూహ్య స్పందన లభించింది. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి పర్యవేక్షణలో రన్‌ను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ ఆరెకపూడిగాంధీ, స్పోర్ట్స్ అఽథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు సజ్జనర్, అవినాష్ మహంతి జెండా ఊపి ప్రారంభించారు. రన్లో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఔత్సాహిక రన్నర్లు పాల్గొన్నారు. సుమారు 30 వేల మంది ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనగా.. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుంచి 1.5 లక్షల మంది వర్చువల్‌గా పాల్గొన్నట్లు గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి వివరించారు. ఈ సందర్భంగా కేన్సర్‌ను జయించిన నీలిమ, ప్రకాశ్, సంగీత, గీత రన్లో పాల్గొనడం విశేషం. మహిళల విభాగంలో రాజేశ్వరి సునీత, ఉమా, పురుషుల విభాగంలో ఈశ్వర్, అనూజ్ యాదవ్, మనోజ్ విజేతలుగా నిలిచారు. -
నేడు, రేపు కూడా పల్స్ పోలియో
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతమైందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఉదయం బండ్లగూడ జాగీర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి రోజు చుక్కలు వేయించుకోని వారికి ఇంటింటి పర్యటనలో భాగంగా సోమ, మంగళవారాల్లో చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా 290 జిల్లాల్లో, తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఈ పోలియో నిర్మూలన ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. జిల్లాలో 4,20,911 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి, వారికి ఉచితంగా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ లలితాదేవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణ నేటి నుంచే.. బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇదే రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం.. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆర్వో, ఏఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈఎస్ఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంనకు సూచించారు. -
పర్యావరణ రక్షణకు కృషి చేయాలి
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్‌సెంటర్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి బ్రెజిల్ దేశంలో నవంబర్ 10వ తేదీ నుంచి 21 వరకు నిర్వహించనున్న కాప్–30 కార్యక్రమానికి సమాంతరంగా కొనసాగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్స్ పేరుతో నిర్వహించనున్న సదస్సుకు ముందస్తుగా ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీజీఆర్ చైర్పర్సన్ లీలాలక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. కాప్ కార్యక్రమం మొదటగా 1995 మార్చి 28 నుంచి ఏప్రిల్ 7వరకు జర్మనీలో నిర్వహించారని చెప్పారు. ప్రపంచంలో ఒక శాతం జనాభా ఉన్నవారి స్వార్థం కోసం చేస్తున్న ప్రకృతి విధ్వంసంతో 99 శాతం మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులు జీవవైవిధ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించాలని, సహజ ఆవాసాలను పరిరక్షించడం, స్థిరమైన భూ వినియోగాన్ని ప్రోత్సహించడం తదితర చర్యలు చేపట్టాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ సంస్థ నిర్విరామంగా ఐదేళ్లుగా కాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలసీ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారిణి రాజేశ్వరి, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సాయిభాస్కర్రెడ్డి, ఐఆర్ఎస్ అధికారి బండ్లమూడి సింగయ్య, వందేమాతరం ఫౌండేషన్ రవీందర్రావు, సీజీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి -
భూ బాధితులకు ఇంటి జాగలు
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడు భూ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటి జాగలు ఇచ్చి ఆదుకుంటానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం భూ బాధితులు ఎమ్మెల్యే నివాసంలో మల్రెడ్డి రంగారెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి కలెక్టర్‌కు ఆదేశాలు ఇప్పించామని చెప్పారు. త్వరలోనే అధికారులు ఎల్మినేడుకు మళ్లీ వస్తారన్నారు. మొదట ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టి రికార్డు ప్రకారం అసలైన రైతులకే ప్లాట్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అక్రమాలు, అవినీతి జరిగితే లీగల్‌టీం క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు. అధికారులు పారదర్శకంగా సర్వే చేసి అందరికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్నం శివశంకర్, శేఖర్‌రెడ్డి, యాదగిరి, శ్రీశైలం, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో ఘన స్వాగతం ఇబ్రహీంపట్నం: ముగ్గురు మండల వాసులకు డాక్టరేట్ వరించింది. ఢిల్లీకి చెందిన మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ సోషల్ వర్క్, సేవా కార్యక్రమాలను గుర్తించి ఓ మీడియా సంస్థ ప్రతినిధిగా పనిచేస్తున్న సురమోని సత్యనారాయణ, మత్స్యకార సంఘం నేత, టీడీపీ నాయకుడు జలమోని రవీందర్ ముదిరాజ్, మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ ఆదిబట్ల నాయకుడు పల్లె గోపాల్‌గౌడ్‌కు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆదివారం వారికి ఇబ్నహీంపట్నంలో ఘన స్వాగతం పలికారు. రజకాభివృద్ధి సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ కందుకూరు: సమస్యల పరిష్కారానికి రజకులంతా ఏకతాటిపైకి రావాలని రజకాభివృద్ధి సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమరాజు వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండలకేంద్రం సమీపంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు అక్కేనపల్లి శ్రీనివాస్, నాయకులు మల్లేశ్, రాజు, కృష్ణ, సురేందర్ రాజు, వెంకటేశ్, గణేష్, శంకరయ్య, శ్రీనివాస్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీనగర్‌కాలనీ: జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్‌పేటకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చెర్క మహేష్ ఆదివారం నగరంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలకు కారు కావాలో, బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్‌లో ఖర్చు చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనన్నా రు. హైదరాబాద్ గాడిన పడాలంటే కేసీఆర్ రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభం కావాలన్నారు. అన్నీ తెలిసీ బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. పార్లమెంట్లో చేయాల్సి న చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలిసి బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారన్నారు. -
ఆర్టీసీకి ఏఐ దన్ను
ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు ట్రిప్పులు పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. అధునాతన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రూట్లలో ప్రయాణికుల సంఖ్య, రాకపోకలు, ప్రయాణ వేళలు తదితర అంశాలపై శాసీ్త్రయమైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సిద్ధం చేసేందుకు సాంకేతిక నిపుణుల సహాయం తీసుకోనుంది. – సాక్షి, సిటీబ్యూరో మహా నగర పరిధి అనూహ్యంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా కొత్త కాలనీలు ఏర్పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా బయలుదేరుతున్నారు. ఏయే ప్రాంతాల మధ్య రాకపోకలు విరివిగా కొనసాగుతున్నాయనే అంశంపై స్పష్టత ఉండడం లేదు. జీడిమెట్ల, దుండిగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన వందల కొద్దీ కాలనీల నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, నార్సింగి, తదితర ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలు భారీగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ.. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. పైగా ఏ కాలనీ నుంచి, ఏయే సమయాల్లో ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారనే అంశాలపై కూడా తగిన సమాచారం ఉండదు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రియల్ టైమ్ డిమాండ్‌ను కచ్చితంగా అంచనా వేసి బస్సులను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. ప్రతి రూటూ వాస్తవ చిత్రీకరణ.. ● ఆర్టీసీ లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో సుమారు 1050 రూట్లు ఉన్నాయి. గత ఐదారేళ్లుగా విస్తరించిన నగర శివార్లను పరిగణనలోకి తీసుకొంటే ఈ రూట్ల సంఖ్య 1500 దాటి ఉంటుంది. కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంతం వేళల్లో మాత్రమే ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. మిగతా వేళల్లో పెద్దగా డిమాండ్ ఉండదు. అలాంటి రూట్లపై సరైన వివరాలు లేకుండా బస్సులను నడపడంతో నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా ప్రయాణికుల ఆదరణ లేని మార్గాల్లో ట్రిప్పులను తగ్గించి, డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో పెంచేందుకు ప్రతి రూట్‌ను సమగంగా అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించనున్నారు. ఇందుకోసం ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన సాంకేతిక నిపుణుల సహాయంతో డిపోల వారీగా వివిధ రూట్ల వివరాలను సేకరించనున్నారు. ● గ్రేటర్లో ప్రస్తుతం 25 డిపోల్లో ప్రస్తుతం 3,150 బస్సులు ఉన్నాయి. వీటిలో 10 శాతం బస్సులను స్పేర్లోనే ఉంచుతారు. దీంతో సుమారు 2,950 బస్సులు ప్రతిరోజు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. ప్రతి రోజు 31వేలకు పైగా ట్రి ప్పులు తిరుగుతున్నాయి. ప్రతి ట్రిప్పు నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం లభించడం లేదు. ఆదాయం కంటే నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అన్ని ట్రిప్పులను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు. ఆక్యుపెన్సీ ఉన్నా ఆదాయం అంతంతే... మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సుమారు 18 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో పయనిస్తున్నారు. వీరి చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతిరోజు ఆర్టీసీకి నగదు రూపంలో ఆదాయం లభించేది పురుషుల నుంచే. ప్రతి రోజు 8 లక్షల మంది మగవారు ప్రయాణం చేస్తున్నారు. రోజుకు రూ.6.5 కోట్ల ఆదాయం లభిస్తే అందులో రూ.4 కోట్ల వరకు రియంబర్స్మెంట్ రూపంలో ఆర్టీసీ ఖాతాలో జమ అవుతోంది. మిగతా 2.5 కోట్లు మాత్రమే నగదు రూపంలో అందుతోంది. ఈ ఆదాయం కంటే నిర్వహణ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు, తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ రూట్లో ఎంతమంది ప్రయాణికులు రద్దీ, డిమాండ్ మేరకు బస్సుల నిర్వహణ అధునాతన సాంకేతికత వినియోగం రూట్లపై శాసీ్త్రయ అధ్యయనం ప్రయాణికుల సంఖ్య పెంపునకు ప్రణాళికలు -
అదరం.. బెదరం!
● ఏసీబీ కేసులకు వెరవని అక్రమార్కులు ● డిస్కంలో వరుసగా పట్టుపడుతున్న ఇంజనీర్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్తలైన్లు, లైన్ షిఫ్టింగ్ పనులు, మీటర్లు, డీటీఆర్లు, ప్యానల్ బోర్డులు కరెంటోళ్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నిబంధనల మేరకు లోడును బట్టి ఫీజులు చెల్లిస్తున్నా.. క్షేత్రస్థాయిలోని ఆర్టిజన్లు, జూనియర్ లైన్మెన్లు, ఏఈ, ఏడీఈ, డీఈ, చివరకు ఎస్ఈలు.. ఇలా ఎవరి స్థాయిలో వారికి చేయి తడపనిదే పని కావడం లేదు. నిరాకరించిన వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికారుల తీరుతో విసుగు చెందిన వినియోగదారులు చివరకు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ప్రతి నెలా ఎవరో ఒకరు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. అయినా.. అక్రమార్కుల వైఖరిలో మాత్రం మార్పురావడం లేదు. నిజానికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పోలిస్తే డిస్కం ఇంజనీర్ల వేతనాలు చాలా ఎక్కువే. ఒక్కో డీఈకి సీనియార్టీని బట్టి నెలకు రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు వేతనం చెల్లిస్తుంది. సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ల వేతనాలు సైతం రూ.లక్షకు పైమాటే. ప్రభుత్వం వీరికి భారీగా వేతనాలు చెల్లి స్తున్నప్పటికీ.. వీరిలో కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పితే సరి..లేదంటే కొర్రీలు పెట్టి ముప్పు తిప్పలు పెడుతుంటారు. ఎక్కడా లేని విధంగా ఫోకల్, నాన్ ఫోకల్ అనే పేరుతో పోస్టులను సృష్టించి పోస్టింగ్ కోసం చేసిన ఖర్చులను తిరిగి రాబట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటుపడి అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కుకుంటున్నారు. అరైస్టె జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అంతకంటే పెద్ద పోస్టుల్లో చేరి, మళ్లీ అదే తంతు కొనసాగించడం విస్మయం కలిగిస్తోంది. సర్కిల్ ఆఫీసుల్లోనూ అక్రమార్కుల తిష్టః హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్ సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల పరిధిలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయి. కొత్త కనెక్షన్లకు ఎస్టిమేషన్లు సైతం ఉండవు. దీంతో ఆశించిన స్థాయిలో అదనపు ఆదాయం సమకూరదు. ఆయా డివిజన్లు, సబ్డివిజన్లు, సెక్షన్లలో పోస్టులకు ఇంజనీర్లు పనిచేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. శివారులోని మేడ్చల్, సైబర్‌సిటీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్ సర్కిళ్లలో హైరైజ్ భవనాలు, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఐటీ అనుబంధ సంస్థలు, పారిశ్రామిక వాడలు ఎక్కువ. ఇక్కడ పోస్టుల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. ఆ తర్వాత అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. కేవలం క్షేత్రస్థాయిలోని ఆర్టిజన్లు, ఏఈలు, ఏడీఈలు మాత్రమే కాదు సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, మేడ్చల్ సర్కిల్ ఆఫీసుల్లోని కీలక అధికారులు సైతం ఒక్కో ఫైలుకు ఒక్కో రేటు నిర్ణయించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. మచ్చుకు కొన్ని ఏసీబీ కేసులు ● అదనపు లోడు కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వినియోగదారుడి నుంచి లాలాగూడ సెక్షన్ ఇన్చార్జి ఏఈ భూమిరెడ్డి సుధాకర్‌రెడ్డి రూ.15 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ● ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంబాగ్ డివిజన్ ఏడీఈ అంబేడ్కర్ ఇప్పటికే ఏసీబీ కేసులో జైలుకు వెళ్లారు. ఆయనకు బినామీగా వ్యవహరించినట్లు ఆరోపణలున్న చేవెళ్ల ఏడీఈ రాజేశ్‌పై సైతం ఇటీవలే ఏసీబీ కేసు నమోయింది. ● గోపన్‌పల్లిలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనానికి విద్యుత్ మీటర్ మంజూరు కోసం రూ.50 డిమాండ్ చేసి గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీశ్ ఏసీబీకి చిక్కారు. ఆయన వంద కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. ● విద్యుత్‌శాఖ గోల్నాక సెక్షన్ జూనియర్ లైన్మెన్ శివమల్లేష్ కమర్షియల్ మీటర్ కనెక్షన్ కోసం రూ.30 వేలు తీసుకుంటూ దొరికిపోయారు. ● మంచాల మండలంలోని ఓ వెంచర్లో రోడ్డుకు అడ్డుగా ఉన్న 11 కేవీ, 33 కేవీ లైన్ల మార్పునకు, నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు సరూర్‌నగర్ సర్కిల్ ఎలక్ట్రికల్ (టెక్నికల్) డివిజనల్ ఇంజనీర్ (డీఈ) టి.రాంమ్మోహన్ డబ్బులు డిమాండ్ చేసి, సదరు కాంట్రాక్టర్ నుంచి రూ.18 వేలు తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి పట్టుబడిన విషయం సంచలనం సృష్టిచింది. వ్యవస్థాగతంగా వేళ్లూనుకున్న అవినీతి, అక్రమ వసూళ్లను పూర్తిగా నియంత్రించి, పారదర్శకుతకు పెద్దపీట వేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అంచనాలు రూపొందించడం మొదలు కనెక్షన్లు, మీటర్లు, ప్యానల్ బోర్డులు, డీటీఆర్‌ల మంజూరీ, లైన్ షిఫ్టింగ్ వర్కుల వరకు ఇలా ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి క్షేత్ర స్థాయిలోని ఆర్టిజన్లు, జూనియర్ లైన్మెన్లు, ఏఈలు, ఏడీఈలు, డీఈలు ఇలా ఎవరి స్థాయిలో వారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అవినీతి నిర్మూలన, పనుల్లో పారదర్శకత కోసం సీఎండీ ముషారఫ్ అలీ ఇటీవల 040–23454884, 7680901912 ఫోన్ నంబర్లుతో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పోస్టర్లు ముద్రించి, ఆ మేరకు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న అన్ని సెక్షన్లు, ఈఆర్ఓ కేంద్రాలు, సబ్‌స్టేషన్లలోనూ అతికించింది. ఇప్పటికే 60కిపైగా ఫిర్యాదులు అందాయి. అక్రమ వసూళ్లు, విధినిర్వహణలో నిర్లక్ష్యానికి పాల్పడిన 19 మంది ఇంజనీర్లపై అంతర్గత విచారణ చేపట్టి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా క్షేత్రస్థాయిలోని కొంత మంది అక్ర మార్కుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. -
ఇద్దరిని బలిగొన్న ఈత సరదా
రాజేంద్రనగర్: జలపాతంలో ఈతకొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్ ఎం.ఎం.పహాడీకి చెందిన మహ్మద్ రెహాన్ (16), సోహేల్ (15)లతో పాటు మరో నలుగురు బైక్‌లపై ఆదివారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ ప్రాంతంలోని మొండికత్వ ప్రాంతానికి చేరుకున్నారు. జనచైతన్య వెంచర్‌లోని ఖాళీ స్థలంలో వాహనాలను పార్కు చేసి జలపాతం వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు మహ్మద్ రెహాన్, సోహేల్లు నీళ్లలో మునిగిపోయారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 8 గంటల వరకు వెతికి ఇద్దరి మృతదేహాలు నీటిలోంచి వెలికితీశారు. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
రక్తమోడుతున్న రహదారి..!
శంషాబాద్ రూరల్: రహదారి విస్తరణ పనుల్లో జాప్యం నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొండుపల్లి రైల్వే వంతెన సమీపం నుంచి పాల్మాకుల వరకు మండల పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పనులను ప్రారంభించి దాదాపు మూడేళ్లు గడిచినా... ఓ అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. ఈ రహదారిపై రాత్రి సమయంలో ప్రయాణం వాహనదారులకు నరక ప్రాయమవుతోంది. ఆరు వరుసలుగా... శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి నుంచి కొత్తూరు వరకు 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రహదారిని ఆరు వరుసలకు విస్తరించడానికి సుమారు రూ. 540 కోట్లు కేటాయించారు. ఈ పనులను 2022 ఏప్రిల్‌లో కేంద్ర మంత్రి ఘడ్కరీ ప్రారంభించారు. ఆరంభంలో పనులు జోరుగా సాగినా.. మధ్యలో ఏడాది పాటు పనులు నిలిచిపోయాయి. అడపాదడపా అక్కడక్కడ పనులు చేస్తూ.. కాలం సాగదిస్తున్నారు. ప్రమాదాలతో ప్రాణాలకు ముప్పు... విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో రహదారిపై జరుగుతున్న ప్రమాదాలతో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల కాలంలో పదుల సంఖ్యలో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసాయి. ఇక గాయాలై ఆస్పత్రి పాలైన వాహనదారులు చాలా మంది ఉన్నారు. ● రెండు నెలల కిందట మదన్‌పల్లి శివారులో రహదారిపై బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు పక్కన నిర్మాణ సామగ్రిని ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు. ● పాల్మాకుల శివారులో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రహదారిపై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ● ఏదైనా ప్రమాదం జరిగినా.. వాహనాలు మరమ్మతులకు గురైనా రోడ్డుపై గంటల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోతుంది. రాత్రి వేళల్లో జరిగే ఘటనలతో వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు. బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం వాహనదారులకు శాపం పనులను వేగంగా పూర్తి చేయాలి రహదారి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలి. ఈ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అఽధికారులు చొరవ తీసుకుని పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి. – పి.శ్రీనివాస్‌రెడ్డి, పాల్మాకుల -
హత్య పాపం వారిదే..
తండ్రి, కొడుకులను అరెస్టు చేసిన పోలీసులు షాబాద్: హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసును షాబాద్ పోలీసులు ఛేదించారు. సొంత తండ్రి, తమ్మడే హత్య చేసినట్లు నిర్థారించారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. ఈనెల 8న మండల పరిధిలోని కుర్వగూడకి చెందిన దాదే బాలకృష్ణ(45) ఇంట్లో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. విచారణలో తండ్రి, తమ్ముడు బాలకృష్ణని చున్నీతో ఉరివేసి, చంపినట్లుగా నిర్థారించారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించారు. ఆదివారం నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వృద్ధురాలి అదృశ్యం ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని నుచ్చుగుట్ట తండాకు చెందిన నేనావత్ రమ్లి అదృశ్యమైంది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన రమ్లి కుటుంబ సభ్యులతో గొడవ కారణంగా మనస్థాపానికి గురై ఇంటినుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యలు సాధ్యమైన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుమారుడు భీమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బైకును ఢీకొన్న జీపు..ఇద్దరికి తీవ్రగాయాలు హస్తినాపురం: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు స్నేహితులను వెనుక నుండి వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లకు చెందిన ఫయాజ్ (21) మంగళపల్లిలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి బైకుపై అదే కళాశాలలో చదువుతున్న స్నేహితురాలు (21)తో కలిసి సాగర్ రింగ్‌రోడ్డు వైపు వస్తుండగా గుర్రంగూడ వద్ద యూటర్న్‌లో వెనుక నుంచి వేగంగా వచ్చిన థార్ కారు ఢీకొట్టింది. దీంతో ఫయాజ్ తలకు తీవ్రగాయాలు కాగా కుడి కాలు విరిగింది. వెనుక కూర్చున్న స్నేహితురాలి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేయగా క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఫయాజ్‌కు ప్రాథిమిక చికిత్స అనంతరం మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించగా, అతని స్నేహితురాలిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన జీపు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవినాయక్ తెలిపారు. -
ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్
మొయినాబాద్: ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆదివారం మొయినాబాద్‌లో పథ సంచాలన్(రూట్ మార్చ్) చేపట్టారు. వందలాది మంది ఆర్ఎస్ఎస్ కర సేవకులు భరత మాత, హెగ్డేవార్, గోల్వాల్కర్ చిత్రపటాలతో మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మమత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ శంకర్పల్లి ఖండ కార్యవాహ చేకుర్త నాగిరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ హెగ్డేవార్ ఆశయాలే స్ఫూర్తిగా హిందూ సమాజం మరింత శక్తివంతమయ్యే దిశగా స్వయం సేవకులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గణేశ్, మహేందర్, సాయితేజ, సత్యనారాయణ, ప్రసాద్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, సుశాంత్ పాల్గొన్నారు. -
వాట్సాప్ వ్యవసాయం
దుద్యాల్: రైతులకు వ్యవసాయ సమాచారం సులువుగా అందించేందుకు వ్యవసాయ శాఖ నూతనంగా వాట్సప్ చానల్ రూపొందించింది. సాగు చేసిన పంటలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఈ చానల్లో శాస్త్రవేత్తలు,వ్యవసాయాధికారులు సూచనలు అందిస్తున్నారు. ఈ చానల్ పంటలకు సంబంధించి కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో కర్షకులకు చేరవేస్తూ అండగా నిలుస్తోంది. ప్రభుత్వ పథకాలు, వాతావరణ సూచనలు, నాటు పద్ధతులు, ప్రభుత్వ రాయితీలు, తదితర వ్యవసాయ సమాచారాన్ని అందిస్తున్నారు. తెలుగులో సమాచారం వ్యవసాయశాఖ ప్రారంభించిన వాట్సాప్చానల్లో అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక ప్రతిభావంతులను చేర్చారు. తాజాగా గ్రూప్‌లో రైతులను చేర్చాలని ఆదేశాలు రావడంతో ఆసక్తి ఉన్న రైతులను వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ రైతు వాట్సాప్ చానల్లో చేరే అవకాశం కల్పించింది. విత్తన దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు పంటల సమాచారం రైతులకు సులువుగా చేరుతోంది. తెలుగులోనూ సమాచారం అందుబాటులో ఉండడంతో రైతులు వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫొటోల సాయంతో తెగుళ్ల లక్షణాలు, నివారణకు పురుగు మందులు ఎలా వినియోగించాలనే సమాచారం ఇస్తున్నారు. వాట్సాప్ చానల్లో చేరాలనుకుంటే సంబంధిత ఏఈఓ, మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒక్క క్లిక్‌తో.. వ్యవసాయశాఖ రూపొందిన వాట్సాప్ చానల్ ద్వారా రైతులు ఒక క్లిక్‌తో నేరుగా శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు పొందొచ్చు. పంటల రోగ నిరోధకత, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, విత్తనాల ఎంపిక వంటి సలహాలు అరచేతిలోకి చేరుతున్నాయి. తమ సమస్యలను ఫొటో లేదా మెసేజ్ రూపంలో షేర్ చేస్తే నిపుణులు వెంటనే సమాధానం అందిస్తారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది రైతులకు ఒకేసారి సమాచారం తెలుసుకునేందుకు డిజిటల్ వ్యవసాయ విజ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉందని రైతులు చెబుతున్నారు. తక్షణ పరిష్కారం రైతులకు సాంకేతిక పరిజ్ఞానం నేరుగా అందించడం వ్యవసాయ శాఖ ఉద్దేశం. ఇప్పటికే రైతులు సమాచారలోపంతో సాగు చేస్తున్న పంటల్లో దిగుబడులు తగ్గి నష్టపోతున్నారు. అందరి రైతుల వద్దకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెళ్లడం కష్టం. ఈ చానల్ ద్వారా శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు పొందొచ్చు. సమస్యలపై తక్షణ పరిష్కారం అందించడంతో ఉత్పత్తి పెరుగుతుంది. సమయం, ఖర్చు తగ్గుతుంది. రైతులు చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. – రాజారత్నం, జిల్లా వ్యవసాయాధికారి, వికారాబాద్ -
డబ్బు కోసం వేధింపులు
మణికొండ: తాను కొనుగోలు చేసిన స్థలంలో ఇంటిని నిర్మింకుంటున్న ఓ వ్యక్తిని మాజీ కార్పొరేటర్ ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమాలినా వినిపించుకోకుండా డబ్బులు ఇవ్వకపోతే లోపల వేసి కొడతానని బెదిరించాడు. మాజీ కార్పొరేటర్ అడిగింది ఇచ్చి సమస్య తీర్చుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారి(టీపీఓ) పలు మార్లు నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లి మరో వైపు వేధించాడు. వాటిని తాళలేక స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను బాధితుడు అశ్రయించాడు. ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ మేయర్‌కు సిఫారసు చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మాజీ డిప్యూటీ మేయర్ ఇంట్లో పంచాయతీ పెట్టి చివరకు రూ. 4 లక్షలు చెల్లించాడు. అయినా వేధింపులు ఆగక పోవటంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డితో పాటు అతని అనుచరుడు సందీప్‌రెడ్డిలను అరెస్టు చేశారు. బాధితుడు నానాజీ శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ హైదర్షాకోట్లో 100 గజాల పాత ఇంటిని ఇటీవల కొనుగోలు చేశానన్నారు. పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటి నిర్మాణం చేపడుతుండటంతో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు. తను కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించానన్నాడు. దాంతో మాజీ కార్పొరేటర్ టీపీఓ రాకేష్‌కు చెప్పి పనులను పలుమార్లు నిలుపుదల చేయటం, నిర్మాణ సామగ్రి తీసుకెళ్లి వేధించారన్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు.. తన స్థలంలో తను ఇంటి నిర్మాణం చేస్తుంటే మాజీ కార్పొరేటర్ వేధిస్తున్నాడని బాధితుడు నానాజీ ఇటీవల ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. దాంతో ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేసి అతన్ని వేధించవద్దని మాజీ కార్పొరేటర్‌కు చెప్పాలని సూచించాడు. అయినా మాజీ కార్పొరేటర్ పట్టు వీడకుండా టీపీఓతో కలిసి వేధించటంతో మాజీ డిప్యూటీ మేయర్ ఇంట్లో ఇటీవల సమావేశం అయి మాజీ కార్పొరేటర్‌కు చివరకు రూ. 3 లక్షలు నగదుగా, రూ. లక్ష ఆన్లైన్లో చెల్లించాడు. సమస్య తీరిందని అనుకున్నా తనను వదలకుండా మరో మారు డబ్బులు ఇవ్వాలని వేధించటంతో శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు. ఫిర్యాదులో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డి, అతని అనుచరుడు సందీప్‌రెడ్డి, టీపీఓ రాకేష్‌లు వేధించినట్టు పేర్కొన్నానని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం మాజీ కార్పొరేటర్, అతని అనుచరున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సమాచారం. టీపీఓ పాత్రపైన విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఈ కేసు విషయమై నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.మాజీ కార్పొరేటర్ అరెస్టు ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షలు డిమాండ్ శ్రీనాథ్‌రెడ్డికి టీపీఓ వత్తాసు ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితుడు మాజీ డిప్యూటీ మేయర్ వద్ద రూ. 4 లక్షలు చెల్లింపు అయినా ఆగని వేధింపులతో పోలీసులకు బాధితుడి ఫిర్యాదు -
ఆస్పత్రికి వెళ్లిన మహిళ అదృశ్యం
చేవెళ్ల: ఆస్పత్రికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఓ మహిళ అదృశ్యం అయింది. ఈ సంఘటన దేవునిఎర్రవల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అరుంధతి(46) శుక్రవారం ఉదయం ఇంటి నుంచి చేవెళ్లలోని హాస్పిటల్‌కు వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి రాలేదు. ఆమె పోన్ స్విచ్ఛాఫ్ అయింది. రాత్రి వరకు చుట్టుపక్కల, చేవెళ్లలో, తెలిసిన వారిని, బంధువుల వద్ద ఆరా తీసినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అరుందతి తమ్ముడు దయాకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రయాణానికి నిరీక్షణ
పండుగలు, పెళ్లిళ్లు, సెలవులు సాక్షి, సిటీబ్యూరో: వందల్లో రైళ్లు. వేలల్లో బెర్తులు. అయినా తప్పని నిరీక్షణ. పండుగలు, పెళ్లిళ్లు, వరుస సెలవులు, శుభకార్యాలు, అయ్యప్ప భక్తుల శబరి పర్యటనల రద్దీతో రైళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. సాధారణ రోజుల్లో కంటే ప్రత్యేక సందర్భాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రద్దీ సహజంగానే రెట్టింపవుతోంది. ఇందుకనుగుణంగా వివిధ మార్గాల్లో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. అదనంగా సుమారు 150 రైళ్లు దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి వంటి పండుగలు, వరుస సెలవుల దృష్ట్యా అన్ని రెగ్యులర్ రైళ్లలో భారీ డిమాండ్ నెలకొంది. సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కోల్‌కతా, చైన్నె, శబరి, దానాపూర్, పట్నా, ఢిల్లీ తదితర నగరాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల జాబితా గణనీయంగా పెరిగింది. మరోవైపు ఎప్పటికప్పుడు ఈ డిమాండ్ అధికమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక రైళ్ల నిర్వహణకు ప్రణాళికలను రూపొందించారు. వివిధ మార్గాల్లో సుమారు 150 రైళ్లను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి ప్రయాణం కష్టమే.. ● సంక్రాంతికి 25 లక్షల నుంచి 30 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా. రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు సొంత వాహనాల్లోనూ ఎక్కువ మంది బయలుదేరుతారు. కాగా.. ఇప్పటికే కొన్ని రూట్లలో డిమాండ్ మేరకు అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. అయినా రోజురోజుకూ ప్రయాణికుల డిమాండ్ పెరుగుతూనే ఉంది. సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరే విశాఖ, ఫలక్‌నుమా, కోణార్క్, నాందేడ్ సూపర్‌ఫాస్ట్, ఈస్ట్‌కోస్ట్, గరీబ్‌రథ్, దురంతో తదితర రైళ్లలో 100 నుంచి 150 వరకు వెయిటింగ్ లిస్ట్ నమోదు కావడం గమనార్హం. ● కాకినాడ వైపు వెళ్లే గౌతమి, నర్సాపూర్ తదితర రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 100 వరకు నమోదైంది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వరకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు దీపావళ్లి రద్దీ పోటెత్తింది. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి ముజఫర్‌నగర్‌కు కొత్తగా అమృత్‌భారత్‌ను ప్రవేశపెట్టినప్పటికీ దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. దీపావళి వేడుకల కోసం నగరం నుంచి యూపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు రైళ్ల కోసం ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకూ దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు రద్దీ భారీగానే ఉండనుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ఎయిర్‌లైన్స్ చార్జీలను రెట్టింపు చేశాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, నాగ్‌పూర్ తదితర నగరాలకు చార్జీలు అనూహ్యంగా పెరిగినట్లు సమాచారం. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రూ.6,000 వరకు చార్జీలు ఉంటే ఈ నెల 18, 19, 20 తేదీల్లో రూ.9,000 నుంచి రూ.12,000 వరకు పెంచారు. జైపూర్ రూ.7,000 నుంచి ఏకంగా రూ.15,000 వరకు చార్జీలు పెరిగాయి. కోల్‌కతాకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఉంటుంది. దీపావళి దృష్ట్యా ప్రస్తుతం రూ.12,000 వరకు పెరిగినట్లు ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులు చెప్పారు. రైళ్లకు భారీ డిమాండ్ వందల్లో వెయిటింగ్ లిస్ట్ శబరి ఎక్స్‌ప్రెస్‌లో నో రూమ్ పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఫ్లైట్ చార్జీలు సైతం ౖపైపెకి.. సిటీ నుంచి పెరగనున్న రద్దీ -
రైతులకు వరం ‘పీఎం ధన్‌ధాన్య’
ఈవీఎంల గోడౌన్ పరిశీలన రాజేంద్రనగర్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సందర్శించారు.ఇబ్రహీంపట్నం రూరల్: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఎందో దోహదపడుతుందని జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల మిషన్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్ ద్వారా ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి, వివిధ మండలాల నుంచి దాదాపుగా 200 మంది రైతులు, కేవీకే సెంటర్, క్రిడా తరఫున శాస్త్రావేత్తలు, డివిజన్ ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. ఈ పథకం ఆరేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగం తక్కువ ఉత్పాదకత, తగినంత హామీ లేని నీటి పారుదల, పరిమిత రుణ లభ్యత, పంట కోత తర్వాత మౌలిక సదుపాయలు లేకపోవడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. వ్యవసాయ సామర్థ్యం సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి పరంగా వెనుకబడిన అనేక జిల్లాల్లో ఈ సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈ అంతరాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్రం 2025 బడ్జెట్లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజన కింద 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త విజయ్‌కుమార్, చిత్తాపూర్ గ్రామ రైతు అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయంలో తన అనుభాలను తోటి రైతులతో పంచుకున్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఉష -
ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్లిన వ్యక్తి అదృశ్యం
శంషాబాద్ రూరల్: అప్పులు తీర్చే మార్గలేక.. కొడుకు చదువుకోవడానికి హాస్టల్‌కు వెళ్లనంటూ మారాం చేయడంతో మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... పిల్లోనిగూడకు చెందిన పానుగంటి శ్రీనివాస్(40) కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఇతని కొడుకు కిశోర్ దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ నెల 10న శ్రీనివాస్ తిరిగి హాస్టల్‌కు కొడుకును తీసుకుని వెళ్లగా.. అక్కడ ఉండనంటూ కిశోర్ ఏడ్వడంతో ఇంటికి తీసుకొచ్చాడు. సోదరుల వద్ద తీసుకున్న అప్పు కట్టడానికి డబ్బులు లేవంటూ.. కొడుకు హాస్టల్లో ఉండటం లేదనే బాధతో శ్రీనివాస్ అదే రోజు రాత్రి బాధ పడ్డాడు. తాను చనిపోతానని ఇంట్లో తాడు తీసుకుని పొలానికి బయలుదేరాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వారించినా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో శంషాబాద్ భక్తుల ఇబ్బందులు
● ఓ కుటుంబం లగేజీ మాయం ● స్పందించిన రాజేంద్రనగర్ ఆర్డీఓ ● శంషాబాద్‌కు పయనమైన కుటుంబం శంషాబాద్: తిరుమలలో శంషాబాద్‌కు చెందిన ఓ కుటుంబం లగేజీ మాయం కావడంతో నాలుగు రోజులు అక్కడ ఇబ్బంది పడింది. చివరకు అధికారుల సహకారంతో నగరానికి బయలుదేరారు. వివరాలు.. తిరుమలలో ఐదుగురు సభ్యులుగా కుటుంబం స్వామివారి దర్శనం చేసుకుంది. ఆ తరువాత వారి లగేజీ మొత్తం దొంగలు కొట్టేశారో.. లేక పొగొట్టుకున్నారో తెలియదు కానీ అయోమయంతో కొండ కిందికి చేరుకుని రైల్వేస్టేషన్‌కు వచ్చారు. నాలుగురోజులుగా వారిని గమనిస్తున్న రైల్వేపోలీసులు ఏం జరిగిందని ప్రశ్నించినా సరైన సమాధానం రావడం లేదు. వృద్దురాలికి, ఆమె కుమారుడికి మాటలు రావడం లేదు. ఓ మహిళ మాట్లాడినా అర్థం కావడం లేదు. పిల్లలు ఎంత అడిగా సరిగా మాట్లాడడం లేదు. అధికారులు కాగితం పెన్ను ఇవ్వడంతో శంషాబాద్ హి హీరోహోండా షాపు, పైన లగేజీలు పోయాయని రాసింది. దీంతో మూడు రోజులుగా రైల్వేపోలీసులే వారి భోజనం సమకూరుస్తున్నారు. ఆ కుటుంబాన్ని పంపేందుకు రైల్వేపోసులు సాక్షిని సంప్రదించి శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు.. ఆర్డీఓ స్పందించి వారి రాకకోసం ఏర్పాట్లు చేయడంతో శనివారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరే బస్సులో వారిని రైల్వే పోలీసులు పంపారు. -
తైక్వాండోలో జాతీయ స్థాయికి ఎంపిక
నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–14 ఎస్జీఎఫ్ తైక్వాండో టోర్నీ శనివారం ముగిసింది. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి ఆధ్వర్యంలో బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలు అందించారు. పోటీల్లో మనస్విని (నిజామాబాద్), జునేరియా కుల్సమ్ (నల్లగొండ), సమన్విత (రంగారెడ్డి), కతిజాఫాతిమా (నిజామాబాద్), మగేశ్ మెహరిన్ (రంగారెడ్డి), హారిక (రంగారెడ్డి), సమీక్ష (రంగారెడ్డి), టి.వైష్ణవి(హైదరాబాద్) బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28 నుంచి నాగాలాండ్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు నాగమణి పేర్కొన్నారు. పోటీలను ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఈశ్వర్, పరిశీలకుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
ముగిసిన ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు
రాజేంద్రనగర్: శివరాంపల్లి పాఠశాల ఆవరణలో మూడు రోజుల పాటు నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఈ పోటీల్లో గెలుపొందిన విజేత జట్టులకు ఎంఈవో శంకర్ రాథోడ్, జీహెచ్ఎం భూక్య శ్రీను నాయక్, ఆదర్శ విద్యాలయ చైర్మన్ శ్రవణ్ కుమార్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పడమటి శ్రీధర్ రెడ్డి, జోనల్ స్థాయి సెక్రటరీ గాంగ్య నాయక్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 210 టీమ్‌లు వివిధ క్రీడాలలో పాల్గొన్నారు. క్రీడలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జోనల్ స్థాయికి ఎంపిక చేశారు. జోనల్ స్థాయి పోటీలు ఆదివారం నుండి శివరాంపల్లి జడ్పీహెచ్ఎస్లో జరుగుతాయని జోనల్ సెక్రటరీ గాంగ్య నాయక్ తెలిపారు. మండలంలోని వివిధ సంఘాల నాయకులు, పీఆర్టీయూ అధ్యక్షుడు కడుమూరి సుదర్శన్, ఎస్టీయూ అధ్యక్షుడు కామిశెట్టి వెంకటయ్య, యూటీఎఫ్ అధ్యక్షుడు యాదగిరి, ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనార్దన చారి, పీడీలు జ్యోతి, రంగారెడ్డి, బాలస్వామి రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఈవీఎంల గోడౌన్ పరిశీలన
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎంల గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించారు. రాజేంద్రనగర్ తహసీల్దార్, వేర్ హౌస్ ఇన్చార్జి రాములు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయికి..
● ఎస్జీఎఫ్ క్రీడల్లో సత్తాచాటిన తాండూరు విద్యార్థులు ● స్టేట్ లెవల్ పోటీలకు ఎనిమిది మంది ఎంపిక తాండూరు టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్) జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో తాండూరు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్– 14, 17 విభాగాల్లో ఎనిమిది మంది బాలబాలికలు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శనివారం పరిగిలో నిర్వహించిన అండర్– 14 విభాగం డబుల్స్‌లో సాయి ప్రతీక్, అర్జున్‌గౌడ్ ప్రథమ స్థానం, సింగిల్స్‌లో సాయి ప్రతీక్ ప్రథమ స్థానం, అర్జున్ గౌడ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలికల అండర్– 14 విభాగం డబుల్స్‌లో సందర్శిని, దీక్ష ద్వితీయ స్థానం, బాలికల అండర్– 17 విభాగం డబుల్స్‌లో నందిని, మేరీజోన్స్ ద్వితీయ స్థానం, బాలుర విభాగంలో మణికంఠ, చరణ్ ద్వితీయ స్థానం సాధించారు. ఈ ఎనిమిది మంది వికారాబాద్ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కాగా సెయింట్ మార్క్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపాల్ ఆరోగ్యరెడ్డి, పీడీలు రాము, చరణ్ అభినందించారు. జిల్లా పోటీలకు 108 మంది ఎంపిక.. శంకర్పల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం జోనల్ స్థాయి అండర్– 14, 17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, వాలీబాల్ ఎంపికలు నిర్వహించినట్లు ఎంఈఓ అక్బర్, జోనల్ సెక్రెటరీ ప్రభాకర్ తెలిపారు. మండలం పరిధిలోని మియాఖాన్‌గడ్డలో నిర్వహించిన సెలెక్షన్స్‌లో జోన్ పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి మండలాలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో కబడ్డీ అండర్– 14 బాలబాలికల విభాగంలో 15 మంది చొప్పున 30 మందిని, అండర్– 17 విభాగంలో 15 మంది చొప్పున 30 మందిని, వాలీబాల్ అండర్– 14 బాలబాలికల విభాగంలో 12 మంది చొప్పున 24 మందిని, అండర్– 17లో 24 మందిని ఎంపిక చేశామన్నారు. వీరు ఈనెల 14న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు బస్వరాజ్, శంకర్, అరుంధతి, పల్లవి, నాగ సంధ్య, అనురాధ, మల్లేశ్, రవీందర్, శ్రీనివాస్, ఆనంద్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న విద్యార్థులతో ఎంఈఓ అక్బర్, జోనల్ సెక్రెటరీ, ఫిజికల్ డైరెక్టర్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులతో పీడీలు, తదితరులు -
రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి రద్దు చేయడం జరిగిందని తెలిపారు. హైకోర్టు స్టే విధించిందున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వాయిదా వేయడం జరిగిందని, ప్రజావాణి కార్యక్రమాన్ని ఎప్పటిలాగే కొనసాగించడం జరుగుతుందని చెప్పారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. పహాడీషరీఫ్: రాష్ట్రంలో మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ కారోబార్, బిల్ కలెక్టర్ల కమిటీ కోరింది. ఈ మేరకు కమిటీ నాయకులు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2016లో ఇచ్చిన జీవోఎంఎస్–14 ప్రకారం మున్సిపాలిటీలో కలిసిన గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. తమకు కేటాయించిన పనులను సమర్థవంతంగా చేస్తున్నప్పటికీ, నెలకు కేవలం రూ.15,600 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.22,750 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం: డీజీపీ శివధర్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా 12 కోర్టు భవన సముదాయాల నిర్మాణం గురించి వివరించారు. తనవంతు సహకారం అందిస్తానని శివధర్‌రెడ్డి తెలిపినట్లు వారు చెప్పారు. అదేవిధంగా న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డిని సైతం కలిసి స్థానిక సమస్యలను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్ద వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎలమొని భాస్కర్, లైబ్రరీ సెక్రటరీ నిట్టు పాండు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: ప్రజాహితం పర్యావరణ పరిరక్షణ సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఇబ్రహీంపట్నం బీడీఎల్ రోడ్డు నుంచి 2 కే రన్ ప్రారంభం అవుతుందని సంస్థ చైర్మన్ సురేష్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు చెప్పారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతగిరి: ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ (కవాతు) వికారాబాద్ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా భారీ కవాతు నిర్వహించారు. పట్టణంలోని కొత్తగంజ్ నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా సాగింది. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సద్భావన సహ ప్రముఖ్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఽహిందూ ధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ పాటుపడుతుందన్నారు. ఈ దేశానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. యావత్ ప్రపంచానికే దిశానిర్దేశం చేసిన ఘనత భరత భూమికే దక్కుతుందన్నారు. హిందూ సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని.. రాబోయే రోజుల్లో ప్రపంచానికే దేశంఆదర్శంగా నిలవబోతుందన్నారు. -
తడి, పొడి చెత్త ఎక్కడ?
నందిగామ: ‘గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను ఎక్కెడెక్కడ నిల్వ ఉంచారు. ఎంత మేర వర్మీ కంపోస్టు తయారు చేశారు’ అని డీపీఓ సురేష్ మోహన్.. రంగాపూర్ గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎంపీఓ తేజ్ సింగ్‌లను ప్రశ్నించారు. దీనికి వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాపూర్‌లో కంపోస్టు యార్డును శుక్రవారం డీపీఓ తనిఖీ చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత అధికారులైన గ్రామ కార్యదర్శి, ఎంపీఓపై మండిపడ్డారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, కంపోస్టు యార్డుకు తరలించాలని, పరిసరాలను పరిశుభ్రగా ఉంచాలని ఆదేశించారు. వారంలోపు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల బిజీ కారణంగా కొంత నిర్లక్ష్యం జరిగిందని, వారం రోజుల్లో కంపోస్టు యార్డుల్లో తడి పొడి చెత్తను వేర్వేరుగా వేసి, కంపోస్టును తయారు చేస్తామని ఎంపీఓ తేజ్ సింగ్.. డీపీఓకు వివరణ ఇచ్చారు. ● వర్మీ కంపోస్టు తయారీ ఎంత? ● గ్రామ అధికారులపైడీపీఓ సురేష్ మోహన్ ప్రశ్నల వర్షం -
పొలాలు పోతే బతికేదెట్లా?
అన్నదాతల ఆవేదన.. ● రేడియల్ రోడ్డుపై వ్యతిరేకతకొందుర్గు: ‘అభివృద్ధి పనుల పేరిట చేపట్టనున్న రోడ్డు నిర్మాణం.. నేల తల్లిని నమ్ముకున్న మాకు శాపంగా మారింది. జీవనోపాధి కోల్పోతాం. రోడ్డున పడతాం’ అని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డును కలిపేందుకు నిర్మించతలపెట్టిన రేడియల్ రోడ్డుకు ఓ వైపు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ.. శుక్రవారం సర్వే పనులు చేస్తుండగా.. సమీపాన సాగుభూములు కలిగిన కర్షకులు.. ఆందోళన చెందారు. పొలాలు పోతే బతికేదెట్లా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తమ పొలాల నుంచి రోడ్డు వెళ్లకుండా చూడాలని కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ అజాంఅలీ ఖాన్‌ను వివరణ కోరగా.. రోడ్డు మార్కింగ్ చేస్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. మూడు ప్రతిపాదనలు సిద్ధం సర్వే పనులు మొదలు పెట్టిన కన్సల్టెన్సీ ప్రతినిధులు మాట్లాడుతూ.. షాబాద్ మండల కేంద్రం మీదుగా చుక్కమెట్టు, ముట్పూర్, ఉమ్మెంత్యాల నుంచి పరిగి మండలం గూడూరు వరకు 55 కిలో మీటర్ల వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అయితే ఈ రహదారికి సంబంధించి మూడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వం ఏదైనా ఒక దానిని ఆమోదం తెలపవచ్చని పేర్కొన్నారు.షాబాద్ శివారు వద్ద రోడ్డు సర్వే చేస్తున్న కన్సల్టెన్సీ సిబ్బంది -
ఖాతాదారులకు జవాబుదారీగా ఉండాలి
తుక్కుగూడ: ఖాతాదారులకు జవాబుదారీగా ఉండాలని తపాలా శాఖ ఏఎస్పీ జోయల్ అన్నారు. శుక్రవారం పుర పరిధి మంఖాల్ పోస్టాఫీస్‌ను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయం ద్వారా తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం కలిపిస్తుందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయా లని సిబ్బందికి సూచించారు. కార్యాలయానికి వచ్చే లేఖలు, వివిధ పత్రాలను సకాలంలో ప్రజలకు చేరవేయాలని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ తపాల దినోత్సవం సందర్భంగా కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో శాఖ ఎస్పీఎం నవీన్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
రంగారెడ్డి జిల్లా: హయత్‌నగర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్– 19 ఎస్జీఎఫ్ బాలుర కబడ్డీ విభాగంలో కందుకూరు (నిశిత క్యాంపస్) మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్) కళాశాల నుంచి పి.శ్రీనాథ్, కార్తీక్‌రెడ్డి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దీప, కళాశాల స్టాఫ్, పీడీ గణేశ్, పీఈటీ హనుమంత్ తదితరులు శుక్రవారం విద్యార్థులను అభినందించారు. రంగారెడ్డి జిల్లా నుంచి స్టేట్ లెవల్‌కు ఎంపికై న శ్రీనాథ్, కార్తీక్‌రెడ్డి మహబూబాద్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
లక్ష గాంధీ విగ్రహాల సేకరణ షురూ
హయత్‌నగర్: మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో భాగంగా పలు రూపాల్లో ఉన్న లక్ష గాంధీ విగ్రహాలను సేకరించే కార్యక్రమం చేపట్టినట్టు గ్లోబల్ ఫ్యామిలీ వ్యవస్థాపక అధ్యక్షుడు గున్న రాజేందర్‌రెడ్డి అన్నారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని కుంట్లూర్‌లో గల గాందేయన్ కళాశాలలో శుక్రవారం లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష గాంధీ విగ్రహాలను సేకరించి ప్రజలకు అందించడం ఒక ఉద్యమంగా చేపట్టామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు గాంధీ మార్గమే ఉత్తమమైనదని పేర్కొన్నారు. గాంధీ తత్వాన్ని యువతకు, రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా విగ్రహాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలతో గాంధీ విగ్రహాల సేకరణ అనే అక్షరమాలను ప్రదర్శించారు. సంస్థ ఉపాధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ గాంధారి ప్రభాకర్ పాల్గొన్నారు. -
వృథాగా ఉందని పాగా..
స్థానికంకేశంపేట: వృథాగా ఉన్న నక్షబాట కబ్జాకు కొందరు రియల్టర్లు యత్నించారు. కుట్రలో భాగంగా జేసీబీ సహాయంతో దానిని ధ్వంసం చేయగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వేముల్‌నర్వ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం వేముల్‌నర్వ నుంచి షాద్‌నగర్– కేశంపేటకు రాకపోకలు సాగించేందుకు గ్రామశివారులోని 285, 284, 274 సర్వే నంబర్లలో నక్షబాట ఉండేది. ఈ మార్గంగుండా దేవరకొండ, జడ్చర్లకు సర్వీసులు నడిచేవి. పొలాల మీదుగా ఉందని.. ప్రత్యామ్నాయంగా గతంలో షాద్‌నగర్– కేశంపేటకు మరో మార్గాన్ని.. సర్వే నంబర్ 232లోని ప్రభుత్వ భూమిని దాటిన తరువాత సర్వే నంబర్ 285 మీదుగా కాకుండా 233, 238, 239 సర్వే నంబర్ల మీదుగా రోడ్డును నిర్మించారు. నాటి నుంచి వాహనాలు ఈ రహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో వేముల్‌నర్వ సమీపంలోని 274, 275, 276 సర్వే నంబర్లలో స్థిరాస్తి వ్యాపారులు కొదరు భూములను కొనుగోలు చేశారు. అయితే వారు కొనుగోలు చేసిన పొలాల మీదుగా ఉన్న బాట వృథాగా ఉందని, దానిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రికార్డులు పరిశీలించి.. నక్షబాట కబ్జా విషయంపై కొందరు గ్రామస్తులు.. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులను పరిశీలించి, నక్షాబాట ఉందని తేల్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బాటను ధ్వంసం చేయవద్దని చెప్పారు. బాటతో పాటు పక్కనే నాయినోని చెరువు ఉందని స్పష్టం చేశారు. అనంతరం రియల్టర్లు మాట్లాడుతూ.. వెంచర్ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అనుమతులు తీసుకున్నామని, సంబంధిత పత్రాలను తహసీల్ కార్యాలయంలో అందజేస్తామని అధికారులకు తెలిపారు. ప్రవాహానికి అడ్డుగా మట్టి వెంచర్ ఏర్పాటు చేస్తున్న భూములు మీదుగా వాగు ప్రవాహం వచ్చేందుకు గతంలో కల్వర్టును నిర్మించారని ప్రాంత రైతులు తెలిపారు. కానీ రియల్టర్లు వాగునీటి ప్రవాహానికి అడ్డుగా మట్టిని పోస్తున్నారని చెప్పారు. ఇదేమిటని ప్రశ్నించగా.. వాగు నీరు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామని రియల్టర్లు సమాధానం చెప్పారని బాధితులు పేర్కొన్నారు. అలా జరిగితే తమ పొలాలు సాగుకు పని రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెప్పారు. నక్షబాట కబ్జాకు యత్నం జేసీబీ సహాయంతో ధ్వంసం అడ్డుకున్న గ్రామస్తులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించినరెవెన్యూ అధికారులు -
మహాసభలను జయప్రదం చేయండి
మీర్‌పేట: సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు దాసరి బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం పురపాలిక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తుర్కయంజాల్ పట్టణంలో ఈ నెల 14,15న నిర్వహించనున్న సభలో.. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని తెలిపారు. కావున కార్మికులు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరిచారి, కమలమ్మ, లలిత, బావమ్మ, బుచ్చమ్మ, స్వరూప, పున్నమ్మ, శోభ, శ్రీకాంత్, సతీష్, సత్తయ్య పాల్గొన్నారు. -
బీసీలకు న్యాయం జరిగే దాకా పోరాటం
షాబాద్: బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై శుక్రవారం మండల కేంద్రంలో బీసీ సేన ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దుకాణాలు బంద్ చేయించారు. అనంతరం ముంబై–బెంగళూరు లింకు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బర్క కృష్ణ మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలను అణగదొక్కుతూ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసేదాక పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు వెంకట్‌యాదవ్, రవీందర్, బీసీ సేన మండల అధ్యక్షుడు దయాకర్‌చారి, ఉపాధ్యక్షుడు బాలరాజ్, యూత్ అధ్యక్షుడు అజయ్‌కుమార్, నాయకులు రాపోలు నర్సింహులు, చంద్రయ్య, సత్యం, చెన్నయ్య, మల్లేష్, మహేందర్, విఠలయ్య, శ్రీశైలం, నారాయణ, రాఘవచారి, స్వామి, గోపాల్, కుమ్మరి శ్రీను, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
క్రీడాకారులకు ప్రోత్సాహం
షాబాద్: చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులను ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తోందని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఎంఆర్ ట్రస్ట్ సహకారంతో కొనసాగుతున్న 69వ మండలస్థాయి తెలంగాణ స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలు శుక్రవారంతో ముగిసాయి. బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వారికి నచ్చిన క్రీడను ఎంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యులు కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, మాజీ సర్పంచులు నర్సింలు, శ్రీనివాస్‌గౌడ్, మహేందర్‌గౌడ్, లింగం, నాయకులు సుభాష్‌రెడ్డి, రాహుల్, రఫీక్, సూర్య, శ్రీనివాస్, శేఖర్, మాధవ్ రెడ్డి, సాయి పాల్గొన్నారు. -
తారామతిపేటలో మొసలి కలకలం
జూపార్క్‌కు తరలించిన ఫారెస్ట్ అధికారులు అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని తారామతిపేటలో మొసలి కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయాన్నే పొలాలకు వెళ్తున్న రైతులకు ఊరి శివారులోని ఓ రేకుల షెడ్డు వద్ద మొసలి కనిపించడంతో స్థానికులకు సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మూసీ నది కాలువ నీటిలో నుంచి గ్రామంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్, పోలీసు అధికారులకు చెప్పడంతో మొసలిని బంధించి నగరంలోని జూపార్క్‌కు తరలించారు. ఇది 12 అడుగుల పొడవు, 120 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
ముగిసిన జోనల్ స్థాయి కబడ్డీ పోటీలు
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని బాటసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న హయతనగర్ జోనల్ స్థాయి 69వ కబడ్డీ టోర్నమెంట్ కం సెలక్షన్స్ శుక్రవారంతో ముగిశాయి. కార్యక్రమానికి హాజరైన హయతనగర్ జోనల్ సెక్రటరీ నిర్మల మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి అండర్–14, అండర్–17 బాలికలు, బాలురు మొత్తం 1,500 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలిపారు. జోనల్ స్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం ఇదే మొదటిసారని అన్నారు. పోటీలు విజయవంతమయ్యేలా కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. విజేతలుగా వీరే.. ● అండర్ –14 బాలికల విభాగంలో జెడ్పీహెచ్ఎస్ పెద్దఅంబర్‌పేట, రన్నర్స్‌గా ఇంజాపూర్ జెడ్పీస్కూల్ జట్లు నిలిచాయి. ● అండర్ –14 బాలుర విభాగంలో హయత్‌నగర్ జెడ్పీ స్కూల్ జట్టు ప్రథఽమ, తారమతిపేట జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. ● అండర్–17 బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో ఎంజీపీ హయత్‌నగర్ జట్టు, ద్వితీయ స్థానంలో తారమతిపేట జట్టు నిలిచాయి. ● అండర్–17 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ బాటసింగారం.. ద్వితీయ స్థానంలో న్యూ చైతన్య స్కూల్ జట్లు నిలిచాయి. -
జిల్లాలో 249 మద్యం దుకాణాలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లిక్కరుకు ఆశించిన కిక్కు దక్కడం లేదు. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోవడం.. చేతిలో ఆశించిన స్థాయిలో డబ్బులేక పోవడం.. ప్రభుత్వం లైసెన్స్ ఫీజును భారీగా పెంచడం.. నిర్వహణ ఖర్చులు రెట్టింపు కావడం .. వెరసి మద్యం టెండర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. తెలంగాణలోనే అత్యధిక లిక్కర్ అమ్మకాలు జరిగే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడం అబ్కారీ శాఖను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టెండర్లు పిలిచాం.. దాఖలు చేయండి అంటూ మద్యం వ్యాపారులను అభ్యర్థిస్తుండడం విశేషం. అడ్డుకుంటున్న సిండికేట్లు శంషాబాద్ ఎకై ్సజ్ జిల్లా పరిధిలో 111 మద్యం దుకాణాలు ఉండగా, సరూర్‌నగర్ ఎకై ్సజ్ పరిధిలో 138 ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 206, వికారాబాద్ జిల్లాలో 59 దుకాణాలున్నాయి. 2023 ఆగస్టులో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌లోని షాపుల సంఖ్యతో పోలిస్తే.. 2025 సెప్టెంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్లో కొత్తగా 19 దుకాణాలు వచ్చి చేరాయి. గతంలో సరూర్‌నగర్ ఎకై ్సజ్ జోన్ నుంచి 10,994 దరఖాస్తులు రాగా శంషాబాద్‌లో ఎకై ్సజ్ జోన్ నుంచి మరో 10,611 అందాయి. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.432.10 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. 249 షాపులకు.. సంఖ్య ఇప్పటి వరకు 700 మించలేదు. ఇదిలా ఉండగా సరూర్‌నగర్, శంషాబాద్, గచ్చిబౌలి, హయత్‌నగర్ కేంద్రంగా వెలసిన పలు షాపులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని పలువురు వ్యాపారులు భావిస్తున్నారు. అంతా సిండికేట్‌గా ఏర్పడి.. కొత్తగా మద్యం వ్యా పారంలోకి వచ్చే వాళ్లను టెండర్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. గుదిబండగా గుడ్‌విల్ గతంతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో షాపుల సంఖ్య పెరిగింది. లైసెన్సు ఫీజును కూడా రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచారు. దీనికి తోడు ఎకై ్సజ్‌కు ప్రతి నెలా గుడ్‌విల్ పేరుతో భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఓపెన్ టెండర్లో పాల్గొని మద్యం దుకాణాన్ని దక్కించుకున్న వ్యాపారులు ఎకై ్సజ్‌శాఖకు గుడ్‌విల్‌గా రూ.రెండు లక్షలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ప్రతినెలా.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), డీటీఎఫ్ విభాగానికి ఏడాదికి రెండు విడతల్లో రూ.25 వేల చొప్పున ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇక షాపులకు మద్యం సరఫరా చేసే డిపోలకు ఒక్కో బిల్లుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున ముడుపులు చెల్లించాల్సి వస్తోంది. అదనపు చెల్లింపులకు తోడు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వెరసి గతంలో ఒక్కో దుకాణానికి సగటున 92 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం మూడు, నాలుగుకు మించడం లేదు. ఎకై ్సజ్ అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. మరో వారం గడువుందని, ఆఖరి నిమిషంలో వచ్చే దరఖాస్తులే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం శంషాబాద్ ఎకై ్సజ్ యూనిట్‌లోని మూడు స్టేషన్ల పరిధిలో మొత్తం 111 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో శంషాబాద్– 40, శేరిలింగంపల్లి–44, చేవెళ్ల–27 చొప్పున షాపులు ఉన్నాయి. సరూర్‌నగర్ ఎకై ్సజ్ యూనిట్‌లోని ఆరు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 138 షాపులు ఉన్నాయి. వీటిలో సరూర్‌నగర్– 32, హయత్‌నగర్–28, ఇబ్రహీంపట్నం–19, మహేశ్వరం–14, ఆమనగల్లు– 17, షాద్‌నగర్–28 షాపులు ఉన్నాయి. దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. బీసీ గౌడ్స్‌కు 15 శాతం, ఎస్సీలకు పది, ఎస్టీలకు ఐదు శాతం చొప్పున కేటాయించారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను బండ్లగూడ జాగీర్‌లోని తెలంగాణ రాష్ట్ర ఎకై ్సజ్ అకాడమీ (ఈస్ట్)లో స్వీకరిస్తున్నారు. లిక్కర్ షాపు కావాల్సిన వ్యాపారులు స్వయంగా వచ్చి వారి అప్లికేషన్లు సంబంధిత కౌంటర్లలో అందజేయాల్సి ఉంది. ఈనెల 18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఆయా దరఖాస్తుదారుల సమక్షంలో ఈ నెల 23న లాటరీ నిర్వహించనున్నారు. -
పార్కు స్థలం కబ్జాపై హైడ్రా కొరడా
హయత్‌నగర్: పార్కు స్థలం ఆక్రమణపై హైడ్రా కొరడా ఝులిపించింది. పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీ లక్ష్మి గణపతి కాలనీలోని సుమారు 700 గజాల స్థలంలో నిర్మించిన ప్రహరీని కూల్చివేసి స్థలాన్ని విడిపించారు. తట్టిఅన్నారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 76/ఎలో 9.24 ఎకరాల భూమిలో గతంలో లేఅవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు. లేఅవుట్లో సుమారు 2,800 గజాల ఖాళీ స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలేశారు. ఇందులో 700 గజాల స్థలం పురాతన బావి దగ్గర ఉంది. కొంత కాలంగా ఈ స్థలంపై కన్నేసిన స్థానిక నాయకుడు సుమారు 270 గజాలు కొన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి ప్రహరీ నిర్మించాడు. స్థలం ఆక్రమణపై కాలనీవాసులు కొంత కాంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో గత మార్చిలో ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వివరాలు సేకరించి పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయం జేసీబీలతో అక్కడికి చేరుకుని అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు. -
‘బ్రిలియంట్’లో రూ.1.07 కోట్లు చోరీ
● ఫీజు డబ్బులను కాలేజీ ఆఫీసులో భద్రపర్చిన సిబ్బంది ● బీరువా తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన దుండగులు ● సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్స్‌ను సైతం తీసుకెళ్లిన వైనం ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ అనురాధ ● త్వరలోనే దొంగలను పట్టుకుంటామని వెల్లడి అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.1.07 కోట్లు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ విద్యాసంస్థకు చెందిన మూడు కాలేజీల్లో సిబ్బంది నాలుగు రోజులుగా ఫీజు డబ్బులు వసూలు చేశారు. అకౌంటెంట్ సెలవులో ఉండటంతో రూ.1.07 కోట్ల నగదును గురువారం కాలేజీ ఆవరణలోని ఆఫీసు బీరువాలో భద్రపర్చి, ఎప్పటిలాగే తాళాలు వేసి సాయంత్రం 6గంటలకు ఇళ్లకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు వచ్చిచూడగా మెయిన్ డోర్ ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. ఆఫీసు రూమ్ వద్దకు వెళ్లగా బీరువా తలుపులు తెరిచి ఉండటం, అందులోని డబ్బు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై కళాశాల ఏఓ కేశినేని కుమార్ పీఎస్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు మెయిన్ డోర్‌ను ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్ బాక్స్‌ను సైతం ఎత్తుకెళ్లారు. ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అశోక్‌రెడ్డి కాలేజీకి చేరుకుని సిబ్బందిని విచారించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలేజీలో పెద్ద మొత్తంలో డబ్బు చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది. -
తడిసిమోపెడు!
యాచారం మండలంలోని జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. ఓ ప్రధాన పార్టీకి చెందిన నేత జెడ్పీటీసీ టికెట్ తనకే వస్తుందని ఆశించాడు. గెలవాలంటే కనీసం రూ.కోటిన్నర ఖర్చవుతుందని మద్దతుదారులు తెలిపారు. డబ్బు కోసం తెలిసిన వాళ్ల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో స్నేహితుడి ద్వారా నగరంలోని ఓ వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాడు. డబ్బులిస్తా.. కానీ రూ.వందకు రూ.5 వడ్డీ అని తెలిపాడు. సరేనని తన కుటుంబ సభ్యుల పేరు మీద నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న రూ.3 కోట్లకు పైగా విలువచేసే ఐదెకరాల వ్యవసాయ భూమిని ఆరు నెలల చెల్లింపు గడువుతో వడ్డీ వ్యాపారికి రిజిస్ట్రేషన్ చేశాడు. తీరా హైకోర్టు స్టే విధించడంతో లబోదిబోమంటున్నాడు. యాచారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావహులంతా చాలావరకు వడ్డీ వ్యాపారుల తలుపులే తట్టారు. పోటీదారులకంటే అ్ఙధనశ్రీంగా ఖర్చు చేస్తేనే గెలుస్తామనే ఉద్దేశంతో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్లను రిజిస్ట్రేషన్లు చేసి మరీ అప్పులు తెచ్చుకున్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన మరుసటి రోజు నుంచే డబ్బుల జమపై దృష్టి పెట్టారు. జెడ్పీటీసీకి పోటీ చేయాలంటే రూ.కోటిన్నర, ఎంపీపీ కావాలంటే రూ.2 కోట్లకు పైగా, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడిగా గెలవాలంటే కనీసం రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు, మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాలైతే రూ.కోటికిపైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఫ్యూచర్‌సిటీ ఏర్పాటవుతున్న యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, ఆమనగల్లు, మంచాల మండలాల్లోని అనేక గ్రామాల్లో గెలవాలంటే అత్యధికంగా ఖర్చు చేస్తేనే సాధ్యమని అందినకాడికి అప్పులు చేశారు. డబ్బులిస్తాం.. మళ్లీ రిజిస్ట్రేషన్లు చేస్తారా? ఎన్నికలకు హైకోర్ట్ బ్రేక్ వేయడంతో ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ మళ్లీ నోటిఫికేషన్ వచ్చినా ఇవే రిజర్వేషన్లు ఉంటాయో.. లేదో తెలియదు. ఈ క్రమంలో అప్పులు తెచ్చుకున్న ఆశావహులంతా వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ‘మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం.. మా వ్యవసాయ భూములు, ప్లాట్లు మళ్లీ మా పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయండి’ అంటూ ప్రాధేయపడుతున్నారు. మధ్యవర్తులను సంప్రదించి కమీషన్లు ఇస్తాం.. వడ్డీ వ్యాపారులను ఒప్పించి తిరిగి తమ ఆస్తులు తమ పేర్లపై నమోదు చేయించండి అంటూ బతిమిలాడుతున్నారు. వడ్డీ వ్యాపారులు మళ్లీ రిజిస్ట్రేషన్లు చేస్తాం కానీ ఒప్పందం ప్రకారం ఆరు నెలల వడ్డీ చెల్లించండని తెగేసి చెబుతున్నారు. దీంతో వడ్డీలకు తెచ్చిన డబ్బును తిరిగి వ్యాపారులకు ఇవ్వలేక.. ఇంట్లో ఉంచుకోలేక ఆశావహులకు కంటికి కునుకు లేకుండాపోతోంది. స్థానిక ఎన్నికలకు ఆశావహుల పోటీ రిజర్వేషన్లు అనుకూలించడంతో పలువురి ఆసక్తి అప్పులు చేసి మరీ సమరానికి సన్నద్ధం హైకోర్ట్ బ్రేక్‌తో ఒక్కసారిగా కలవరం తెచ్చిన రుణాలపై ఆందోళన -
జాతీయ సదస్సులో అధ్యాపకుడి ప్రజెంటేషన్
షాద్‌నగర్: తమిళనాడులోని సెంట్రల్ యూనివర్సిటీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ స్పాన్సర్‌షిప్‌తో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు గురువారం షాద్‌నగర్‌కు చెందిన అర్థశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ఫర్ వికసిత్ భారత్ –2047 అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. వాతావరణంలో మార్పులతో దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా ప్రభావితం అవుతుందని అనే అంశాన్ని వివరించారు. -
ధరలు ౖపైపెకి..!
హుడాకాంప్లెక్స్: ఏకధాటి వర్షాలు.. వరదలు కాయగూరల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంటలు దెబ్బ తినడం.. దిగుబడి భారీగా తగ్గిపోవడం వెరసి ఇటు రైతులను, అటు కొనుగోలుదారులను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. కూరగాయలే కాదు ఆకుకూరల ధరలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.40లోపే పలికిన వంకాయ, బీన్స్ ధర బహిరంగ మార్కెట్లో సెంచరికీ చేరువలో ఉన్నాయి. ఇక పచ్చిమిర్చి, కాకర, దొండ, దోసకాయ, గోకర, బీర ధరలు సైతం రెట్టింపయ్యాయి. పాల కూర, తోటకూర, పుదీనా, బచ్చలికూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర ధరలు కూడా అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో కట్ట రూ.5లోపే విక్రయించగా ప్రస్తుతం ఏ ఆకుకూర కొనాలన్నా ఒక్కో కట్టకు రూ.10 వెచ్చించాల్సి వస్తోంది. బోర్డు ధరలకు భిన్నంగా.. సరూర్‌నగర్ మార్కెట్, ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్లకు సాధారణ రోజుల్లో రోజుకు సగటున 480 క్వింటాళ్ల కాయగూరలు దిగుమతి అవుతుండగా, వారాంతాల్లో 520 నుంచి 600 క్వింటాళ్ల వరకు దిగుమతి అవుతున్నాయి. యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి తెచ్చి విక్రయిస్తుంటారు. ఇటీవల కురిసిన ఏకధాటి వర్షాలు, వరదల కారణంగా పంటలు పాడై దిగుమతి భారీగా తగ్గింది. డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేకాదు ఆయా మార్కెట్లలోని బోర్డులపై ఉన్న ధరలకు.. బయట ఉన్న ధరలకు పొంతనే ఉండడం లేదు. రైతు బజార్‌లోని వ్యాపారులు సైతం బోర్డుపై ఉన్న ధరలకు భిన్నంగా విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో ఒకప్పుడు కిలో కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. రైతులకు బదులు వ్యాపారుల తిష్ట ఎప్పటికప్పుడు ధరలను నియంత్రించాల్సిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యాపారులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి .. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై ఫిర్యాదు చేసినా.. చర్యలకు వెనుకాడుతున్నారు. రైతుబజార్లలో రైతులకు బదులు వ్యాపారులు తిష్టవేశారు. పంట తీసుకుని వచ్చిన వాళ్లను లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో వారు ఆయా మార్కెట్ల ముందు ఉదయం, రాత్రి ప్రధాన రోడ్డుకు అటుఇటుగా కుప్పలు పోసుకుని అమ్ముకోవాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం, తక్కెడ, బాట్లను ఎత్తుకెళ్లిపోతుండటంతో రైతులు తమ పంటను తక్కువ ధరకే దళారులకు అమ్ముకుని పోతున్నారు. భగ్గుమంటున్న కూరగాయల రేట్లు ఆకుకూరలదీ అదే పరిస్థితి ఏకధాటి వర్షాలతో దెబ్బతిన్న పంటలు తగ్గిన దిగుబడి.. అమాంతం పెరిగిన ధరలు పావుకిలో, అరకిలోతో సరిపెట్టుకుంటున్న జనంప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కాయగూరల ధరలు భగ్గుమంటున్నాయి. ఏది కొనాలన్నా కిలో 60రూపాయలపైనే చెల్లించాల్సి వస్తోంది. దీంతో అరకిలో, పావు కిలో కొనుగోలు చేస్తున్నాము. వ్యాపారులు కేజీ తీసుకుంటే ఒక ధర.. అరకేజీ తీసుకుంటే మరో ధర చెబుతున్నారు. – లక్ష్మి, గృహిణి -
గిట్లయిపాయె!
● ఇలా నామినేషన్లు .. అలా నిలిపివేత ● మళ్లీ మొదటికొచ్చిన ఎలక్షన్ ప్రక్రియ ● అంతర్మథనంలో ఆశావహులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీల్లో రెండు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ సహా ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్, నోటిఫికేషన్లపై కోర్టు స్టే విధించింది. ఇప్పటికే సహచర నాయకులను ఒప్పించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లను ఖరారు చేసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీల ఆశావహులకు కోర్టు తీర్పుతో గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఇప్పటికే ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన రాజకీయ పార్టీలకు చుక్కెదురైంది. ఇదిలా ఉంటే మూడు డివిజన్ల పరిధిలో పలు ఎంపీటీసీ స్థానాలకు తొలి రోజున ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలకు మాత్రం ఒక్కటి కూడా దాఖలు కాలేదు. ఇప్పటికే భారీగా ఖర్చు జిల్లాలో 21 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కులగణన ఆధారంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గత నెల 27న జీఓ నంబర్ 9ని విడుదల చేసింది. 29న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తుండగా.. మరోవైపు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆయా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ఎంపిక, బ్యాలెట్ బాక్సులు, నోడల్ ఆఫీసర్లు, రిటర్నింగ్ అధికారుల నియామకం, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఏర్పాట్లు చేసింది. ఆశావహులతో పాటు రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేసుకున్నాయి. తీరా గురువారం ఉదయం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన ఆశావహులు కోర్టు తీర్పుతో అంతర్మథనంలో పడ్డారు. రిజర్వేషన్లు మారితే తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన వారిలో మొదలైంది. పరస్పర విమర్శలు స్థానిక సంస్థల్లో బీజీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌పై కోర్టు స్టే విధించిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు కోర్టు తీర్పే తాజా నిదర్శనమని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లు వాదిస్తుండగా, కోర్టుల్లో కేసులతోప్రతిపక్షాలు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని అధికార కాంగ్రెస్ విమర్శిస్తోంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమైన నిర్వాకం కారణంగానే హైకోర్టు స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి బీసీల ఆదరణ దక్కుతుందనే అక్కసుతోనే ప్రతిపక్ష పార్టీలు రిజర్వేషన్లకు అడ్డు తగులుతున్నాయని హస్తం పార్టీ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వం ముందు నాలుగు ప్రతిపాదనలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో ఒకటి పాత రిజర్వేషన్ల ప్రకారం మరోసారి నోటిఫికేషన్ జారీ చేయడం, సుప్రీం కోర్టుకు వెళ్లి.. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయించడం, లేదంటే పార్టీ తరఫున 42 శాతం సీట్లను బీసీలకు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం, కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయడం మాత్రమే మిగిలి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
మహాసభలను విజయవంతం చేయాలి
మొయినాబాద్: తుర్కయంజాల్‌లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లి దేవేందర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని మున్సిపల్ కార్మికులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మొయినాబాద్ మున్సిపల్ వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షడు రత్నం, అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, నర్సింహ, కార్మికులు పాల్గొన్నారు. -
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
అబ్దుల్లాపూర్‌మెట్: క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని విద్యా కమిషన్ సభ్యుడు చారగొండ వెంకటేశ్ పేర్కొన్నారు. మండలంలోని బాటసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న 69వ హయత్‌నగర్ జోనల్ లెవల్ కబడ్డీ టోర్నమెంట్‌తో పాటు క్రీడాకారుల ఎంపికను గురువారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కేవలం సిలబస్ పూర్తిచేయడంపైనే దృష్టి పెట్టకుండా విద్యార్థులకు చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు వచ్చేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాఘవ రెడ్డి, హయతనగర్ జోనల్ సెక్రటరీ నిర్మల, పీడీలు చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, ఉషాకిరణ్, దాసరి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. విద్యా కమిషన్ సభ్యుడు వెంకటేశ్ -
ఆర్టీసీకి ఆదాయ‘మస్తు’
షాద్‌నగర్/ ఇబ్రహీంపట్నం: వరుస పండుగలు ఆర్టీసీకి భారీగా కలిసొచ్చాయి. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపించారు. స్వగ్రామాలకు బస్సుల్లో ప్రయాణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడిపించారు. ఫలితంగా షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం డిపోలకు అదనంగా రాబడి పెరిగింది. షాద్‌నగర్ డిపోలో 2 లక్షల 56వేల కిలోమీటర్లకు పైగా బస్సులు తిరిగినట్లు అధికారులు తెలిపారు. ● షాద్‌నగర్ డిపోకు సెప్టెంబర్ 29 నుంచి ఈనెల 6వ తేదీ వరకు రూ. 1.88 కోట్లు వచ్చాయి. దసరా పండగ ముందు రోజు అక్టోబర్ 1న రూ.22 లక్షలు, 5వ తేదీ రూ.31.32 లక్షలు, 6వ తేదీ రూ.41.24 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ● ఇబ్రహీంపట్నం డిపోకు సెప్టెంబర్ 27 నుంచి ఈ నెల 5వ తేదీ రూ.3 కోట్లు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. మహాలక్ష్ముల ప్రయాణం పండుల నేపథ్యంలో వారం రోజుల్లో షాద్‌నగర్ డిపో నుంచి 1,07,722 మంది మహిళలు ప్రయాణించారు. సెప్టెంబర్ 27న 22,877 మంది, 28న 26,652 మంది, 29న 27,376 మంది, 30న 29,633 మంది, సెప్టెంబర్ 1న 26,540 మంది, 5న 29,406 మంది, 6న 35,238 మంది ప్రయాణించారు. ఇబ్రహీంపట్నం డిపోలో రూ.1.75 కోట్లు మహలక్ష్మి టికెట్ల ద్వారా సమకూరింది. పండుగలకు ప్రయాణికుల కిటకిట సంస్థకు భారీగా రాబడి షాద్‌నగర్ డిపోకు వారంలో రూ.1.88 కోట్లు ఇబ్రహీంపట్నం డిపోకు రూ.3 కోట్లు పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపించాం. ఆర్టీసీ కార్మికులు, అధికారుల సమష్టి కృషితోనే అనుకున్న మేర ఆదాయం వచ్చింది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తూ మరింత ఆదాయం పెంచే దిశగా ముందుకు సాగుతాం. – ఉష, డిపో మేనేజర్, షాద్‌నగర్ వివిధ ప్రాంతాలకు 40 స్పెషల్ బస్సులను నడిపించాం. వీటి ద్వారా రూ.80 లక్షలు, ఆయా హాస్టళ్ల నుంచి విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చినందుకు మరో రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. – వెంకటనర్సప్ప, డిపో మేనేజర్, ఇబ్రహీంపట్నం -
ప్రజల చూపు బీజేపీ వైపు
● కాంగ్రెస్, బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్ గౌడ్ మహేశ్వరం: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేక బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని గొల్లూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో జనం విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో జగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు కడారి జంగయ్య యాదవ్, మండల అధ్యక్షుడు యాదీష్ తదితరులు పాల్గొన్నారు. -
మాల్స్‌పై స్పెషల్ డ్రైవ్
● తప్పుడు వివరాలు సరిదిద్దే చర్యలు ● ఆదాయం పెంచుకునే దిశగా జీహెచ్ఎంసీ ప్రాపర్టీట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసూలు కోసం సాక్షి, సిటీబ్యూరో: ఏటికేడు ఆస్తిపన్ను వసూళ్ల ఆదాయం పెరుగుతున్నప్పటికీ, జీహెచ్ఎంసీలోని అన్ని భవనాల నుంచి రావాల్సినంత ఆస్తిపన్ను మాత్రం రావడం లేదు. ప్రతియేటా నిరుటి కంటే ఈ యేడు ఎక్కువ ఆస్తిపన్ను వసూలు చేద్దామనే పాత ఆలోచనలకు స్వస్తి పలికి, వాస్తవంగా ఎంత ఆదాయం రావాలో అంత వసూలు చేసి ఖజానాను నింపుకోవాలనే ఆలోచనతో జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టారు. తొలుత, మాల్స్ నుంచి సరైన ఆస్తిపన్నును వసూలు చేయడంతోపాటు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కూడా వసూలు చేసే చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మాల్స్‌ను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, భవనం విస్తీర్ణానికి అనుగుణంగా ఆస్తిపన్ను డిమాండ్ ఉందా, లేక రావాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువ డిమాండ్ ఉందా? అన్నది తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ రావాల్సినంత ఆస్తిపన్ను కంటే తక్కువ డిమాండ్ ఉన్నట్లయితే రివిజన్ చేసి సరైన ఆస్తిపన్ను విధించి వసూలు చేయనున్నారు. ట్రేడ్ లైసెన్సులపైనా గురి అలాగే.. మాల్స్‌లోని అన్ని వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్సులున్నాయా? ఉంటే నిబంధనలకు అనుగుణంగా లైసెన్సు ఫీజులు చెల్లిస్తున్నారా? అనే వివరాలపైనా సర్వే చేస్తున్నారు. వీటిల్లోనూ ఏవైనా వ్యత్యాసాలుంటే తగిన చర్యలు తీసుకోనున్నారు. ఈ తనిఖీలకు సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వే దాదాపుగా పూర్తి కావచ్చిందని అధికారులు తెలిపారు. ఎంత మేర ఆదాయం పెరగనుందో ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది. తనిఖీలతో పాటే పేరుకుపోయిన బకాయిలనూ వసూలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా మాల్స్‌లో ఉన్న వ్యాపారం రకం, నిర్వహిస్తున్న సంస్థ పేరు, దాని పీటీఐఎన్, ఆస్తిపన్ను వార్షిక డిమాండ్, బకాయిలుంటే ఎంత మొత్తం, ఆస్తిపన్ను డిమాండ్ భవనం విస్తీర్ణానికి తగ్గట్లుగా ఉందా? లేక తక్కువ మొత్తం ఉందా? వంటి వివరాలతో పాటు అసలు ఆస్తిపన్ను జాబితాలో నమోదుకాని పీటీఐఎన్లు లేని వాటిని కూడా గుర్తించనున్నారు. రివిజన్ చేసి సరైన ఆస్తిపన్ను విధించే చర్యలు కూడా చేపట్టారు. బకాయిలున్నవారి నుంచి ఆస్తిపన్ను వసూళ్ల చర్యలు కూడా చేపట్టారు. నివాసేతర భవనాలన్నింటిపై.. మాల్స్ స్పెషల్ డ్రైవ్ పూర్తయ్యాక, నివాసేతర భవనాలన్నింటి తనిఖీలకు ఆయా అంశాల వారీగా స్పెషల్‌డ్రైవ్స్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ రకాల దుకాణాలతో పాటు బ్యాంకులు, ఆస్పత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, గోడౌన్లు, సెల్ టవర్లు, ఆఫీసులు, ఏటీఎంలు బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, ఫ్యాక్టరీలు, విద్యాసంస్థలు, జిమ్స్, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు, మ్యారేజ్ హాళ్లు తదితరాలు వీటిలో ఉన్నాయి. -
తిరుమలనాథుడి సన్నిధిలో అన్నమయ్య కీర్తనలు
పూడూరు: మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ తిరుమలనాథ స్వామి ఆలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభరాజు బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా గురువారం అన్నమయ్య కీర్తనలు, పలు దైవ సంకీర్తనలు పాడి భక్తులను అలరించారు. ఈ సందర్బంగా శోభరాజు శిశ్యులు రన్వితారెడ్డి, ఆశ్రిత, పద్మశ్రీ చైత్ర, మానస పటేల్, అభిరామ్ తదితరులను ఆలయ పూజారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి వెంకటదాసు, ఆలయ ధర్మకర్తలు సంగీత , గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా వాహనాల తనిఖీ
మొయినాబాద్ రూరల్: మొయినాబాద్ ఠాణా ఎదుట గురువారం సీఐ పవన్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తూ వాహనాల్లో డబ్బు తరలిస్తే ప్రభుత్వపరంగా చర్యలు తప్పవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు నర్సింహారావు, నయీముద్దీన్, నర్సింహరాజు, కిషన్‌జీ తదితరులు పాల్గొన్నారు.నియామకం బండ్లగూడ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బండ్లగూడ జాగీర్ మాజీ సర్పంచ్ గంగని హరికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు నియామకపత్రాన్ని గురువారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రితం, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ముదిరాజ్ల చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు సాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు. తెలంగాణ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ జల్పల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యం కావాలి ● సైబరాబాద్ అదనపు డీసీపీ హన్మంత్‌రావు మణికొండ: ప్రయాణికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించటంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ జి.హన్మంత్‌రావు అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ, గౌలిదొడ్డిలోని ప్రధాన్ కన్వెన్షన్‌లో గురువారం గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆటో డ్రైవర్లు తప్పనిసరి యూనిఫామ్ ధరించాలని, ఆటోకు సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి ఆ మత్తులో డ్రైవింగ్ చేయవద్దని, ఆటో ప్రయాణం సుఖవంతంగా ఉంటేనే ప్రయాణికులు ఆదరిస్తారన్నారు. రోడ్లపై కేటాయించిన స్టాండ్లలోనే ఆటోలను నిలపాలని, ఎక్కడ పడితే అక్కడ నిలిపినా, ట్రాఫిక్ జాంలకు, ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, అందులో ఎలాంటి తప్పులు దొరకకుండా చూసుకోవాలని సూచించారు. మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఇన్స్పెక్టర్ జి.లవకుమార్, ఎస్ఐ వీరబ్రహ్మం, ఎస్ఐలు, 200 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
అక్రమ రవాణాకు అడ్డేది!
● పట్టపగలే ఫ్యాక్టరీలకు కలప తరలింపు ● అడ్డగోలుగా వృక్షాలు నరికేస్తున్న అక్రమార్కులు ● లారీకి రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు అధికారులపై ఆరోపణలు ఇబ్రహీంపట్నం రూరల్: పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ సందపను కాపాడాల్సిన అధికారులు అక్రమంగా కలప రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఇబ్రహీంపట్నం ఫారెస్టు రేంజ్ పరిధిలో వృక్షాలు అడ్డగోలుగా నరికి వేస్తున్నారు. వేప, తుమ్మ, మామిడి, చింత, టేకు తేడా లేకుంటా కొట్టి వేస్తున్నారు. రేంజ్ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున కంపెనీలున్నాయి. వీటి బాయిలర్ కోసం కలప విరివిగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం అటవీ శాఖ అనుమతి తీసుకుని పనికిరాని చెట్లనుంచి వచ్చే కలప మాత్రమే వినియోగించాలి. రియల్ఎస్టేట్ వెంచర్ల పేరిట రియల్ వ్యాపారులు, బాయిలర్ల కోసం కంపెనీల యాజమాన్యాలు వృక్షాలను అడ్డగోలుగా నరికేస్తున్నారు. అధికారులు సైతం వారిచ్చే నజరానాలు పుచ్చుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. అక్రమార్కులకు అధికారుల అండదండలుండడంతో పట్టపగలే యథేచ్చగా కలప తరలిస్తున్నారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, మంగళ్‌పల్లి ప్రాంతాల నుంచి లారీల కొద్దీ కలప రవాణా చేస్తున్నారు. ఒక్కో లారీకి రూ.5వేలు ఇచ్చుకుంటే ఎంత కలప నరికినా పట్టించుకునే వారే లేరంటూ బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఓ అధికారిని కలిస్తే పని జరిగినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమంగా తరలిస్తున్న కలపఅటవీ సంపద రక్షణకు ప్రభుత్వాలు పనిచేస్తుంటే.. అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా కలప రవాణా చేస్తున్నారు. అడవుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం నిర్వహిస్తుంటే అక్రమార్కులు చెట్లను నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం కలప అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. నా దృషిటికి వస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటాం. కలప రవాణా చేస్తే చర్యలు తప్పవు. చెట్లను నరకడం నేరం. క్షేత్ర స్థాయి అధికారులు సైతం కఠినంగా వ్యవహరించాలి. – శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం రేంజ్ అధికారి చర్యలు తీసుకోవాలి ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం ప్రాంతాల నుంచి భారీగా కలప తరలిస్తున్నారు. అధికారులకు తెలిసే తతంగం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలి. లేకుంటే పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తాం. – జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు -
ఫినాయిల్ బాటిల్లో నీరు తాగి..
షాద్‌నగర్‌రూరల్: ఫినాయిల్ బాటిల్లో నీరు పట్టుకుని తాగిన విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం గురుకుల హాస్టల్లో చోటు చేసుకుంది. వివరాలు.. మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి సమీపంలో వివేకానంద డిగ్రీ కళాశాల భవనంలో కేశంపేట జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కొనసాగుతోంది. ఫరూఖ్‌నగర్ మండలం చిల్కమర్రికి చెందిన హర్షవర్దన్ ఇక్కడ 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం టిఫిన్ చేసిన విద్యార్థి తాగునీటి కోసం కులాయి వద్దకు వెళ్లాడు. కాగా అక్కడ వాడి పడేసిన ఫినాయిల్ బాటిల్ ఉంది. ఇది గమనించని విద్యార్థి అందులో వాటర్ పట్టుకుని తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే హాస్టల్ సిబ్బంది షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న హర్షవర్దన్‌ను పాఠశాల సిబ్బంది ఇంటికి పంపారు. గురుకుల విద్యార్థికి అస్వస్థత -
పేద విద్యార్థులకు అండగా ఉంటాం
మణికొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు తమ వంతుగా అండగా ఉంటామని ఐడీబీఐ బ్యాంక్ ప్రాంతీయ కో ఆర్డినేటర్ కునాల్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ, నెక్నాంపూర్ ప్రాథమిక పాఠశాలకు బ్యాంక్ సీఎస్ఆర్ నిధులు రూ. 2 లక్షలతో కంప్యూటర్ టేబుల్లు, కుర్చీలు, క్లాస్ రూం రాక్లు, లైబ్రరీ రాక్లు, ఆఫీస్ టేబుల్లు, కుర్చీలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అథితిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తమ బ్యాంక్ తరఫున ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలను కల్పించేందుకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అధనపు తరగతులను నిర్మించామన్నారు. మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ కె. నరేందర్ ముదిరాజ్, మాజీ వైస్ చైర్మన్ కె.నరేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ కె.రామకృష్ణారెడ్డి, బ్యాంక్ మేనేజర్ జయకుమార్, బ్యాంక్ రీజనల్ అధికారులు అఖిలేష్, జైసింగ్, ప్రధానోపాధ్యాయుడు మహ్మద్ అనీస్ తదితరులు పాల్గొన్నారు.ఐడీబీఐ బ్యాంక్ ప్రాంతీయ కోఆర్డినేటర్ కునాల్ -
గ్లెండేల్ అకాడమీ విద్యార్థులకు సీఎం అభినందన
బండ్లగూడ: సింగపూర్‌లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ డే(జీఈడీ) 2025లో మిడిల్ స్కూల్ విభాగంలో సన్సిటీలోని గ్లెండేల్ అకాడమీ విద్యార్థులు బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులను అభినందించి సన్మానించారు. గ్రీన్ గ్లెన్ గార్డియన్స్ బృందంలో ఆరాధ్య దుద్దిళ్ల శ్రీపాదరావు(6వ తరగతి), నిగమా పెన్మెట్సా(6వ తరగతి), సయ్యద్ అలిజా జైఆమా(6వ తరగతి), రాహిని సమ్హిత వర్మ దంతులూరి(7వ తరగతి), జేడెన్ డి రోజారియో(7వ తరగతి) ఉన్నారు. ఈ బృందం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 11 పాఠశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులతో పోటీపడ్డారు. ది గుడ్ ఫుడ్ మూవ్మెంట్ అనే తమ ప్రాజెక్టును కై జెన్ (నిరంతర అభివృద్ధి) అనే అంశం కింద ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారు సేంద్రియ వ్యవసాయం, స్ధిరమైన వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వల్ల కలిగి హానికర ప్రభావాలు, పర్యావరణపరమైన బాధ్యతాయుత పద్ధతుల అవసరం, పర్యావరణ అవగాహన పెంపు కోసం ప్రాక్టికల్ లెర్నింగ్ ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... తమ ఆవిష్కరణాత్మక ఆలోచనలతో స్థిరమైన అభివృద్ధి పట్ల కట్టుబాటుతో తెలంగాణను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ మిను సలూజా పాల్గొన్నారు. -
మహిళా సంఘాలు మెప్మాకు అనుసంధానం
చేవెళ్ల: గ్రామాల్లో ఇన్నాళ్లుగా కొనసాగిన మహిళా సంఘాలు అన్ని మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా పరిధిలో పని చేస్తాయని జిల్లా పీడీ వెంకట నారాయణ తెలిపారు. చేవెళ్ల మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశం ఆధ్వర్యంలో బుధవారం మహిళా సంఘాల గ్రూప్ రిసోర్స్ పర్సన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ వెంకటనారాయణ, డీఎంసీ(డిస్ట్రిక్ మిషన్ కోఆర్డినేటర్) ఇందిరా మాట్లాడుతూ.. మహిళా సంఘాలు అన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉండే మెప్మా సంస్థ పరిధిలోకి వస్తాయని చెప్పారు. చేవెళ్ల మున్సిపాలిటీగా ఇటీవలే ఏర్పడటంతో మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు అన్ని మెప్మాకు అనుసంధానం అయినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు, ఉపాధి శిక్షణ, ఆరోగ్య కార్యక్రమాలు, సంయుక్త నిధులు తదితర కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మున్సిపాలిటీలలో మెప్మా సభ్యులకు అందుతాయని వివరించారు. సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాల గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, సభ్యులు పాల్గొన్నారు. -
పూల సాగు.. లాభాలు బాగు
● ప్రత్యామ్నాయ పంటలపై రైతుల ఆసక్తి ● ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి మొయినాబాద్‌రూరల్: పుష్పాల సాగు రైతులకు ఆదాయ పరిమళం కురిపిస్తోంది. గతంలో సంప్రదాయ పంటలు సాగు చేసి ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను చవిచూసిన రైతులు ప్రస్తుతం తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను ఆర్జించేందుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పూల తోటల సాగుతో అధిక దిగుబడులు సాగించవచ్చని నిరూపిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 1,200 ఎకరాలలో పూల సాగు చేస్తున్నారు. అందులో మొయినాబాద్ మండలంలోనే 300 ఎకరాల్లో పండిస్తున్నారు. మండల పరిధిలోని అమ్డాపూర్, కాశీంబౌలి, బాకారం, వెంకటాపూర్, చిన్నమంగళారం, రెడ్డిపల్లి, కుతుబుద్దీన్గూడ, వీరన్నపేట్, చందానగర్, మోత్కుపల్లి, కనకమామిడి, కంచమౌనిగూడ, శ్రీరామ్‌నగర్, కేతిరెడ్డిపల్లి, సజ్జన్పల్లి ఆయా గ్రామాల్లో ఎక్కువగా గులాబీతో పాటు చామంతి, బంతి పూల తోటలు సాగు చేస్తున్నారు. చేవెళ్ల మండలంలోని కందవాడ, పల్గుట్ట, గుండాల, చందన్వెల్లి, దేవరంపల్లి గ్రామాల్లో రైతులు సైతం పూల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ రైతులు పండిస్తున్న బంతి, చామంతి పూలకు శుభకార్యాలు ప్రారంభం కావడంతో పాటు సమీపిస్తున్న దీపావళి పండుగతో గిరాకీ వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బంతి కిలో రూ.50–60, చామంతి రూ.80–100 ధర పలుకుతుందని చెబుతున్నారు. సబ్సిడీ లేదు మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాలలో అధికంగా పూల సాగు చేస్తారు. భారీ వర్షాలు కురవడంతో ఈ ఏడాది దిగుబడి తగ్గింది. రైతులు సబ్సిడీ నారు కోసం ఆరా తీస్తున్నారు. కానీ పూల సాగుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేదు. కూరగాయాల సాగుకు సబ్సిడీ ఉంది. – కీర్తి, ఉద్యానవన శాఖ, చేవెళ్ల రూ.40 వేలు లాభం ఏటా చామంతి సాగు చేస్తున్నాను. దసరా, దీపావళితో పాటు పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో గిరాకీ ఉంది. ఒక ఎకరాకు రూ.60 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతుంది. పెట్టుబడి పోగా దాదాపు రూ.40 వేల వరకు లాభాలు వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పంట కొంత దెబ్బతింది. – భూపాల్‌రెడ్డి, రైతు ప్రభుత్వం సహకరించాలి పూల సాగుకు పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నారు ఉచితంగా పంపిణీ చేయాలి. మొక్కలపై సబ్సిడీ ఉండేలా అధికారులకు చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. పూల రైతుల పట్ల సర్కారు అవగాహన కల్పిస్తూ ఆదుకోవాలి. – సైపాల్‌రెడ్డి, అమ్డాపూర్, రైతు -
తుపాకీ విక్రయానికి పండ్ల వ్యాపారుల యత్నం
పట్టుకున్న సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ సాక్షి, సిటీబ్యూరో: ఝార్ఖండ్ నుంచి వలస వచ్చి నగరంలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తుపాకీ విక్రయానికి యత్నించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ అతడితో పాటు మరొకరిని పట్టుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు. ఝార్ఖండ్‌కు చెందిన విజయ్ యాదవ్ నగరానికి వలసవచ్చి లింగంపల్లిలో నివసిస్తున్నాడు. వివిధ బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద పండ్లు విక్రయిస్తూ జీవస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు నాటు తుపాకుల్ని తీసుకువచ్చి విక్రయించాలని భావించాడు. మూడు నెలల క్రితం బీహార్ వెళ్లి అక్కడి సోను కుమార్ నుంచి రూ.58 వేలకు 0.7 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్ ఖరీదు చేసుకువచ్చాడు. దీన్ని నగరంలోని అసాంఘిక శక్తులకు అమ్మడానికి సహకరించాల్సిందిగా సంతోష్‌నగర్‌లో ఉంటున్న తోటి పండ్ల వ్యాపారి బుంటి కుమార్ యాదవ్‌ను కోరారు. ఆ పిస్టల్ వీడియో తీసి ఇతడికి షేర్ చేసిన విజయ్ దాన్ని చూపిస్తూ ఎవరికై నా విక్రయించడానికి ప్రయత్నించాలని సూచించాడు. కొన్ని రోజులుగా ఇతగాడు ఆ అక్రమ ఆయుధం వీడియోను పలువురు రౌడీషీటర్లతో పాటు అసాంఘికశక్తులకు చూపిస్తూ అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై సీసీఎస్ అధీనంలోని స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్‌కు సమాచారం అందింది. ఏసీపీ జి.వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఫలక్‌నుమా ప్రాంతంలో వలపన్ని బుంటి కుమార్‌ను పట్టుకుంది. అతడిచ్చిన సమాచారంతో విజయ్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి తుపాకీ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించింది. మైలార్‌దేవ్‌పల్లి: విద్యుత్ షాక్‌కు గురై ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్స్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలివీ... బిహార్‌కు చెందిన మహ్మద్ హర్షద్ బతుకుదెరువు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి మొగల్స్ కాలనీకి వచ్చి జీవనం సాగిస్తున్నారు. వీరు రేకుల ఇంట్లో ఉంటున్నారు. ఎడతెరపిలేని వర్షాల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లోకి వర్షపు నీరు వస్తున్నాయని వారి కుటుంబారు తౌపిక్(15) బ్యానర్‌ను తీసి ఇంటి రేకులపై కప్పేందుకు యత్నించాడు. ఈ సమయంలో బ్యానర్‌కు ఉన్న ఇనుప రాడ్‌కు కరెంటు ఉండటంతో విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను పెంచి మెరుగైన సేవలందించాల్సిన సమయంలో చార్జీలు పెంచడం ఏమిటని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వేముల మల్లేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదనే సాకుతో రద్దు చేసిన సర్వీసులను పునరుద్ధరించాలన్నారు. శివరాంపల్లిలోని తన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఉచిత ఆర్టీసీ ప్రయాణ హమీని మహిళలకు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హమీని ఒక పక్క నేరవేర్చుతూనే మరో పక్క రూట్ సర్వీసులను రద్దు చేసిందన్నారు. దీంతో నిత్యం ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు
పహాడీషరీఫ్: ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖాజా పాషా కోరారు. ఈ మేరకు బుధవారం పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కలిసి మెలసి ఉంటున్న ప్రజల నడుమ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాజాసింగ్ యత్నిస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎన్నో మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ను కలిసిన వారిలో పార్టీ నాయకులు అబ్దుల్ ఖదీర్, మహ్మద్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయండి
● జిల్లాలో 33 కేంద్రాలు ప్రారంభించాలి ● అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్లో ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 33 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 ధర లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు వివరించారు. సన్నరకం, దొడ్డు రకం సెంటర్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెంటర్లలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, కంట్రోల్ రూమ్ నంబర్లు ప్రదర్శించాలని, రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సివిల్ సప్లయ్ మేనేజర్ హరీశ్, డీసీఎస్ఓ వనజాత, డీఆర్డీఓ శ్రీలత, డీసీఓ సుధాకర్, డీఏఓ ఉష, డీఎంఓ రియాజ్, డీఎల్‌ఎంఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు . -
ఎంపీని కలిసిన భూ బాధితులు
షాబాద్: తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు రేడియల్ రోడ్డులో పోతున్నాయని నాన్ధార్ఖాన్పేట్, మాచన్‌పల్లి రైతులు వాపోయారు. ఈ మేరకు బుధవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వందల ఏళ్లుగా ఇదే భూముల్లో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నామని, ఇది తప్ప తమకు మరో ఆధారం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన ఎంపీ రైతులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి పొన్న రాజీవ్‌రెడ్డి, నాయకులు కృష్ణచారి, అశోక్, కూతురు మహేందర్, జగదీష్‌గౌడ్ తదితరులు ఉన్నారు. టీజీఐఐసీ బాధితులకు కలెక్టర్ హామీ ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడులో టీజీఐఐసీకి భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, టీజీఐఐసీ అధికారుల సమక్షంలో బుధవారం భూనిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలని బాధితులు కోరారు. పరిహారం తీసుకున్న వారి జాబితాలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్మినేడులో వెంచర్ ఏర్పాటు చేసి పరిహారంతో పాటు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్ టీం సభ్యుడు శ్రావన్, ఎల్మినేడు భూ కమిటీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మహేందర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు
యాచారం: ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. యాచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంచారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సకాలంలో నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని, అభివృద్ధి, సంక్షేమం కావాలంటే కేసీఆర్ రావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. రెండేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికలకు ప్రస్తుత స్థానిక ఎన్నికలు ప్రీఫైనల్‌గా భావించాలన్నారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి, ఎంపీపీ, జెడ్పీ పీఠాలను కై వ సం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, యాచారం మాజీ సర్పంచ్ మారోజ్ కళమ్మ, నాయకులు యాదయ్యగౌడ్, జోగు అంజయ్య, చింతుల్ల సాయిలు, బూడిద రాంరెడ్డి పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై చేతులెత్తేసిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయం మార్నింగ్ వాక్‌లో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి -
వెక్కిరించిన ‘ఏకగ్రీవం’!
కొందుర్గు: పంచాయతీ ఎన్నికల వేళ ఆశావహుల మధ్య పోటాపోటీ సాగుతోంది. అప్పటివరకు మిత్రులుగా ఉన్న వారు రాజకీయ శత్రువులుగా, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో ఉన్న వారు దోస్త్‌మేరా దోస్త్ అనేలా సమీకరణాలు మారిపోతున్నాయి. సాధారణ రోజుల్లో అంతా కలివిడిగా ఉండేవారు వేర్వేరు వర్గాలుగా విడిపోతున్నారు. ఊరిలో పరువు కోసం గెలిచి తీరాల్సిందేననే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకై నా వెనకడుగు వేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు విందులు ఏర్పాటు చేసి మాటామంతీ నిర్వహిస్తున్నారు. ప్రజల్లో తమకున్న ఆదరణ, బలాన్ని ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికల వేళ గ్రామాల్లో రోజూ పండగ వాతావరణమే కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఆత్మీయ పలకరింపులు, వరుసలు కలుపుకొని కబుర్లు.. గెలుపోటములపై చర్చలూ ఇలా ఒక్కటేమిటి ఏ ఇద్దరు కలిసినా సర్పంచ్, వార్డు ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఇంతటి సందడి ఉండే ఎన్నికలను ఏకగ్రీవం పేరుతో ఆదర్శంగా నిలిచిన గ్రామాలకు తగిన ప్రోత్సాహం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గతంలో ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీలకు రూ.50 వేల పురస్కారం అందించేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈమొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచారు. యునానిమస్‌గా ఎన్నికై న అన్ని జీపీలకు నిధులు విడుదల చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, వసతులను కల్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. జిల్లాలో 43 పంచాయతీలు 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 43 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికలు జరగకుండా సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్లందరినీ యునానిమస్‌గా ఎన్నుకుంటే తమ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు వస్తాయనే ఆశతో ప్రజలు ఈనిర్ణయం తీసుకున్నారు. కానీ మళ్లీ ఎన్నికలు వచ్చినా పురస్కారం డబ్బులు రాకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ఏం ప్రకటిస్తుందో..? ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఎలాంటి నజరానా ప్రకటిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ గత ప్రభుత్వం మాట తప్పిన నేపథ్యంలో ప్రజలు నమ్ముతారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. గ్రామాభివృద్ధిని కాంక్షించి పంచాయతీలను ఏకగ్రీవం చేసిన గ్రామాలకు మొండిచేయే దక్కింది. ఎన్నికలు లేకుండా ఆదర్శంగా నిలిచిన జీపీలు పాలకుల వ్యవహారంతో అన్యాయానికి గురయ్యాయి. రూ.10 లక్షలు వస్తే ఊరిని అభివృద్ధి చేసుకుందామనుకున్న వీరి ఆశలు అడియాశలయ్యాయి. యునానిమస్ పంచాయతీలకు మొండిచేయి పదవీ కాలం పూర్తయినా దక్కని నజరానా నిధుల విడుదలను పట్టించుకోని గత ప్రభుత్వం పాలకుల హామీలపై ప్రజల్లో సన్నగిల్లిన విశ్వాసంఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీలకు రూ.10 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించడంతో మా గ్రామస్తులంతా ఏకమై వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవం చేశారు. మా పదవీ కాలం పూర్తయినా ఒక్కరూపాయి కూడా రాలేదు. ఆ డబ్బులు ఇస్తే గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడేవి. – నర్సింలు, మాజీ సర్పంచ్, లక్ష్మీదేవునిపల్లి, కొందుర్గు మండలంబీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోలేదు. నిధుల లేమితో పల్లెల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వారికే నష్టం. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించాలి. ముందస్తుగా ప్రోత్సాహక మొత్తాన్ని ప్రకటించి, ఎన్నికలు పూర్తయిన మూడు నెలల్లోపు నిధులు విడుదల చేయాలి. – భూపాలచారి, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు -
ఈ గుర్తులు దేనికి సంకేతం?
కొందుర్గు: అసలే ఓ వైపు రీజినల్ రింగ్ రోడ్డు, మరోవైపు రేడియల్ రోడ్డు వెళుతున్నాయనే ప్రచారంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న కొద్దిపాటి పొలం రోడ్డులో పోతే ఎలా బతకాలని మనోవేదనకు గురవుతున్నారు. ఈ సమయంలో మండలంలోని ముట్పూర్ శివారులో రామచంద్రాపూర్ నుంచి రేగడిచిల్కమర్రి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా దాదాపు 150 ఫీట్ల దూరంలో పసుపుపచ్చని రంగుతో రాతిబండలపై ఈపీఓ ఎ5 అని గుర్తులు పెట్టారు. ఇవి ఎవరు పెట్టారో.. ఎందుకు పెట్టారో తెలియక స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా తమకు తెలియదని చెప్పడంతో గ్రామస్తులు టెన్షన్ పడుతున్నారు. -
ఇరకాటం! పార్టీ మారిన ఎమ్మెల్యేకు వింత పరిస్థితి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికలు క్లిష్టంగా మారాయి. పార్టీ మారామని చెప్పుకోలేని పరిస్థితి ఓవైపు.. కొత్త కండువా వేసుకుని తమ అనుచరులకు మద్దతుగా ప్రచారం చేయలేని పరిస్థితి మరోవైపు వీరిని ఇబ్బంది పెడుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసు, స్పీకర్ విచారణ ఇరకాటంలోకి నెట్టాయి. సంస్థాగతంగా పట్టుకోసం తమ అనుచరులను జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా బరిలోకి దించేందుకు ఇప్పటికే అధిష్టానానికి పలు పేర్లను సిఫార్సు చేసినప్పటికీ.. అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వద్ద వీరిద్దరూ సీఎం సమక్షంలో కండువా కప్పుకొన్న ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వీరు స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్తే న్యాయస్థానంతో పాటు స్పీకర్‌కు నేరుగా సాక్ష్యం అందించిన వారవుతారనేది అక్షర సత్యం. అభివృద్ధి కోసం అటుఇటు..! చేవెళ్ల నియోజకవర్గంలో మెయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లితో పాటు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాలున్నాయి. జిల్లా పరిధిలో నాలుగు జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ, 109 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రాజకీయ ప్రస్థానం తన సొంత మండలమైన నవాబుపేట నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. అనంతరం 2014లో అదే పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అధికార బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంపై పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 2024లో కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కారు దిగి.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించడం, బంతి స్పీకర్ కోర్టులోకి నెట్టడం, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ సదరు ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. నెత్తిన అనర్హత కత్తి వేలాడుతున్న నేపథ్యంలోనే విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. జెడ్పీ పీఠం కోసం.. ఈసారి జిల్లా పరిషత్ పీఠాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడం తన నియోజకవర్గంలోని షాబాద్ ఎస్సీ మహిళకు, చేవెళ్ల, శంకర్పల్లి మండలాలు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో షాబాద్ లేదా చేవెళ్ల నుంచి తన కోడలిని నిలబెట్టి జెడ్పీ చైర్పర్సన్ సీటు దక్కించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్న ట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ కండువా వేసుకుని నేరుగా ప్రచారం చేయలేని సంకటం ఎదురైంది. కండువా కప్పుకోలేరు.. ప్రచారానికి వెళ్లలేరు అనుచరులు, వారసుల గెలుపు కోసం పనిచేయలేని వైనం పదవిపై వేలాడుతున్న అనర్హత కత్తిరాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట మండలాల్లోని రాజేంద్రనగర్ మండలం పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లింది. గండిపేటలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు లేవు. కేవలం శంషాబాద్ మండలంలోనే స్థానిక సంస్థలున్నాయి. ఇక్కడ 21 గ్రామ పంచాయతీలు, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సైతం రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి వరకు తనను నమ్ముకుని, వెంట వచ్చిన అనుచరులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఒకవేళ వీరికి అవకాశం వచ్చినా నేరుగా ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. -
పాఠశాలల అభివృద్ధికి సహకరించాలి
● జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు ● ఉర్దూ మీడియం స్కూల్లో తరగతి ప్రారంభంశంకర్పల్లి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతిఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు కోరారు. పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో రూ.6 లక్షలతో కేఎన్ఏ ఫౌండేషన్ చేపట్టిన పనులను బుధవారం నార్సింగి ఏసీపీ రమణగౌడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన సొంత డబ్బులు వెచ్చించి టైల్స్, ఫెన్సింగ్, మోటార్ పైప్‌లైన్ తదితర పనులు చేయించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నౌషిన్ సుల్తానాను అభినందించారు. ఈ కార్యక్రమంలో కేఎన్ఏ సంస్థ జనరల్ సెక్రెటరీ ఆస్మా నిక్కత్, తహసీల్దార్ సురేందర్, ఎంపీడీఓ వెంకయ్య, ఎంఈఓ అక్బర్, ఆదర్శ పాఠశాల, ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు శోభారాణి, ఉదయశ్రీ, ఉపాధ్యాయుల తాహేర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. -
కాపురానికి రావడం లేదని..
రెండో భార్యను హత్య చేసిన భర్త చేవెళ్ల: కాపురానికి రావడం లేదనే కక్షతో భార్యను కడతేర్చాడో భర్త. మాట్లాడుకునేందుకు తీసుకెళ్లి బండ రాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఆలూరు అనుబంధ గ్రామమైన వెంకన్నగూడకు చెందిన వానరాసి జంగయ్య బతుకుదెరువు నిమిత్తం రాంచంద్రాపురంలో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. ప్రస్తుతం రాంచంద్రాపురంలో మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. రెండో భార్య రజిత(30) పటాన్చెరులో ఇళ్లలో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. గత రెండేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు నెలకొనడంతో రజిత దూరంగా ఉంటోంది. కాపురానికి రావాలని ఎన్నిసార్లు మాట్లాడటానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించింది. ఎట్టకేలకు తన తల్లి వద్ద మాట్లాడుకుందామని చెప్పిన జంగయ్య ఆమెను తీసుకుని గత సోమవారం రాత్రి వెంకన్నగూడకు వచ్చాడు. మరుసటి రోజు మంగళవారం గ్రామస్తుల సమక్షంలో పంచాయితీ పెట్టినా భర్తతో ఉండేందుకు రజిత అంగీకరించలేదు. దీంతో కక్ష పెంచుకున్న జంగయ్య అదేరోజు రాత్రి రజితను గ్రామ సమీపంలోని ఓ వెంచర్లోకి తీసుకెళ్లి చున్నీ మెడకు బిగింగి, తలపై బండరాయితో మోది చంపాడు. అనంతరం నేరుగా వెళ్లి పీఎస్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమో దు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా హత్యలో మొదటి భార్య ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
మున్సిపల్ కార్యాలయంపై దాడి కేసులో ..
మణికొండ: మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో అప్పటి కమిషనర్ పెట్టిన కేసులో భాగంగా విచారణ ప్రారంభం కావటంతోమంగళవారం బీజేపీ నాయకులు కోర్టుకు హాజరయ్యారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలకాపూర్ టౌన్ షిప్ రోడ్డు నెంబర్–13 వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు. దాంతో మున్సిపల్ అధికారులు దాన్ని వెంటనే తొలగించారు. ఆగ్రహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో అప్పటి మున్సిపల్ కమీషనర్ ఫల్గుణ్కుమార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా 23 మందిపై కేసు నమోదు చేశారు. మంగళవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టు హాల్లో విచారణకు రావటంతో పార్టీ నాయకులు హాజరయ్యారు. కోర్టుకు 23 మంది బీజేపీ నాయకులు -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మణికొండ: జీవనోపాధికి ఆటోలను నడుపుతున్న వారిలో కొందరు ఇష్టానుసారంగా నడపటం, ఎక్కడ పడితే అక్కడ ఆపటం, ప్రయాణికుల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవటంతో అందరికీ చెడ్డపేరు వస్తుందని మాదాపూర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నార్సింగిలోని కేవీఎంఆర్ ఫంక్షన్హాల్లో మంగళవారం ఆటో డ్రైవర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పని సరిగా పాటించాలన్నారు. రోడ్లపై వేగంగా నడపరాదని ఆటో డ్రైవర్లు తమ వద్ద ఆర్సీ, ఇన్సూరెన్స్ లైసెన్సు ఎల్లప్పుడు ఉంచుకుని డ్రస్సులను ధరించే ఆటోలు నడపాలన్నారు. రాంగ్ రూట్లో ప్రయాణించినా నియమాలను పాటించకపోయినా చర్యలు తప్పవన్నారు. నార్సింగి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, అదనపు ఇన్స్పెక్టర్ ప్రదీప్, ఎస్సై రాజేశ్‌గౌడ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములు కాపాడండి
చేవెళ్ల: పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం డిమాండ్ చేశారు. మండల పరిధిలోని న్యాలట గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. న్యాలట రెవెన్యూలోని సర్వే నెంబర్ 240లోని ప్రభుత్వ భూములను, పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను కొందరు కబ్జాదారులు, రాజకీయ నాయకులు కబ్జా చేసి విక్రయాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించి కబ్జాకు గురువుతున్న భూములను కాపాడాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు మక్బూల్, సుధాకర్‌గౌడ్, శివ, కిష్టయ్య, అంజయ్య, సుదర్శన్ తదితరులు ఉన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం -
మూసీకి పెరిగిన వరద
మణికొండ: ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ పరీవాహకంలో భారీ వర్షాలు కురవటంతో మరోమారు జంటజలాశయాల గేట్లను మరింత ఎత్తి ఎక్కువ మొత్తంలో వరదను మూసీ నదికి వదులుతున్నారు. సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం వర్షం కురవటంతో గండిపేటలోకి పైనుంచి 1700 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దాంతో ఆరు గేట్లను మూడు అడుగులు, రెండు గేట్లను రెండు అడుగుల ఎత్తు ఎత్తి 2488 క్యూసెక్కుల నీటిని మూసీ నదికి మంగళవారం సాయంత్రం వదిలారు. హిమాయత్‌సాగర్‌కు పై నుంచి 2వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఆరు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 2500 క్యూసెక్కుల నీటిని మూసీకి వదులుతున్నారు. జంట జలాశయాల నుంచి 5వేల క్యూసెక్కుల నీరు మూసీకి వస్తుండటంతో అది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మంగళవారం రాత్రికి మరింత వర్షం కురిస్తే మరిన్ని గేట్లను ఎత్తుతామని, మూసీ పరీవాహన ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని, నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్లే రోడ్డును మూసేసినట్లు అధికారులు తెలిపారు. 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల -
నేరాల్లో పాలుపంచుకున్నవారికి బైండోవర్
కేశంపేట: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ నేరాల్లో పాలుపంచుకున్న వ్యక్తులను మంగళవారం తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ నరహరి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ముందు చర్యల్లో భాగంగా బైండోవర్ చేశామన్నారు. మండల పరిధిలోని కొత్తపేటకు చెందిన భానుచందర్, కేశంపేటకు చెందిన జంగయ్య, మహేశ్, ఎల్లస్వామి, నిర్దవెళ్లికి చెందిన నర్సింహాచారిని బైండోవర్ చేశారు. ఇద్దరు యువకులకు రిమాండ్ రూ.1.01లక్షల విలువైన 4.04 కిలోల గంజాయి స్వాధీనం పహాడీషరీఫ్: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. రోషన్ ద్దౌలాలో నివాసం ఉండే బిసా కొమ్రీ అలియాస్ చింటూ(19), కొక్కిలిగడ్డ హారూణ్ అలియాస్ అరుణ్(20), ఒడిశాకు చెందిన అర్జున్ బైక్‌పై శివాజీచౌక్ మీదుగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీల్లో ఉన్న ఎస్ఐ కోటేశ్వర్ రావు వారిని సోదాలు చేయగా మూడు ప్యాకెట్లలో రూ.1.01 లక్షల విలువైన 4.04 కిలోల గంజాయి లభ్యమైంది. అర్జున్ పరారీలో ఉండగా.. మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కుతరలించారు. -
డాక్టరేట్ సాధించిన గిరిపుత్రుడు
తాండూరు టౌన్: కృషి ఉంటే మనుషులు రుషులవుతారని నిరూపించాడు ఓ గిరిపుత్రుడు. పేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ సాధించాడు బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన విఠల్ రాథోడ్. తల్లి నాగిబాయి, తండ్రి రాము నాయక్ ద్వితీయ పుత్రుడైన విఠల్ రాథోడ్ చిన్ననాటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి కనపరిచే వాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయినా, పట్టుదలతో చదివి ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డి పట్టా సాధించాడు. పేదరికం ఉన్నత చదువులకు అడ్డంకి కాదని నిరూపించాడు. ఎంఏ ఇంగ్లిష్, ఎంఈడీ పూర్తి చేసిన ఆయన, 2020లో హెసీయూ నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి అడ్మిషన్ సాధించాడు. హెచ్‌సీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గీతా గోపీనాథ్ పర్యవేక్షణలో శ్రీస్వదేశీ విద్యార్థుల జీవన నైపుణ్యాలు, నియంత్రణ స్థితికి సంబంధించి ద్వితీయ స్థాయిలో మానసిక సామాజిక సామర్థ్యంశ్రీ అనే అంశంపై ఐదేళ్ల పాటు పరిశోధన చేసి 2024లో థీసిస్ సమర్పించారు. అతని పరిశోధనకు గాను మంగళవారం హైదరాబాద్‌లో హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ బీజే రావు చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న విఠల్ రాథోడ్ దేశంలోనే అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన యూజీసీ నెట్లో అర్హత సాధించి రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికై నెలకు రూ. 53వేల పారితోషకాన్ని ఐదేళ్ల పాటు తీసుకున్నారు. అలాగే జనవరి 2023లో దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్లో బ్లెండెడ్ లర్నింగ్, ప్రతిభావంతమైన అభ్యసానికి ఒక హైబ్రిడ్ బోధనా నమూనా అనే అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చి పత్ర సమర్పణ చేయడం విశేషం. డాక్టరేట్ సాధించిన విఠల్ రాథోడ్‌ను గ్రామస్తులు, సహచరులు, కుటుంబ సభ్యులు అభినందనలతో ముంచెత్తారు. ఓయో రూంలో యువకుడి ఆత్మహత్య కుషాయిగూడ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌ష్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జై జవాన్ కాలనీకి చెందిన మన్నె నరేందర్ (30) తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఏఎస్‌రావునగర్‌లోని సిఎంఆర్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసిన నరేందర్ ఈ మధ్యే పనికి వెళ్లడం మానేశాడు. ప్రాథమిక సమాచారం మేరకు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలో పెరిగిన ఆర్థిక ఇబ్బందులతో సోమవారం ఈసీఐఎల్‌లోని ఓయో రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు మూసాపేట: భార్యను హత్య చేసిన కేసులో న్యాయస్థానం మంగళవారం భర్తకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి...కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లా మదర్గాన్ గ్రామానికి చెందిన కుల్బే సంతోష్ (46) భార్య సురేఖతో పాటు కూకట్పల్లి, మూసాపేట, కై త్లాపూర్‌లో నివా సం ఉంటూ కూలి పని చేసేవాడు. సంతోష్ నిత్యం మద్యం సేవించి భార్యను మానసికంగా, శారీకంగా వేధించేవాడు. 2022 మే 16వ తేదిన సంతోష్ భార్యను గొంతు కోసి ఆమె మెడ నుంచి బంగారం పుస్తె, గుండ్లు తీసుకుని వెళ్లాడు. ఆమె చికిత్స పొందుతూ 19వ తేదిన గాంధీ ఆసుపత్రిలో చనిపోయి ంది. 16వ తేదీన కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. భార్య గొంతు కోసి చంపినందుకు దోషిగా నిర్ధారిస్తూ కూకట్‌పల్లిలోని మేడ్చల్ జిల్లా సెషన్స్ జడ్జి, ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్చునిచ్చారు. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై కేసు నమోదు వెంగళరావునగర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ నాయకుడు నవీన్‌యాదవ్‌పై మధురానగర్ పీఎస్‌లో కేసునమోదైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నవీన్‌యాదవ్ ఫేక్ ఎపిక్ (ఓటరు) కార్డులను పంపిణీ చేశారని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దాని ఆధారంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ఆసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రజినీకాంత్‌రెడ్డి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాలను ఉల్లంఘిస్తూ పౌరులకు చట్ట విరుద్ధంగా ఎపిక్ కార్డుల పంపిణీ జరిగిందని, ఇదే నిజమైతే అవి నేరం కిందకు వస్తాయని, ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, ఇందుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏఆర్ఓ ఫిర్యాదుపై స్పందించిన ఇన్స్పెక్టర్.. కాంగ్రెస్ నాయకుడు నవీన్‌యాదవ్‌పై బీఎన్ఎస్ 170, 171, 174 తో పాటుగా ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహా అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన దృష్ట్యా అందుకనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ కోసం జోనల్ వ్యవస్థను విస్తరించనున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏ సేవలను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో సంస్థాగతమైన పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టారు. ఈమేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీ నియామకం కోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించారు. హెచ్ఎండీఏ పరిధిని 7,257 చ.కి.మీ. నుంచి 10,526 చ.కి.మీ. వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359 గ్రామాలు హెచ్ఎండీఏలో విలీనమయ్యాయి. ఈ మేరకు ప్రణాళికాబద్ధమైన మహానగరం నిర్మాణం, అభివృద్ధి దృష్ట్యా కార్యకలాపాలను వికేంద్రీకరించనున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి–1, శంకర్పల్లి–2, మేడ్చల్–1, మేడ్చల్–2 జోన్ల పరిధిలో హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం సేవలు అందిస్తోంది. కొత్తగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని మరో నాలుగు జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కూడా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకనుగుణంగా అధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. మహానగర అభివృద్ధే ధ్యేయం పునర్వ్యవస్థీకరణ, జోనల్ స్థాయిలో సేవల వికేంద్రీకరణ ద్వారా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధివంటి ప్రధానమైన కార్యకలాపాలపై కమిషనర్ దృష్టి కేంద్రీకరించనున్నారు. మరోవైపు సమర్థ ల్యాండ్‌పూలింగ్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఏకీకృత బిల్డింగ్, డెవలప్మెంట్ కోడ్‌ను రూపొందించడం, మాస్టర్‌ప్లాన్–2050 రూపకల్పన, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వంటి లక్ష్యాల దిశగా కార్యాచరణ చేపట్టనున్నారు. ● అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెచ్ఎండీఏను సంస్థాగతంగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ● జోనల్ వ్యవస్థలను విస్తరించడంతో పాటు జోనల్‌స్థాయి కమిషనర్లను కూడా నియమించనున్నారు. తద్వారా అన్ని రకాల నిర్మాణరంగ అనుమతులు, లే అవుట్లు జోనల్ స్థాయిలోనే అందజేస్తారు. దీంతో మెట్రోపాలిటన్ కమిషనర్ వ్యూహాత్మక ప్రణాళిక, విధాన రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుంది. ● హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ని ఆహ్వానించారు. కన్సల్టెంట్ ఎంపిక క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పద్ధతిలో 80:20 నిష్పత్తిలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆర్ఎఫ్పీలో పేర్కొన్న అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హత సాధించిన బిడ్డర్ల ఫైనాన్షియల్ బిడ్లను మాత్రమే తెరిచి తుది ఎంపిక చేపడతారు. హెచ్ఎండీఏ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం ట్రిపుల్ ఆర్ వరకు జోనల్ వ్యవస్థ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కన్సల్టెన్సీ సాంకేతిక, ఆర్థిక బిడ్లపై దరఖాస్తులకు ఆహ్వానం -
సీజేఐపై దాడికి యత్నం అమానుషం
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ జోనల్ స్థాయి టోర్నమెంట్‌ను మంగళవారం పట్టణ సమీపంలోని గురుకుల విద్యాపీఠం్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రీడలకు ప్రోత్సాహం కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు సూచించారు. అవసరమైతే సొంత డబ్బులు వెచ్చించి క్రీడకారులకు సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ కరుణాకర్, పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, ఎస్జీటీ జోనల్ సెక్రటరీ సుశీల, నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, నీళ్ల భాను, ప్రశాంత్‌కుమార్, వెంకటేశ్వర్లు, కొంగర విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి యత్నాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు రమణ, జిల్లా సభ్యుడు సామేల్ మాట్లాడుతూ.. మతోన్మాదంతో న్యాయవాది రాకేశ్ కిషోర్ తన బూట్‌ను న్యాయమూర్తి గవాయ్‌పై విసిరిన ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. న్యాయవాది రాకేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలని.. ఈ దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈ.నర్సింహ, జి.నర్సింహ, ప్రకాశ్‌కారత్, బుగ్గరాములు, ఎల్లేష్, యాదగిరి, యాదయ్య, సుధాకర్, వీరేశం, వంశీ, శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
అడ్డగోలు నిర్మాణాలు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పట్టణ ప్రణాళికా విభాగం దారి తప్పుతోంది. కళ్లముందే భారీగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా, అనధికారిక సెల్లార్లు తవ్వుతున్నా.. కళ్లప్పగించి చూస్తుందే కానీ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. సరికదా పరోక్షంగా ఆయా అక్రమార్కులకు కొమ్ముకాస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శివారు మున్సిపాలిటీల్లో అనుమతి లేని నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మణికొండ, నార్సింగి, బండ్లగూడజాగీర్, శంషాబాద్, బడంగ్పేట్, తుర్కయంజాల్, జల్పల్లి, పెద్ద అంబర్పేట్, తుక్కుగూడ, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో అడ్డగోలు నిర్మాణాలు వెలుస్తున్నాయి. కనీస అనుమతులు లేకపోవడంతో పాటు 60 గజాల స్థలంలో ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా చేస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారే కానీ.. తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. బేస్మెంట్ దశలోనే అడ్డుకోవాల్సింది పోయి.. తీరా స్లాబులు వేసి, గోడలు నిర్మించిన తర్వాత తనిఖీల పేరుతో టీపీఓ, అసిస్టెంట్ టీపీఓ, చైన్మెన్లు వచ్చి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇచ్చేందుకు నిరాకరిస్తే నిర్మాణాలను మధ్యలోనే కూల్చే ప్రమాదం ఉండటంతో భవన యజమానులు కూడా వారు అడిగినంత ఇచ్చి పంపుతున్నారు. ముఖ్యంగా 111 జీఓ పరిధిలోని శంషాబాద్ మున్సిపాలిటీలో భారీ సెల్లార్లు, భవంతులు వెలుస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, విద్యుత్ అధికారులు సైతం సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. పాత వెంచర్లలో రోడ్లు, పార్కులు, విద్యా సంస్థలు, దేవాలయాల కోసం వదిలిన ఖాళీ స్థలాలను కబ్జా చేసి, గుట్టుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అంశంపై స్థానికులు సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోండి.. బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ఆక్రమణకు సంబంధించి అమెరికన్ టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అనధికారిక ప్రతివాదులైన షేక్ సైఫుద్దీన్, ప్రైడ్ ఇండియా మాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై పోలీసుల సాయంతో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలోని రేణుకాపూర్ విలేజ్ సర్వే నంబర్ 354/4లోని అమెరికన్ టౌన్షిప్ లే అవుట్ ప్రకారం 40 ఫీట్ల రోడ్డు ఉండగా, మహ్మద్ సైఫుద్దీన్ రహదారిని కబ్జా చేశారని, చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అమెరికన్ టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడితో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ కృష్ణ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ఫిర్యాదు మేరకు చర్య తీసుకున్నామని చెప్పారు. అనధికారిక ప్రతివాదుల నిర్మాణాలు కూల్చివేశామన్నారు. వారు మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని, అవసరమైతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి సాయం పొందాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు. మున్సిపాలిటీల్లో ఇష్టారాజ్యం రెచ్చిపోతున్న అక్రమార్కులు పార్కుస్థలాలు, రోడ్లు యథేచ్ఛగా కబ్జా పట్టించుకోని అధికారులు కోర్టులను ఆశ్రయిస్తున్న బాధితులు -
ప్రమాదవశాత్తు రికార్డ్స్ దగ్ధం
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలోని ఓ గదిలో భద్రపరిచిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన స్కాలర్షిప్ మాన్యువల్ ఆన్లైన్స్పైరల్ బాండింగ్ హార్డ్ కాపీస్ మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. 1982 నుంచి 2015 వరకు సంబంధించిన హార్డ్ కాపీస్, ఫైల్స్ మైసిగండి ఆశ్రమ పాఠశాలలోని ఓ గదిలో భద్ర పర్చారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదవశాత్తు గదిలో భద్ర పరిచిన రికార్డులు దగ్ధమయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగాధర్, ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వసతిగృహ సంక్షేమాఽధికారి బాలరాజు పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు సీఐ గంగాధర్ తెలిపారు. -
ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మంగళవారం విరామం లేకుండా సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5.30 నుంచి 7. 30 గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నంలో 39 మి.మీ, ఎలిమినేడులో 27.3, మంగల్‌పల్లిలో 22, కొంగరకలాన్‌లో 11.3, తుర్క యంజాల్లో 27, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. -
రైతులు సంఘటితం కావాలి
నవాబుపేట: పిల్లలపై తల్లిదండ్రులకు ఎంత మమకారం ఉంటుందో.. రైతులకు భూమిపై అంతకన్నా ఎక్కువ ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టిన విషయం తెలిసిందే. వారిని మంగళవారం చిట్టిగిద్ద గ్రామంలో ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు భూమిని నమ్ముకొని బతుకుతుంటే కాంగ్రెస్ అన్నదాతల భూములను అమ్ముకొని ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రైతులకు మోసం జరుగుతుంటే స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో సీఎం తలదించుకోవాలన్నారు. అభివృద్ధిని తాము వ్యతిరేకించడం లేదని, రైతులకు సరైన మేలు చేయాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. ట్రిపుల్ ఆర్ బాధితులకు భూమికి బదులు భూమి.. లేదా మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు తిరగ బడితేనే వారికి సరైన న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అదే తరహాలో పోరాటం చేయాలని పిలపు నిచ్చారు. పేదలను ముంచి.. పెద్దలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అలైన్మెంట్ మార్చిందని ఆరోపించారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్, నాగేందర్‌గౌడ్, శుభప్రద పటేల్, ఆంజనేయులు, భరత్ రెడ్డి, దయాకర్ రెడ్డి, విజయ్ కుమార్, మాణిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, శాంత కుమార్, నరేందర్ రెడ్డి, రాజు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ భూములమ్ముకొని బతకాలని చూస్తోంది ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి ట్రిపుల్ ఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరం
కడ్తాల్: విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉ న్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలపై అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్లు వాహ నా లు నడపొద్దని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్య లు తీసుకోవడం జరుగుతుందన్నారు. లైసెన్స్‌లేకుండా వాహనాలు నడపొద్దని, ద్విచక్రవాహనాలను హెల్మెట్ లేకుండా, కారును సీట్‌బెల్ట్ ధరించకుండా నడపరాదని తెలిపారు. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లా డుతూ వాహనాలు నడపొద్దని, ఎడమ చేతి వైపు నడవడం తదితర ట్రాఫిక్ నియమా లను వివరించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, పాఠశాల హెచ్్ఎం రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
దారి.. వెళ్లేదెలా మరి!
ఏకధాటి వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రంసాక్షి, రంగారెడ్డిజిల్లా: అసలే నాసిరకం పనులు.. ఆపై ఏకధాటి వర్షాలు.. వరదలు.. ఇంకేముంది గ్రామీణ రహదారులను ఛిద్రం చేశాయి. మారుమూల గ్రామీణ రోడ్లే కాదు.. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. ఇటు ఎల్బీనగర్ నుంచి అటు బాటసింగారం వరకు విజయవాడ రహదారిపై అడుగుకో గుంతతేలింది. అష్ట వంకరలు తిరిగి.. అనేక మలుపులతో నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న బీజాపూర్ జాతీయ రహదారి (అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల వరకు) పూర్తిగా దెబ్బతింది. శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు ఉన్న బెంగళూరు జాతీయ రహదారి సహా పహడీషరీఫ్ నుంచి ఆమనగల్లు వరకు విస్తరించి ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి, బీఎన్‌రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మాల్ వరకు విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ రోడ్డు, షాద్‌నగర్ నుంచి తాండూరు వెళ్లే మార్గం, కోకాపేట నుంచి శంకర్పల్లి మీదుగా చేవెళ్ల వెళ్లే మార్గం ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన రోడ్ల భవనాలశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు అటు వైపు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాకపోకలకు ఇబ్బందులు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నిలిచి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో రోడ్డుపై ఉన్న తారు, సీసీ దెబ్బతిని కంకర తేలుతోంది. దెబ్బతిన్న ఈ రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వాహనాల డిస్క్‌లు, క్లచ్ ప్లేట్లు, బ్రెక్లు దెబ్బతింటున్నాయి. రిపేర్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయా వాహనాలపై ప్రయాణించే వృద్ధుల డిస్క్(ఎముక)లు దెబ్బతిని తీవ్రమైన ఒంటి నొప్పులో బాధపడుతూ చికిత్సల కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. మాడ్గుల, మంచాల, యాచారం, కేశంపేట, తల కొండపల్లి, నందిగామ, కొత్తూరు, కొందుర్గు, చౌద రిగూడ, శంకర్పల్లి, మొయినాబాద్ మండల కేంద్రాల నుంచి మారుమూల గ్రామాలకు వెళ్లే పంచాయతీరాజ్ రోడ్లు పూర్తిగా కంకరతేలి, ప్రమాదకరంగా మారాయి. అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలు షాబాద్: బురదమయంగా మారిన ఎర్రోనిగూడ రోడ్డు -
అడిగిన సమాచారం ఇవ్వండి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఎకై ్సజ్‌శాఖ హైదరాబాద్ డిఫ్యూటీ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు సంబంధిత ఎకై ్సజ్ స్టేషన్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సోమవారం అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధి లోని 11 ఎకై ్సజ్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీమ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రెండేళ్లలో మద్యం అమ్మకాల వివరాలను దరఖాస్తు దారులకు ఇవ్వాలని చెప్పారు. అలాగే దరఖాస్తుల సమూనాలో తప్పులు లేకుండా సహకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను అబ్కారీ భవన్‌లోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న కౌంటర్లో దాఖలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారిగా డిస్ప్లే చేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి సూచించారు. -
మెట్రో కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: రపయాణికుల రాకపోకలతో సోమవారం మెట్రోరైళ్లు కిటకిటలాడాయి. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి చేరుకోవడంతో వివిధ ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లలో రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి చేరుకున్నవాళ్లు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు బయలుదేరారు. ఎల్బీనగర్ మెట్రో వద్ద ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు ప్రయాణికుల సందడి నెలకొంది. నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, అమీర్‌పేట్, రాయదుర్గం, లక్డీకాపూల్, ఖైరతాబాద్, కూకట్పల్లి, మియాపూర్ తదితర స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న రైళ్లతో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్లలో సందడి కనిపించింది. సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున సిటీకి చేరుకున్నారు. విజయవాడ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రధాన రహదారుల్లోని శివారు ప్రాంతాల్లో రద్దీ కారణంగా వాహనాలు స్తంభించాయి. -
కాంగ్రెస్ విధానాలను ఎండగట్టాలి
మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్ధానాలకు నిదర్శనమే బాకీ కార్డు అని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం పార్టీ నేతలతో కలిసి బాకీ కార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న ఆరు గ్యారంటీలను 700 రోజులైనా పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నియోజకర్గ ఉపాధ్యక్షులు హన్మగళ్ల చంద్రయ్య, కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మండల అధ్యక్షుడు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి
ఇబ్రహీంపట్నం: పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు.పెంచిన చార్జీలను నిరసిస్తూ సోమవారం ఇబ్రహీంపట్నం డిపో వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఆర్టీసీని రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకింద ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.3 వేల కోట్లు బకాయి పడిందని తెలిపారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు చార్జీలను పెంచిందన్నారు. సుమారు 25 వేల మంది ఆర్టీసీ కార్మికులు కో–ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని జమ చేసుకున్న రూ.వెయ్యి కోట్లను గజదొంగ మాదిరిగా రేవంత్ సర్కార్ ఖాళీ చేసిందని ఆరోపించారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బోసుపల్లి ప్రతాప్, గొగిరెడ్డి లచ్చిరెడ్డి, నర్సింహారెడ్డి, రాంరెడ్డి, ధనంజయ్గౌడ్, రాఘవేందర్, అనిల్‌కుమార్, శివకుమార్, గోవర్ధన్, శివధర్‌రెడ్డి, సందీప్, ముత్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
12న పద్మశాలీ సంఘం దసరా మేళా
హుడాకాంప్లెక్స్: ఆటోనగర్‌లోని హరిణ వనస్థలి అనన్య ఎకోపార్కులో ఈ నెల 12న పద్మశాలీ సంఘం 23వ దసరా మేళా నిర్వహిస్తున్నట్టు సంఘం ఎల్బీనగర్ అధ్యక్షుడు పున్న గణేశ్ నేత తెలిపారు. హుడా కాంప్లెక్స్‌లోని సంఘం కార్యాలయంలో సోమవా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మేళాలో పద్మశాలి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించుకోవడంతో పాటు ప్రముఖుల సంక్షిప్త సందేశాలు, చేనేత కళాకారులకు సన్మానాలు, సమాజ శ్రేయస్సుకు సహకరిస్తున్న పెద్దలకు సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడుతూ.. పద్మశాలీల ఐక్యతకు ఈ మేళా తోడ్పడుతుందని అన్నారు. సమావేశంలో సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూపా సదాశివ్, అఖిల భారత పద్మశాలి యువజన విభాగం అధ్యక్షుడు అవ్వారు భాస్కర్, గుర్రం శ్రావణ్, గడ్డం లక్ష్మీనారాయణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్, స్వప్న, రేఖ, ఊర్కొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాను సందర్శించిన రాచకొండ సీపీ అబ్దుల్లాపూర్‌మెట్ : రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సోమవారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్న ఆయన రికార్డులను తనిఖీ చేశారు. సీఐ అశోక్‌రెడ్డితో పాటు ఎస్ఐలకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేటినుంచి జోనల్ స్థాయి క్రీడోత్సవాలు ఇబ్రహీంపట్నం: స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే జోనల్ స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వీటిని ప్రారంభిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లోని అండర్–14, అండర్–17 విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారు. ఆయా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేయనున్నారు. త్రిపుల్ ఆర్ కొత్త అలైన్మెంట్ మార్చాలి ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం త్రిపుల్ ఆర్ కొత్త అలైన్మెంట్ మార్చాలని సీపీఎంజిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెద్దల కోసం అలైన్మెంట్ మార్చి, పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నీతిమాలిన చర్యలు మానుకోవాలని హితవుపలికారు.అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు జగన్, జిల్లా నాయకుడు రాజు, తదితరులు పాల్గొన్నారు. -
పొరపాట్లకు తావివ్వొద్దు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్థానిక ఎన్నికల ప్రక్రియను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు, అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మండలస్థాయి అధికారులు ఒక టీంగా ఏర్పడి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభ్యర్థులు సభలు, ర్యాలీలు, సమావేశాల కోసం అనుమతి పొందాల్సి ఉంటుందని, సంబంధిత సమాచారాన్ని ఖర్చుల పర్యవేక్షణ బృందానికి అందించాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ప్రొసైడింగ్, సహాయ ప్రొసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని డీసీపీ సునీతారెడ్డి చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, రెవెన్యూ డివిజినల్ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
‘మీన’మేషాలు!
హయత్‌నగర్: వర్షాలు విరివిగా కురిసి.. చెరువులు పూర్తిగా నిండితే ముందుగా సంబరపడేది రైతులు, ఆ తర్వాత మత్స్యకారులే. చెరువు నీటిలో చేపలు పెంచుకుంటే ఏడాదికి సరపడా ఉపాధికి ఢోకా ఉండదని వారి ఆశ. ఆశించినట్టుగానే ఈ ఏడాది ప్రకృతి కనికరించి వర్షాలు బాగా కురవడంతో చెరువులు పూర్తిగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి. అయినా చేపపిల్లల పంపిణీలో అధికారులు చేస్తున్న తాత్సారం మత్స్యకారుల ఆశకు గండి కొడుతోంది. పంపిణీపై సందేహాలు జిల్లాలో ఇప్పటివరకు ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టక పోవడంతో మత్స్యకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లా పరిధిలో రెండు వందలకు పైగా మత్స్యపారిశ్రామిక అభివృద్ధి సొసైటీలు ఉన్నాయి. సుమారు 10 వేల కుటుంబాలకు పైగా ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి చెరువుల్లోకి నీరు వస్తున్నా సొసైటీలకు చెపపిల్లలు ఇవ్వడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జూలై నుంచే చేపల సీడ్ పంపిణీ చేయాల్సిన మత్స్యశాఖ ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. దీంతో అసలు చేపలు పంపిణీ చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉచిత చేపిల్లల పంపిణీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
స్పెషల్ వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయ లోపంతో భూ యజమానులు, ప్లాట్ల యజమానులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని బీఆర్ఆర్ పౌండేషన్ చైర్మన్, ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ బూడిద రాంరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసి సెక్రటేరియెట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ లేఅవుట్లు, జీహెచ్ఎంసీలో పరిధిలో లే అవుట్ల ద్వారా, సేల్డీడ్ల ద్వారా నాలా కన్వెర్షెన్, రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్లు చేయకుండా ప్లాట్లు విక్రయించారన్నారు. ధరణి తప్పిదాలు పునరావృతం కాకుండా భూభారతిలో లోపాలు సరి చేసి భవిష్యత్‌లో ఆస్తి హక్కులపై వివాదాలు రాకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ప్లాట్లు, భూముల వివరాలను నమోదు చేసి సరైన వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు.బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాంరెడ్డి -
భర్త మృతి.. కొడుకు కటకటాల్లోకి
షాబాద్: తాగిన మైకంలో తల్లితో గొడవ పడుతున్న తండ్రిని పక్కకు తోసేయడంతో ఆయన మృత్యువాత పడ్డాడు. ఓ వైపు భర్త మరణం.. మరోవైపు ఆయన మృతికి కారణమైన కొడుకు జైలుకు వెళ్లడంతో ఆ తల్లికి పుట్టెడు దుఖం మిగిలింది. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పధిలోని దామర్లపల్లి గ్రామానికి చెందిన సదానందం(65) మద్యం సేవించి భార్య సుజాతతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు రమేశ్ తల్లిదండ్రులను వారించేందుకు వెళ్లగా తండ్రి దాడికి యత్నించాడు. దీంతో రమేశ్ తండ్రి సదానందంను తొసేయడంతో కుప్పకూలాడు. వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తండ్రి మృతికి కారణమైన వ్యక్తి రమేశ్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
సంపులో పడి..చిన్నారి మృతి
కొందుర్గు: సంపులో పడి చిన్నారి మృతిచెందిన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం చేగిరెడ్డి ఘనాపూర్‌లో చోటుచేసుకుంది. చౌదరిగూడ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన శిరీషకు ఎనిమిదేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన శ్రీనుతో వివాహమైంది. వీరికి ముగ్గురు కూతుళ్లు. రెండు నెలల క్రితం భర్తతో గొడవపడిన శిరీష పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఆమె ఇద్దరు కూతుళ్లను తన పెద్దమ్మ యాదమ్మ ఉంచి పెద్ద కూతురు అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. తిరిగి వచ్చేసరికి చిన్న కూతురు ధన్షిక (13 నెలలు) కనిపించలేదు. ఇంటి ఎదుట నీటిసంపులో చూడగా మృతదేహం తేలియాడుతూ కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాల బ్యాటరీలు చోరీ మణికొండ: కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో నిలిపిన వాహనాల బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మున్సిపల్ పరిధి లోని శ్రీరాంనగర్ కాలనీలో రెండు రోజులు గా కాలనీలోని ఖాళీ స్థలాల్లో టాటా ఏస్, డీ సీఎం వాహనాలకు పూజలు చేసి నిలిపి ఉంచారు. సోమవారం ఉదయం చూసే సరికి వాటి బ్యాటరీలను దొంగిలించారని బాధితు లు గుర్తించారు. చేసిన సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవటంతో వారిని గుర్తించేందుకు వీలు పడటం లేదని, సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బ్యాటరీ దొంగలపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశామని వాహనదారులు తెలిపారు. -
బంగారానికి మెరుగు పెడతామని..
● నిందితులకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు షాద్‌నగర్‌రూరల్: బంగారానికి మెరుగు పెడుతామంటూ ఇద్దరు దుండగులు ఓ వృద్ధురాలిని బురిడీ కొట్టించారు. మత్తు మందు చల్లి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మండల పరిధిలోని వెలిజర్లలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ విజయ్‌కుమార్, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు బ్యాగరి చిన్నమ్మ ఇంటికి సోమవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. బంగారం, వెండి ఆభరణాలకు మెరుగుపెడుతాం అంటూ నమ్మించారు. దీంతో ఆమె తన వెండి కడియాలను ఇవ్వడంతో శుభ్రం చేసి ఇచ్చారు. అనంతరం మెడలో ఉన్న తులంన్నర బంగారు గుండ్ల హారాన్ని ఇచ్చింది. నిందితులు స్టవ్‌పై గిన్నె ఉంచి నీళ్లు, పసుపు వేసి అందులో బంగారు దండ వేసినట్లు నటించారు. దండ తెల్లగా అయ్యిందని దాన్ని టిఫిన్ బాక్స్‌లో పెట్టామని వృద్ధురాలికి చెప్పారు. అంతలోనే ఆమైపె మత్తు మందు చల్లి నగలతో ఉడాయించారు. తేరుకున్న వృద్ధురాలు కాసేపటికి తేరుకున్న వృద్ధురాలు చిన్నమ్మ విషయాన్ని చుట్టు పక్కల వారికి చెప్పింది. దీంతో గ్రామస్తులు అప్రమత్తమై గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. గ్రామంలోని ఓ టీకొట్టు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వారిని గ్రామ పంచాయతీ వద్దకు తీసుకువచ్చి దేహశుద్ధి చేయడంతో చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నిందితులను ఠాణాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మత్తుమందు చల్లి వృద్ధురాలి నగలు దోచుకెళ్లిన దుండగులు -
రైతుల ముందస్తు అరెస్ట్
నవాబుపేట: ట్రిపుల్ఆర్ కొత్త అలైన్‌మెంట్‌కు నిరసనగా ధర్నాకు సిద్ధమైన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మండలంలోని చించల్‌పేట, చిట్టిగిద్ద గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు నగరంలోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చేసి నవాబుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు స్టేషన్‌కు చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ రైతులను అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. త్వరలో సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఎస్సీ నారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడి వెంటనే రైతులను విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. అనంతరం రైతులను విడిచిపెట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్, నాగేందర్‌గౌడ్, భరత్‌రెడ్డి, విజయ్‌కుమార్, పురుషోత్తం, కృష్ణారెడ్డి, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన సోను అకాడమీ విద్యార్థులు
నలుగురికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు ఆమనగల్లు: పట్టణానికి చెందిన సోను కరాటే అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు సోను కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సోను తెలిపారు. చైన్నెలోని ఎస్ఐ వీఐటీ కాలేజీలో కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ బాలమురుగన్ సమన్వయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికార ప్రతినిధి రిషినాద్ సమక్షంలో సోను కరాటే అకాడమీ విద్యార్థులు శ్రీయాన్ష్, యశ్వంత్, నిద్విక్గౌడ్, యాస్మిన్లు కరాటేలో తమ ప్రతిభను కనబర్చి గత రికార్డులను బ్రేక్ చేశారు. అనంతరం విద్యార్థులకు రిషినాద్ గిన్నిస్ మెడల్, సర్టిఫికెట్ అందించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను చైన్నె లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ ఏకేఎస్ వినోద్ సర్వాగి, మాజీ గవర్నర్ ఎస్ఎస్ శరవనన్లు అభినందించారు. ‘డబుల్’ ఇళ్లలో కార్డన్ సెర్చ్ శంకర్పల్లి: పట్టణ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సోమవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సెర్చ్‌లో సుమారు 150 మంది పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 1500 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆధార్ కార్డులు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బలవన్మరణం నవాబుపేట: ఆర్థిక ఇబ్బ ందులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం చిట్టిగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పుండ్లక్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన జంగ రాములు(50) శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ నంబర్ 20లో 20 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలో 1.05 ఎకరాల పొలం ఉండగా ఈ ఏడాది పత్తి సాగు చేశాడు. వర్షాలకు పంట పూర్తిగా పాడైంది. ఆయన కుమారులు వెంకటేశ్ డిగ్రీ మొదటి సంవత్సరం, నికిల్ 10వ తరగతి చదువుతున్నాడు. కూతురు శిరీష అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటోంది. రాములు రోజు మాదిరి గానే సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. ఇంటి సమీపంలో చింత చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు తెలపడంతో మృతదేహానికి వికారాబాద్ ప్రభుత్వా స్పత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యు లకు అప్పగించారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుట్టింటికి వచ్చిన మహిళ అదృశ్యం దుద్యాల్: పండుగకు తల్లిగారింటికి వచ్చిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన దుద్యాల్ ఠాణా పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ యాదగిరి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పోలేపల్లికి చెందిన కొత్తూరు బాలమణికి పొరుగు రాష్ట్రానికి చెందిన రాజుతో వివాహమైంది. వీరు కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ జీవన సాగిస్తున్నారు. దసరా నేపథ్యంలో ఈ నెల 1వ తేదీన పోలేపల్లికి బాలమణి తన కుమారుడితో కలిసి వచ్చింది. ఆమెకు కుమారుడు కొడంగల్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. దీంతో ఈ నెల 5వ తేదీన బాబును పాఠశాలకు పంపిస్తానని తల్లి అంజిలమ్మకు చెప్పి బయలుదేరింది. పాఠశాలలో బాబును వదిలిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో అంజిలమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ఆర్ మంటలు
అలైన్మెంట్ మార్చడంతో అన్నదాతల పోరుబాటపూడూరు: ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చడంపై బాధిత రైతులు పోరుబాట పట్టారు. మా భూములు తీసుకుంటే వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా లాక్కుంటే చావే శరణ్యమని అంటున్నారు. పూడూరు మండల పరిధిలోని తుర్క ఎన్కేపల్లి, కంకల్, నిజాంపేట్ మేడిపల్లి, మంచన్‌పల్లి, గట్టుపల్లి, సిరిగాయపల్లి, కెరవెళ్లి, రాకంచర్ల, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు, గొంగుపల్లి, ఎన్కేపల్లి తదితర గ్రామాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వేయనున్నారు. దీంతో రైతులు ఆందోళ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. పెద్దల కోసం మూడు సార్లు అలైన్మెంట్ మార్చి పేదల కడుపుకొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ధర్నాలు చేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు వేయా లని పలువురు డిమాండ్ చేశారు. తామంతా పొలాలను నమ్ముకొనే జీవనం సాగిస్తున్నామని, బలవంతంగా భూములు లాక్కుంటే గ్రామాలు వదిలి వలస వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఎంతో కష్టపడి భూములు కొనుగోలు చేశామని.. ఏడాదికి మూడు పంటలు తీస్తున్నామని, ఇలాంటి పొలాల ను అభివృద్ధి పేరిట తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని విరమించుకో వాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. సోమవారం నగరంలోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమవుతున్న సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్, పూడూరు రైతులు తాజొద్దీన్, నర్సింహారెడ్డి, సాయన్న, అనీల్, జంగయ్యను అరెస్టు చేసి చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏ మండలంలో ఎన్ని ఎకరాలంటే.. జిల్లాలోని మోమిన్‌పేట్ మండలంలో రెండు గ్రా మాల్లో 300 ఎకరాలు, నవాబుపేట మండలంలో 400 ఎకరాలు, పూడూరు మండలంలో 11 గ్రామా ల్లో 1,000 ఎకరాలు, వికారాబాద్ మండలంలోని నాలుగు గ్రామాల్లో 600 ఎకరాల భూమి పోతుంది. పాత అలైన్మెంట్లో 189కిలో మీటర్లు ఉండగా, రెండో అలైన్మెంట్లో 201 కిలో మీటర్లకు పెంచారు. తాజాగా 218 కిలో మీటర్లకు మార్చాలని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రేడియల్’తో మరిన్ని గ్రామాలు గతంలో ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్డు వేసేందుకు షాబాద్ మండలం మీదుగా పూడూరు మండలంలోని పుడుగుర్తి, కంకల్, మంచన్‌పల్లి, గట్టుపల్లి, మాదారం రంగాపూర్ గ్రామాల మీదుగా అనుసంధానం చేయనున్నారు. రైతులు వందల ఎకరాల్లో భూములు కోల్పోనున్నారు. అరెస్టు దారుణం ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులను అరెస్టు చేయడం దారుణమని సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి అ న్నారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్, పూ డూరు రైతులు తాజొద్దీన్, నర్సింహారెడ్డి, సాయన్న, అనీల్, జంగయ్యను అరెస్టు చేసి చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని తెలిపారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రైతులను విడిచిపెట్టారు. మార్కెట్ ధర చెల్లించాలి కొత్త అలైన్మెంట్తో చాలా మంది పేద రైతులే భూము లు కోల్పోతున్నారు. బలవంతంగా తీసుకోవాలని చూస్తే ఊరుకోం. భూమికి భూమి ఇవ్వాలి. లేకుంటే మార్కెట్ ధర రూ.2 కోట్లు చెల్లించాలి. నామమాత్రపు పరిహారానికి ఒప్పుకోం. అభివృద్ధికి ఎవరూ అడ్డు చెప్పరు. అదే సమయంలో రైతుల సంక్షేమం కూడా చూడాలి. – గోవర్ధన్‌రెడ్డి, బాధిత రైతు అంతా పేద రైతులే పూడూరులో చాలా మంది పేద రైతులే ఉన్నారు. రెండెకరాల్లో ఎకరం భూమి పోతే జీవనం ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడి రైతులు ఏడాదికి మూడు పంటలు తీస్తున్నారు. కొత్త అలైన్మెంట్తో అందరికి తీరని నష్టం. నవాబులది పోతలే.. చిన్న సన్నకారు రైతులదే పోతోంది. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు వేయాలి – నర్సింహారెడ్డి, పూడూరు -
పనిఒత్తిడే ప్రాణం తీసింది
● సీసీఐ ఎదుట మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన ● న్యాయం చేయాలని కార్మికులు, కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ● యాజమాన్యం హామీతో శాంతించిన నిరసనకారులు తాండూరు రూరల్: బ్రెయి న్ స్ట్రోక్ గురై చికిత్స పొందుతున్న సీసీఐ కార్మికుడు ఆదివారం మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు, తోటికార్మికులు, కాంగ్రెస్ నాయకులు సోమవారం మృతదేహంతో ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన నిర్వహించారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం.. కరన్‌కోట్‌కు చెందిన మర్పల్లి ఖాజామియా(45) సీసీఐ ఫ్యాక్టరీ ప్యాకింగ్ ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత గురువారం రాత్రి పనికి వెళ్లగా ప్యాకింగ్ పనులకు బదులు ప్లాంట్‌లో నిలిచిన వరద నీటిని బకెట్లతో ఎత్తి బయటపోయాలని కాంట్రాక్టర్ ఆదేశించాడు. రాత్రి వేళ చల్లని గాలి వీస్తుండగా సుమారు ఆరు గంటల పాటు నీళ్లలో ఉండటంతో అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కార్మికులు అతన్ని తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం కంపెనీ అంబులెన్స్ ఇవ్వాలని కోరినా యాజమాన్యం పట్టించుకోలేదని కార్మికులు ఆరోపించారు. దీంతో ప్రైవేటు అంబులెన్స్‌లో నగరానికి తీసుకెళ్లారు. ఖాజామియా జీతం నుంచి ప్రతినెలా ఈఎస్ఐ కోసం డబ్బులు కట్ అవుతున్నా కార్డు పనిచేయలేదు. ఈఎస్ఐలో నగదు జమకావడం లేదని చెప్పడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆదివారం మృతిచెందాడు. మృతదేహంతో ఆందోళన కాంట్రాక్టర్ పని ఒత్తిడి కారణంగానే ఖాజామియా మృతిచెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహంతో వెళ్లి ఫ్యాక్టరీ గేటు ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు శరణు బసప్ప, రాజ్‌కుమార్, భరత్‌కిషోర్, అనిల్, జర్నప్ప వీరికి మద్దతు తెలిపారు. అంబులెన్స్ ఇవ్వకపోడం, ఈఎస్ఐలో నగదు జమ చేయకపోవడంపై కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. ఏఎస్ఐ పవన్‌కుమార్ సిబ్బందితో వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి అత్యవసరంగా రూ.75 వేల నగదు, రూ.7 లక్షల ఇన్సూరెన్స్‌తో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
వరుసపెట్టి.. ఆరు కార్లు ఢీకొట్టి
● ఓఆర్ఆర్పై ప్రమాదం ● ఇద్దరికి స్వల్ప గాయాలు రాజేంద్రనగర్: ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న ఓ కారు వేగం ఒక్కసారిగా నెమ్మదించడంతో వెనుక వస్తున్న మరో ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నానికి చెందిన గంగాధర్ ఆదివారం మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ మీదుగా గచ్చిబౌలి వైపు కారులో వెళ్తున్నాడు. హిమాయత్‌సాగర్ ప్రాంతంలోకి రాగానే కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు. దీంతో వెనకాలే వస్తున్న మరో ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొంటూ గంగాధర్ వాహనాన్ని ఢీకొట్టాయి. ఈ ఘటనలో మొత్తం ఆరు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. గంగాధర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్.. డబ్!
స్థానిక పోలీసులకు దడ పుట్టిస్తున్న పబ్స్ సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పబ్ కల్చర్ యువతలోనే కాదు.. ఐపీఎస్‌లు, అత్యున్నత అధికారుల్లోనూ పెరిగిపోయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు అనేక మంది యూనిఫాం తీసేసి పబ్స్‌లో వాలిపోతున్నారు. ఈ పరిణామం స్థానిక పోలీసులకు.. ప్రధానంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ అధికారులకు అవసరమైన ప్రొటోకాల్ సేవలు చేయడంతో పాటు బిల్లులు విషయంలోనూ నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు కింది స్థాయి పోలీసు వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకప్పుడు ఆదాయ మార్గాలుగా.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పని చేసే కొందరు అధికారులకు అనేక ‘ఆదాయ మార్గాలు’ ఉంటాయి. అలాంటి వాటిలో భూ వివాదాలతో పాటు వైన్‌షాపులు, బార్లు, పబ్స్ కూడా ఉంటాయి. ఈ కారణంగానే ఇవి ఎక్కువగా ఉన్న పోలీసుస్టేషన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) పోస్టింగ్ పొందడానికి ఏ స్థాయి పైరవీ చేయడానికై నా సిద్ధమవుతుంటారు. ఇటీవల కాలంలో పబ్స్ ఉన్న పోలీసుస్టేషన్ల ఎస్హెచ్ఓల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ లోని కొన్ని ఠాణాల్లో పని చేస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వీకెండ్ వచ్చిందంటే చాలు వీరికి నిద్రపట్టట్లేదు. అధికారుల తాకిడే ప్రధాన కారణం ఒకప్పుడు ఎస్హెచ్ఓలకు తన బ్యాచ్‌మేట్స్, స్నేహితులు, పరిచయస్తుల నుంచే పబ్‌లకు సంబంధించిన సిఫార్సులు వచ్చేవి. తామో, తమ సంబంధీకులో ఫలానా పబ్‌కు వెళ్తున్నారని, బిల్లులో ఎంతో కొంత తగ్గించేలా చూడాలని కోరేవారు. అలా వచ్చే వాళ్లు కూడా కొన్ని పబ్స్కే వెళ్లడానికి ఆసక్తి చూపించడం ఎస్హెచ్ఓలకు తలనొప్పిగా మారేది. కొన్నాళ్లుగా కొన్ని పబ్స్‌కు పోలీసు విభాగానికే చెందిన అత్యున్నత అధికారుల తాకిడి పెరిగింది. వీకెండ్ వచ్చిందంటే చాలా వీళ్లు తమ స్నేహితులు, సన్నిహితులతో వాలిపోతున్నారు. పబ్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు, కొందరి ఆర్కెస్ట్రాలు ఉన్నప్పుడు ఎంట్రీకి భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయాల్లోనూ తాము వస్తున్నామని, తొలి వరుసలో, ప్రత్యేకంగా సీట్లు కావాలంటూ ఆయా అధికారులు హుకుం జారీ చేస్తుండటం స్థానిక అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. తగ్గింపు కాదు పూర్తిగా ‘భరింపు’ పబ్స్‌కు వస్తున్న పోలీసు ఉన్నతాఽధికారులకు ప్రొటోకాల్ సంబంధిత మర్యాదలూ స్థానిక పోలీసులకు తప్పట్లేదు. సాధారణంగా ఆయా అధికారులు ఆలస్యంగా వస్తుంటారు. దీంతో వారిని రిసీవ్ చేసువడానికి, సపర్యలు చేయడానికి కనీసం ఓ హోంగార్డుని కేటాయించాల్సి వస్తోంది. ఇంత వరకు సర్దుకుపోతున్నా.. బిల్లుల వద్దకు వచ్చేసరికి కొందరు అధికారుల తీరు ఎస్హెచ్ఓలకు కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆయా అధికారులకు ఆ పబ్‌లో లభించే అతి ఖరీదైనవే సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన బిల్లుల్లో రాయితీ కోరితే కొంత వరకు ఇబ్బంది ఉండదు. అయితే కొందరు అధికారులు అసలు బిల్లులే చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. దీంతో పబ్స్ యజమానుల నుంచి ఒత్తిడి పెరిగడంతో ఎస్‌హెచ్‌ఓలే వాటిని చెల్లించాల్సి వస్తోంది. కొన్ని పోలీసుస్టేషన్లకు చెందిన ఎస్హెచ్ఓలు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు తమ ‘కష్టార్జితం’ ఇలాంటి చెల్లింపుల కోసం వెచ్చించాల్సి వస్తోంది. సమయం మీరినా కొనసాగింపు ఇలాంటి అత్యున్నత అధికారులు పబ్స్‌కు వచ్చినప్పుడు అతిథి మర్యాదలు, బిల్లుల చెల్లింపులతో పాటు సమయం అనేదీ ఎస్హెచ్ఓలకు ఇబ్బందికరంగా ఉంటోంది. తమ దైనందిన విధులు, ఇతర కార్యకలాపాలు ముగించుకునే ఆయా అధికారులు చాలా ఆలస్యంగా పబ్స్‌కు వస్తున్నారు. వాటి సమయం ముగిసినప్పటికీ తమ పార్టీలు పూర్తికాలేదంటూ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎస్హెచ్ఓల ద్వారా పబ్ నిర్వాహకులు, యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రధాన ద్వారాలు మూసేసి, ఇతరుల్ని పంపించేసి కొన్ని పబ్స్ నడిపించాల్సి వస్తోంది. సాధారణ సమయంలో సమయం మీరినా, పరిమితికి మించి మ్యూజిక్ పెట్టినా కేసులు నమోదు చేస్తుంటామని, అలాంటిది ఇలాంటి ఉన్నతాధికారుల కోసం తాము ఉల్లంఘనలు చేయిస్తే మరోసారి కేసులు ఎలా నమోదు చేస్తామంటూ ఎస్హెచ్ఓలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది కింది స్థాయి అధికారుల్లో హాట్‌టాపిక్‌గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అత్యున్నత అధికారుల రాకపోకలే దీనికి కారణం బిల్లుల చెల్లింపులు, ‘ప్రొటోకాల్’ తలనొప్పులు ప్రతి నెలా భారీ మొత్తం భరిస్తున్న ఎస్హెచ్ఓలు -
వర్షపాతం ఇలా.. (మిల్లీమీటర్లలో.. )
జిల్లా సాధారణం కురిసింది అధిక శాతం సాధారణం కురిసింది అధిక శాతం హైదరాబాద్ 627.2 917.9 46.0 615.4 825.5 34.0 రంగారెడ్డి 603.7 840.3 50.0 530.4 701.8 32.0 మేడ్చల్–మల్కాజిగిరి 547.7 822.3 39.0 598.6 722.2 21.0 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో భూగర్భ జలమట్టం పెరిగింది. ప్రస్తుత సీజన్లో సాధారణ వర్షపాతం కంటే 45 శాతం ఎక్కువ నమోదు కావడంతో భూగర్భజలాలు ఉబికి వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే సగటున రెండు నుంచి మూడు అడుగులు పెరిగినట్లు భూగర్భ జలాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్– మల్కాజిగిరిలో సగటున 2.64 అడుగులు, రంగారెడ్డిలో 1.94 అడుగులు, హైదరాబాద్‌లో 0.75 అడుగులు పెరిగాయి. నగరంలో సగటు భూగర్భ నీటిమట్టం 11.94 మీటర్లు కాగా మే చివరి నాటికి మరో పది అడుగుల లోతుకు పడిపోయాయి. ఈ వర్షాకాల సీజన్లో ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ.. మొదటి రెండు నెలలు సాధారణ కంటే లోటు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వర్షాలు ఊపందుకున్నాయి. వరుసగా కుండపోతగా కురిశాయి. వేసవిలో 20 మీటర్ల లోతుకు వేసవిలో భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరులోగా చాలా ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది సాధారణం కన్నా 29 శాతం అధికంగా వర్షపాతం నమోదైనా కాంక్రీట్ కట్టడాలతో ఆ వరద భూమిలోకి ఇంకే పరి స్థితి లేకపోవడం, విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కారణంగా భూగర్భజలాలు పాతాళంలోకి చేరాయి. ఎండా కాలంలో పెరుగుతున్న ఉష్టోగ్రతలకు తోడు వర్షపు నీటి సంరక్షణలో నిర్లక్ష్యం భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఓఆర్ఆర్ వరకు ఉన్న 46 మండలాల్లో 57 ఫిజో మీటర్ల ద్వారా వేసవిలో పరిస్థితిని రాష్ట్ర భూగర్భ జల శాఖ విశ్లేషించింది. ఈ పరిశీలనలో ఏటికేడు నగరంలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోతున్నట్లు గుర్తించింది. తాజాగా వర్షాకాల సీజన్లో భూగర్భ జలాల పరిస్థితి సాధా రణానికి చేరాయి. ఈసారి సీజన్లో గత ఏడాదితో పోల్చితే 16 శాతం వర్షాలు అధికంగా కురిసినట్లు వాతావరణ శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చివరి పక్షం రోజుల్లో మేఘాల విస్ఫోటంతో ఆకాశానికి చిల్లులు పడిన చందంగాకుండపోత కురిసింది. 2025 గత ఏడాది కంటే రెండు అడుగులపైనే ఈ సీజన్లో భారీగా కురిసిన వర్షాలు -
బస్సెక్కితే బాదుడే!
● ప్రయాణికులపై నెలకు రూ.15 కోట్ల అదనపు భారంసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అదనపు చార్జీల వల్ల ప్రయాణికులపై ప్రతి నెలా దాదాపు రూ.15 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం నగరంలో ప్రతి రోజు సుమారు రూ.2.5 కోట్లు టికెట్లపై నగదు రూపంలో లభిస్తుండగా, మరో రూ.4 కోట్ల వరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు అందజేసే ఉచిత ప్రయాణ సదుపాయం నుంచి రీయింబర్స్మెంట్ ఆర్టీసీ ఖాతాలో జమ అవుతున్నాయి. మొత్తంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రతిరోజూ రూ.6.5 కోట్లు లభిస్తున్నాయి. పెంచిన చార్జీలు రోజుకు రూ.50 లక్షల చొప్పున నెలకు రూ.15 కోట్ల వరకు ఆదాయం లభించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ లెక్కల ప్రకారం నగరంలో నిత్యం సుమారు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 16 లక్షలకు పైగా మహిళా ప్రయాణికులు. 9 లక్షల మంది పురుషులు ప్రయా ణిస్తున్నారు. దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు.. నగరంలోని 25 డిపోల నుంచి 3,100 బస్సులు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో 275 ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా గ్రేటర్లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హైటెన్షన్ కనెక్షన్ల కోసం రూ.8 కోట్ల వరకు ఖర్చవుతోంది. రానున్న రోజుల్లో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటును లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం టికెట్ చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ ఖర్చులే అధికం.... గ్రేటర్ ఆర్టీసీకి రోజుకు రూ.6.5 కోట్లు లభిస్తున్నప్పటికీ నిర్వహణ వ్యయం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రస్తుతం గ్రేటర్‌లోని 25 డిపోల్లో సుమారు 1,5000 మంది పని చేస్తున్నారు. వీరిలో 7,000 మంది కండక్టర్లు. 5,700 మంది డ్రైవర్లు. మిగతా వారిలో మెకానిక్‌లు, శ్రామిక్‌లు మొదలుకొని డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీకి లభించే ఆదాయంలో సుమారు 50 శాతం సిబ్బంది జీతభత్యాలకే ఖర్చవుతోంది. మరో 25 శాతం ఇంధనం కోసం వినియోగిస్తుండగా, వివిధ అవసరాల కోసం మిగతా మొత్తాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి లాభనష్టాల్లేకుండా బస్సులను నడపడమే ఆర్టీసీకి సవాల్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా పెంచిన చార్జీలతో ప్రయాణికులకు భారమే అయినా ఆర్టీసీకి మాత్రం కొంత ఊరటగా చెప్పవచ్చు. గ్రేటర్లో పెరిగిన ఆర్టీసీ చార్జీల అమలు నేటి నుంచే చార్జీల పెంపు మచ్చుకు ఇలా.. సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్, ఈ–ఆర్డినరీ, ఈ–ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5 చొప్పున పెంపు. 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు చార్జీ. మెట్రో డీలక్స్, ఈ– మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5 చొప్పున పెంచారు. రెండో స్టేజీ నుంచి రూ.10 చొప్పున పెంపు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.20 చెల్లించి ప్రయాణం చేసేవారు ఇక నుంచి రూ.30 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇప్పటి వరకు రూ.30 ఉండగా, సోమవారం నుంచి రూ.40 చొప్పున చార్జీ ఉంటుంది. అలాగే.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు రూ.25 నుంచి రూ.35 వరకు పెరగనుంది. మియాపూర్ –అమీర్‌పేట్‌ల మధ్య రూ.60 నుంచి రూ.70కి పెరగనుంది. -
అన్వేషణ!
బస్సెక్కితే బాదుడే! గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలతో ప్రయాణికులపై ప్రతి నెలా రూ.15 కోట్ల వరకు భారం పడనుంది. అభ్యర్థుల కోసంసాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయపార్టీలు అడుగులు వేస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. మెజార్టీ సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఖరారైన రిజర్వేషన్లపై ఆయా పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల నుంచి పోటీ చేయాలని భావించే వారి పేర్లను సేకరించే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. ఈ నెల 8 వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కోర్టు తీర్పు తర్వాతే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నాయి. మంత్రి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థుల చిట్టా ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సేకరించారు. క్షేత్రస్థాయి సర్వే తర్వాతే ఆయా అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ప్రజల్లో మంచి ఆదరణ ఉండి.. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలపై పెట్టనుంది. జిల్లాలో 41 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని, రెండు జెడ్పీ పీఠాలను అధిష్టించాలని భావిస్తోంది. కార్యకర్తల అభిప్రాయానికే బీజేపీ పెద్దపీట అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది. గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావహుల పేర్లను నమోదు చేసుకుని సిద్ధంగా ఉంది. కోర్టు తీర్పు తర్వాతే కార్యాచరణ ముమ్మరం చేయనుంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్త వరకు అందరి అభిప్రాయాలు సేకరిం చిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరపున బీ–ఫాం అందజేయనుంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం తక్కువే. ఆచితూచి వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంత కాలంగా ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఆయన తన నియోజకవర్గం దాటి బయటికి రావడం లేదు. దీంతో ఆయా మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతను నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు సబితారెడ్డి చూసుకోవాల్సి వస్తోంది. ఆమె ఒక వైపు తన నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. మహేశ్వరం, చేవెళ్ల నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌కు దీటుగా బలమైన అ భ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. పార్టీ రహితంగా జరిగే సర్పంచ్ ఎన్నికలకు ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీపడుతున్నారు. గ్రామ స్థాయి కార్యకర్తల అభిప్రాయం మేరకు వ్యవహరించాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు నచ్చజెప్పాలని, అయినా వినకుంటే ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నాయి. -
విషాదం మిగిల్చిన సరదా
యాలాల: దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి సరదాగా ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన యాలాల మండలం ముకు ందాపూర్తండాలో ఆదివారం చోటు చేసుకు ంది. ఎస్ఐ విఠల్‌రెడ్డి, తండావాసులు తెలిపిన వివ రాల ప్రకారం.. తండాకు చెందిన రతన్‌నాయక్, బాలిబాయి దంపతుల కొడుకు సునీల్(17) సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఎప్పటిలాగే దసరా పండుగకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. తోటి స్నేహితులతో కలిసి సరదాగా గ్రామ శివారులోని ముద్దాయి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. చెరువులో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు ఈత కొడుతుండగా మధ్యలో అలసిపోయి నీటమునిగాడు. గమనించిన మి త్రులు ఈ విషయాన్ని తండావాసులకు చెప్పడంతో చెరువులో గాలించి సునీల్ మృతదేహాన్ని వెలికి తీశారు. పండగకు వచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో నీట మునిగి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి -
నేటి ప్రజావాణి రద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. షాద్‌నగర్: దసరా సెలవులు ముగిసాయి.. పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారంతా పట్నానికి తిరుగు పయనం అయ్యారు. ఫలితంగా హైదరాబాద్ – బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు క్యూ కట్టాయి. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద బారులు తీరి కనిపించాయి. వాహనదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా టోల్‌సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. తుర్కయంజాల్: పెద్దలను వదిలి పేదలు, చిరు వ్యాపారులపై చర్యలు తీసుకోవడం దారుణమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ అన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆదివారం మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారుల గుడిసెలను తొలగించి, వారిని ఉపాధికి దూరం చేశారని ఆరోపించారు. ఏళ్లుగా రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న గుడిసెలను వేసుకుని, మధ్యాహ్న భోజనం, పండ్లను విక్రయిస్తున్నారని, అలాంటి వారికి శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని విమర్శించారు. రోజువారీ అప్పులు చెల్లిస్తూ, ఉపాధి పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం, సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఈ.నరసింహ, సీహెచ్ ఎల్లేశ్, సత్యనారాయణ, యాదయ్య, కృష్ణ, రవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కందుకూరు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండు రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ నాయకుడు అందుగుల సత్యనారాయణతో పాటు పలువురు ఆదివారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యలపై నాయకులు, కార్యకర్తలు పోరాడాలని, జిల్లాలో జాగృతి బలోపేతం కోసం కృషి చేయాలని ఆమె నేతలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు బండారి లావణ్య, కోల శ్రీనివాస్, అర్చన, సేనాపతి, బాబురావు, గణేష్ నాయక్, రవి నాయక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం నుంచి ‘ఆపరేషన్ క్లీనింగ్’ ప్రారంభించింది. ఇన్స్పెక్టర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్), మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (ఎంఈటీ) సిబ్బంది బతుకమ్మ వేడుకల అనంతరం కుంటలో వదిలిన బతుకమ్మలను బయటకు తీస్తున్నారు. పువ్వులు చెరువులో కుళ్లిపోయి, నీటి కాలుష్యానికి కారణం కాకుండా తొలగిస్తున్నారు. బతుకమ్మలను తయారుచేయడానికి పూలను పేర్చిన ట్రేలు పెద్ద సంఖ్యలో ఈ చెరువులో ఉండటంతో వాటినీ బయటకు తీస్తున్నారు. -
కాంగ్రెస్‌కు ఓటుతో గుణపాఠం చెప్పండి
వెంగళరావునగర్: ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని హైలాంకాలనీ, శ్రీకృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆయన ర్యాలీ నిర్వహించి ప్రజలను స్వయంగా కలుసుకుని కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటు వేయడమంటే మన వేలితో మనం పొడుచుకోవడమే అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను, డబ్బును నమ్ముకున్నదేగాని, ప్రజలకు చేసిన వాగ్దానాలను మరచిపోతున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు డబ్బులకో, మద్యం సీసాలకో అమ్ముడు పోవద్దని సూచించారు. రేవంత్ పంచే డబ్బులు, మద్యం సీసాలను ఎదురించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని తెలియజేశారు. గత కొన్నేళ్ళుగా ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. గోపీనాథ్ ఎలాగైతే సేవలందించారో అదే విధంగా సునీత కూడా అందిస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారని, ఆయనకు మనం నివాళులర్పించడమంటే సునీతను గెలిపించడమేనని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు 203 గురుకులాలు పెట్టి దేశంలోనే అత్యంతగా గౌరవించింది కేసీఆర్ మాత్రమేనన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మరిచారని, ప్రజలకు గ్యారంటీ కార్డులు ఇచ్చి మరచిన కాంగ్రెస్‌ను ఓడించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్‌కుమార్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
యాచారం: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. పీఎస్ పరిధిలోని మీర్ఖాన్పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. పండుగల సందర్భంగా ప్రజలు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. కొత్త వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని చెప్పారు. మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి వారికి బానిస కావద్దన్నారు. వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ వంశీ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
గుణపాఠం చెప్పండి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఉరిమింది.. మెరిసింది.. కురిసింది చేవెళ్ల: నియోజకవర్గవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిపోయాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. తంగడపల్లి, మడికట్టు వద్ద ఉన్న వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహించింది. చేవెళ్లలోని నవచైనత్య పాఠశాలపై పిడుగు పడింది. రాత్రిపూట ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. భవనం గోడకు పగుళ్లు వచ్చాయి. మరోవైపు పంటలు నీటమునిగాయి. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ వర్షం -
మద్యం మత్తులో విద్యుత్ టవరెక్కి హల్చల్
మైలార్‌దేవ్‌పల్లి/జవహర్‌నగర్: మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీకి చెందిన ఇంజమూరి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆదివారం ఉదయం ఇతను పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇంటి పక్కనే ఉన్న మల్లారెడ్డి, శిరీష అనే ఇద్దరు తనను కొట్టారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేయగా...తన ఇంటి పక్కనే ఉన్న వారికి వేణు గతంలో డబ్బులు ఇచ్చాడని, ఆ డబ్బులు ఇవ్వమని మద్యం మత్తులో వెళ్లి అడుగగా వారు అతన్ని బెదిరించి పంపించారని తేలింది. ఈ క్రమంలోనే వేణు తను అప్పుగా ఇచ్చిన రూ.1500 ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. మద్యం మత్తులో పోలీసులను కూడా ఇబ్బంది పెట్టడంతో వారు నచ్చజెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇంతలోనే వేణు బయటకు వెళ్లి తనకు న్యాయం జరగడం లేదంటూ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న 33 కేవీ హైటెన్షన్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించి కరెంటు సరఫరా నిలిపివేయించారు. అనంతరం ఘటన స్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, క్రైమ్ ఇన్స్పెక్టర్ మక్సూద్, ఎస్ఐలు పైడినాయుడు, విశ్వనాథ్‌రెడ్డి, డీఆర్ఎఫ్ బృందాలు కలిసి పైకి ఎక్కిన వేణును బుజ్జగించి కిందకి దింపారు. అతన్ని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనతో దుర్గానగర్ నుంచి చంద్రాయణ గుట్ట వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. జవహర్‌నగర్‌లో... జవహర్‌నగర్ వికలాంగుల కాలనీలోనూ ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. పోలీసులు తెల్పిన మేరకు వెంకటేష్, లక్ష్మి దంపతులు కాగా ముగ్గురు పిల్లలతో కలిసి వికలాంగుల కాలనీలో ఉంటున్నారు. వెంకటేష్ మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యను వేధింపులకు గురిచేసేవాడు. శనివారం భార్యా భర్తల మధ్య గొడవ పెద్దగా అవడంతో భార్య లక్ష్మి చేతులను విరగొట్టాడు. దీంతో లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనని కొడతారనే భయంతో విద్యుత్ టవర్ ఎక్కి చనిపోతానంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని వెంకటేష్‌ని కిందికి దించారు. అయితే వెంకటేష్ గతంలో కొన్నిసార్లు చనిపోతానంటూ ఆత్మహత్యా యత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు దిగుతుండగా కిందపడి మహిళ దుర్మరణం
సికింద్రాబాద్: లగేజీ తీసుకొని రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడి ఓ ప్రయాణికురాలు మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిఽధిలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ డేవిడ్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం. రాజస్థాన్‌కు చెందిన కమలాదేవి(45) కుటుంబసభ్యులతో కలిసి కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి అమీన్‌పూర్‌లోని బీరంగూడలో స్థిరపడ్డారు. అయితే, తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో ఇటీవల తమ స్వగ్రామమైన రాజస్థాన్‌కు వెళ్లారు. తిరిగొస్తున్న క్రమంలో ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో కమలాదేవి తన కుటుంబసభ్యులతో కలిసి రైలు దిగింది. ఒక లగేజీ బ్యాగ్ మరిచిపోవడంతో మళ్లీ రైలెక్కి బ్యాగు తీసుకొస్తుండగా రైలు కదిలింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ ఫాం నెం.2 మధ్యలో పడిపోవడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
మూసీలోకి భారీ వరద
జంట జలాశయాల పది గేట్లు ఎత్తివేతహిమాయత్సాగర్ వరదనీటిలో చేపల వేటసాక్షి, సిటీబ్యూరో/మణికొండ: మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల 10 గేట్లు 3 అడుగుల చొప్పున ఎత్తి దిగువకు సుమారు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు ప్రవాహం పెరిగింది. ఇప్పటికే రెండు రిజర్వాయర్ల పూర్తిస్థాయి నీటి మట్టం వరకు నీరు చేరడంతో ఆదివారం ఎగువ నుంచి వచ్చిన వరదను దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట) 8 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి మూసీ నదికి 2,704 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. దీంతో నార్సింగి, హైదర్షాకోట్, మంచిరేవుల నుంచి మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్‌కు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1,981 క్యూసెక్కుల నీటిని ఈసీ నదికి వదిలారు. లంగర్‌హౌస్‌లో మూసీ నదిలో కలవటంతో అక్కడి నుంచి మరింత ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. గండిపేట నుంచి 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో నార్సింగి మున్సిపల్ కేంద్రం నుంచి మంచిరేవులకు, ఔటర్ ఓ వైపు సర్వీసు రోడ్ల మీదుగా నీరు పారడంతో రాకపోకలను నిలిపివేశారు. పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే వరదను బట్టి మరిన్ని గేట్లను తెరవటం, మూయటం చేస్తామని మూసీ నది పరీవాహకంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి, రెవెన్యూ, పోలీసు అధికారులు సూచించారు. జలాశయాల నీటి విడుదలతో స్థానికులు కొందరు గాలాలతో చేపలు పడుతూ కనిపించారు. -
గెలిచేవారికే టికెట్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జెడ్పీటీసీ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలుపొందిన దాఖలాల్లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటం, సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఈ ఎన్నికలను హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు జెడ్పీ పీఠాన్ని కై వసం చేసుకుని తీరాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్ సహా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశం మేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం తన నివాసంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ కేఎల్లార్, చేవెళ్ల ఇన్చార్జ్ భీంభరత్, రాజేంద్రనగర్ ఇన్చార్జ్ నరేందర్‌తో భేటీ అయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలాలు, బలహీనతలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. భేటీకి దూరం.. రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉండగా, వీటిలో సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. మిగిలిన 21 జెడ్పీటీసీ స్థానాలు సహా వికారాబాద్ జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పార్టీ గుర్తుపై నిర్వహించే ఈ ఎలక్షన్లను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సేకరించింది. ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ ఇన్‌చార్జ్‌ల నుంచి అభ్యర్థుల పేర్లను సేకరించింది. వీరు ప్రతిపాదించిన అభ్యర్థులపై అంతర్గత సర్వే చేయించి, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సహా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా అధిష్టానానికి పలువురి పేర్లను ప్రతిపాదించారు. కానీ ఈ భేటికి మాత్రం దూరంగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన గెలుపు గుర్రాలకే టికెట్ ప్రకటించనుంది. ఆరు గ్యారంటీలే అస్త్రాలు సంస్థాగతంగా పార్టీ కేడర్ మధ్య ఎలాంటి సమన్వయ లోపం తలెత్తకుండా చూసుకోవడంతో పాటు అన్ని స్థానాల్లోనూ గెలుపొందేలా ముందుకెళ్లాలని మంత్రి శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేలకు సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సరఫరా, వంటి పథకాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, ఈ రెండేళ్లలో కాంగ్రెస్ సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి కాకుండా ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని బరిలో దింపడం ద్వారా సంస్థాగతంగా పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని, ఆదిశగా పరిశీలించాలని చెప్పినట్లు తెలిసింది. సర్వే ఆధారంగానే జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్ల సేకరణ ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ -
మగువకే మకుటం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహిళా శక్తి మరింత బలపడుతోంది. విద్య, ఉపాధి రంగాల్లోనే కాదు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లీడర్‌షిప్‌తో పాటు ఇతర అభ్యర్థుల గెలుపోటములను సైతం నిర్ణయిస్తూ.. పురుషులకు ఏమాత్రం తీసిపోబోమని నిరూపిస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లలోనూ అతివలకు పెద్దపీట వేశారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత జెడ్పీ పీఠం ఎస్సీకి రిజర్వ్ కాగా.. తొలిసారిగా మహిళా అభ్యర్థి(ఎస్సీ) చైర్‌పర్సన్‌గా ఆసీనులు కానున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఇక జిల్లా వ్యాప్తంగా 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో తొమ్మిది సీట్లను, 230 ఎంపీటీసీ స్థానాలకు గానూ 94 సీట్లను మహిళలకే కేటాయించారు. మరోవైపు తొమ్మిది ఎంపీపీ స్థానాల్లోనూ వీరే కొలువుదీరనున్నారు. ఇక 526 సర్పంచ్ స్థానాలు,4,668 వార్డులు ఉండగా.. 45శాతం స్థానాలను మగువలే దక్కించుకోనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వీరి సంఖ్య కొంత తగ్గినప్పటికీ.. మెజార్టీ స్థానాల్లోనూ కీలకం కాబోతున్నారు. ఆత్మీయ పలకరింపులు.. స్వయంగా పోటీలో నిలబడటంలోనే కాదు ఇతర అభ్యర్థుల గెలుపు ఓటముల్లోనే మహిళల ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. మహిళలు మాత్రమే అభ్యర్థుల తలరాతలను మార్చగలరు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల పరిధిలోని 526 పంచాయతీల్లో మొత్తం 7,94,653 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,99,404 మంది పురుషులు ఉన్నారు. ఇక మహిళలు 3,95,216 మంది ఉండగా.. ఇతరులు 33 మంది ఉన్నారు. బరిలో ఉన్న తోటి మహిళల గెలుపులోనే కాదు.. ఓటమిలోనే వీరే ఓట్లే కీలకం కాబోతున్నారు. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటికే వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. గతంలో మచ్చుకైనా మాట్లాడని పురుష నాయకులు ప్రస్తుతం.. అక్కా, అత్తా, అత్తా, అమ్మా.. అమ్మమ్మా అంటూ కొత్త వరసలు కలుపుతున్నారు. ఆత్మీయంగా పలకరిస్తూ మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వీరు ఎవరిని ఆశీర్వదిస్తారో.. తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారి దక్కనున్న అవకాశం తొమ్మిది మంది జెడ్పీటీసీలు, తొమ్మిది మంది ఎంపీపీలు కూడా వారే 94 ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలూ కేటాయింపు -
ఎఫ్‌సీడీఏలో లేనట్లేనా?
యాచారం: మండల పరిధిలోని తమ నాలుగు గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) పరిధిలో కలపాలంటూ చేస్తున్న ప్రజల అభ్యర్థనలు కార్యరూపం దాల్చడం లేదు. ఎఫ్‌సీడీఏలోకి వచ్చే 56 రెవెన్యూ గ్రామాల మ్యాప్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి మీర్ఖాన్పేట సమీపంలో అథారిటీ భవనానికి భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల పరిధిని ఎఫ్‌సీడీఏలోకి తీసుకుని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఫోర్త్ సిటీని నిర్మించాలని రేవంత్‌రెడ్డి సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది. ఎఫ్‌సీడీఏ పరిధిలోకి తీసుకునే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్, మహేశ్వరం మండలాల్లో అత్యధికంగా యాచారం మండలంలోనే 17 రెవెన్యూ గ్రామాలను తీసుకున్నారు. యాచారంలో మొత్తం 21 రెవెన్యూ గ్రామాలు ఉండగా, కేవలం నాలుగింటిని వదిలేశారు. ఎఫ్‌సీడీఏ ఏర్పాటైన మార్చి నెలలోనే యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, సూల్తాన్‌పూర్ ప్రజలు తమ గ్రామాలను సైతం అథారిటీలో కలపాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. యాచారం పక్కనే మొండిగౌరెల్లి.. యాచారం మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మొండిగౌరెల్లిని వదిలేసి, ఆతర్వాత వచ్చే చింతపట్ల, నల్లవెల్లిని ఎఫ్‌సీడీఏలో కలిపారు. నల్లవెల్లిని అనుకుని ఉన్న మంతన్‌గౌరెల్లి, మంతన్‌గౌడ్, సూల్తాన్‌పూర్‌ను వదిలేశారు. మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లిలో పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, కానీ మంతన్‌గౌడ్, సూల్తాన్పూర్లు వ్యవసాయ భూముల రికార్డుల పరంగా రెవెన్యూ గ్రామాలైనప్పటికీ ప్రత్యేక జీపీలు లేవు. ఫలితం శూన్యం మండలంలోని మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, మంతన్‌గౌడ్, సూల్తాన్‌పూర్‌ను కూడా ఎఫ్‌సీడీఏలోకి తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి నుంచి మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం కనిపించడం లేదు. నేతలు, అధికారులు సానుకూలంగా హామీ ఇచ్చినప్పటికీ అమలులో కార్యరూపం దాల్చడం లేదు. తాజాగా సర్కార్ ఎఫ్‌సీడీఏ అధికారిక మ్యాప్‌ను ప్రకటించడంతో మళ్లీ వీరిలో ఆందోళన నెలకొంది. తమ నాలుగు రెవెన్యూ గ్రామాలను అటు నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలో కలుపుతారా.. లేక యాచారం మండలం పక్కనే ఉన్న మంచాల మండలంలో కలుపుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నాలుగు గ్రామాలపై ఎటూ తేల్చని వైనం ప్రజల అభ్యర్థనలపై స్పష్టత ఇవ్వని నేతలు, అధికారులు ఎఫ్‌సీడీఏ మ్యాప్ విడుదలతో మరింత ఆందోళనమొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి ప్రజలు తమ గ్రామాలను ఎఫ్‌సీడీఏలోకి కలపాలని కోరుతున్నారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు లేఖ రాశా. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. – మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం యాచారానికి కూత వేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లిని ఎఫ్‌సీడీఏలో కలెక్టర్, ఎమ్మెల్యేను కలిసి విన్నవించాం. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్‌లో కూడా మా గ్రామాన్ని చేర్చలేదు. – తాండ్ర రవీందర్, మొండిగౌరెల్లి -
సమన్వయంగా ఎన్నికల నిర్వహణ
షాద్‌నగర్ రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీడీఓ బన్సీలాల్ అన్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్, రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తహసీల్దార్ నాగయ్య మాట్లాడుతూ.. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. పట్టణ సీఐ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణి రద్దు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్యక్రమం ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. అర్జీలతో ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. అఖిల్ యాదవ్‌కు ఉచిత మెడికల్ సీటు కొడంగల్: పట్టణానికి చెందిన అఖిల్ యాద వ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఏ కేటగిరీ జన రల్ కోటాలో ఉచితంగా మెడికల్ సీటు సాధించాడు. శనివారం కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నట్లు అఖిల్ యాదవ్ తండ్రి ఏవీ పృథ్వి రాజ్ తెలిపారు. నీట్లో ర్యాంక్ రావడంతో ఎంబీబీఎస్ సీటు ఉచితంగా వచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో 469 మార్కులు రావడంతో కాళోజీ నారాయణరావ్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ సీటు కేటాయించింది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్లో సీటు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ యాదవ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పృథ్విరాజ్, అనంతలక్ష్మి ప్రోత్సాహంతో సీటు సాధించినట్లు చెప్పారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలో స్థిరపడి రోగులకు సేవ చేయనున్నట్లు తెలిపారు. రూ.లక్ష పలికిన చీరలు దుద్యాల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ధరించిన చీరలకు శనివారం వేలం నిర్వహించారు. మండలంలోని హస్నాబాద్‌లో మూడు చోట్ల అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అక్కడ చీరలకు వేలం నిర్వహించారు. గౌడ్స్ కాలనీలో బాలగౌడ్ రూ.1.15 లక్షలకు దుర్గమ్మ చీరను సొంతం చేసుకున్నారు. గాంధీ చౌక్‌లో గోపాల్ ఆనంద్ రూ.1.17 లక్షలకు, వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద బీ సందప్ప రూ.95 వేలకు అమ్మవారి చీరను దక్కించుకున్నారు. టెంట్ హౌస్ దగ్ధం తాండూరు టౌన్: ప్రమాదవశాత్తు ఓ టెంట్ హౌస్ దుకాణం అగ్నికి ఆహుతైంది. షాపులోని సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన శనివారం తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నసీర్ అనే వ్యక్తి ఓ షెట్టర్లో ఎంఎస్ టెంట్ హౌస్ నిర్వహిస్తున్నాడు. షెట్టర్ నుంచి దట్టమైన పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే దుకాణంలోని సామగ్రి కాలిపోయింది. పక్కనే ఉన్న ఆటోమొబైల్ షాపు, వెల్డింగ్ షాపులకు కూడా నిప్పంటుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉంటారని, దీనిపై విచారణ జరపాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంతో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు యజమాని నసీర్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
జంట జలాశయాలకు వరద
వాతావరణం శాఖఆరెంజ్ అలెర్ట్ జారీ ● అప్రమత్తమైన జలమండలి సాక్షి, సిటీబ్యూరో: జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తు న్న భారీ వర్షాలు, నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేతతో వరద ప్రవాహం పెరిగింది. మరో వైపు వాతావరణం శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా జలమండలి అప్రమత్తమైంది. జంట జలాశయాలకు చేరుతున్న నీటిని వచ్చినట్టే దిగువన మూసీలోకి వదులుతున్నారు. శనివారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. వాతావరణం శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో రెవెన్యూ, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు జంట జలాశయాలు ఇలా.. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం: 1790.00 అడుగులు (3.900 టీఎంసీలు) ప్రస్తుత మట్టం: 1789.35 అడుగులు (3.751టీఎంసీలు) ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద : 600 క్యూసెక్కులు దిగువకు వదులుతున్న వరద: 2652 క్యూసెక్కులు గేట్లు ఎత్తివేత: 4 అడుగుల ఎత్తుకు 6 గేట్లు హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం: 1763.50 అడుగులు (2.970 టీఎంసీలు) ప్రస్తుత మట్టం: 1762.95 (2.780 టీఎంసీలు) ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద: 400 క్యూసెక్కులు దిగువకు వదులుతున్న వరద : 1981 క్యూసెక్స్ గేట్లు ఎత్తివేత: 3 అడుగుల ఎత్తుకు 2 గేట్లు -
వేడుక ముగిసే.. వ్యర్థాలు మిగిలే
వేడుక ముగిసె.. వ్యర్థాలు మిగిలే తుర్కయంజాల్: వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. గణనాథుడి నిమజ్జన క్రతువు అట్టహాసంగా జరిగింది. నెలరోజులు గడిచింది. కానీ చెరువు వద్ద సేకరించి, కట్టకింద డంప్ చేసిన వ్యర్థాలు మాత్రం అలాగే ఉన్నాయి. కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. అయినా సంబంధిత అధికారులు చెత్త తొలగింపును విస్మరించారు. నేటికీ చెత్తాచెదారం తొలగించేందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు వేల విగ్రహాలు.. పురపాలక సంఘం పరిధి మాసబ్ చెరువులో గణనాథుల నిమజ్జన ప్రక్రియను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఉన్నతాధికారులు మెప్పు పొందారు. కాగా.. సుమారు నాలుగు వేలకు పైగా ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరాయి. ఆయా విగ్రహాలతో పాటు.. పూలు, పండ్లు, ఆకులు తదితర పూజా సామగ్రిని సైతం భక్తులు తెస్తుంటారు. అలా తెచ్చిన వాటిని సిబ్బంది సేకరించారు. అనంతరం వాటిని దూర ప్రాంతాలకు తరలించాల్సిన అధికారులు.. చెరువుకు రెండు వందల మీటర్ల దూరన డంప్ చేయించారు. నెలరోజులైనా ఆ వ్యర్థాలను అక్కడి నుంచి తీయకపోవడంతో సమీప కమ్మగూడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెలువడుతున్న దుర్వాసనతో ఇంట్లో ఉండలేక పోతున్నామని వాపోతున్నారు. డంపింగ్ యార్డ్‌లా.. నిమజ్జన సమయంలో 24 గంటల పాటు శానిటేషన్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఆ సమయంలో బిజీగా ఉండటం, సిబ్బంది కొరతతో తడి, పొడి చెత్తను వేరుచేయకుండా ఒకే చోట డంప్ చేశారు. ఆ తరువాత అయినా దానిని వేరు చేయాలనే ఆలోచనను మరిచారు. ఆ తరువాత వరుసగా భారీ వర్షాలు కురవడంతో.. ఆ చెత్త పెద్ద సమస్యగా మారింది. గతంలో నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు ఇక్కడ డంప్ చేసి, ఆ తరువాత ఇతరప్రాంతాలకు తరలించేవారు. కానీ ఈ సారి అలాగే వదిలేయడంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. ఇదిలా ఉండగా.. చెత్త తొలగించకపోవడంతో ఈ ప్రాంతం పందులకు ఆవాసంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. అపరిశుభ్రత వాతావరణం వలన దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. దీని కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు స్పందించి, నిమజ్జన వ్యర్థాలను వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెరువు కట్ట కింద చెత్త డంప్ నెలరోజులైనా తొలగించని వైనం దుర్వాసన, దోమలతోస్థానికుల ఇబ్బంది పట్టించుకోని అధికార యంత్రాంగం తొలగిస్తాం.. సిబ్బంది కొరతతో చెత్త తరలింపు ఆలస్యం అయింది. వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, వ్యర్థాలను తరలించే ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. – వనిత, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపాలిటీ -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
దుద్యాల్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ యాదగిరి హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలపై, కులమతాల పేరిట దుష్ప్రచారం చేసినా, అవమానకరమైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టె ప్రసంగాలు చేయొద్దని సూచించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు కథనాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయా వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడినా, ప్రసారాలు చేసినా అన్నీ ఎన్నికల నేరం కింద పరిగనింపబడుతాయని ఎస్ఐ వివరించారు. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా ప్రజలకు ఇచ్చే సూచనలు .. ● ఇతర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో తమ వెంట రూ. 50,000లకు మించి నగదు ఉండొద్దు. ● ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం పంపిణీ చేసినా, తమ దగ్గర ఉన్నా నేరమే. ● ఓటు కోసం రాజకీయ పార్టీల నుంచి, పోటీ దారుల నుంచి ఎటువంటి బహుమతులు, నగదు, వస్తువు రూపేణ తీసుకోవడం నిషేధమే. ● ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అందరు ప్రభుత్వానికి సహకరించాలి. ● లంచం, బెదిరింపులు, డబ్బు లేదా మద్యం పంపిణీ, కులమత భేదాల ఆధారంగా ప్రచారంచేయడం వంటివి చేయొద్దు. పై విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ యాదగిరి హెచ్చరించారు.ఎస్ఐ యాదగిరి -
గంజాయి విక్రేతల అరెస్టు
8.400 కిలోల గాంజా స్వాధీనం యాచారం: ఇద్దరు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8.400 కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారి గునుగల్ గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాకుచెందిన బలరామ్ కోబాసి, ఉంగా పడియామిలు ఇద్దరు.. హైదరాబాద్‌కు చెందిన నిరజ్‌కుమార్ యాదవ్‌కు రూ.80 వేలకు విక్రయించడానికిగంజాయిని తీసుకువచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం గునుగల్ గేట్ వద్ద అనుమానాస్పదంగాసంచరిస్తున్న వీరిని.. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లను తనిఖీ చేయగా.. గంజాయి పట్టుబడింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ఒడిశా అటవీ ప్రాంతంలో పండించిన గాంజాను తెచ్చి, నగరంలో విక్రయిస్తుంటామని ఒప్పుకొన్నారు. వీరిద్దరిని శనివారం రిమాండ్‌కు తరలించామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. -
మరపురాని నేత ఇంద్రారెడ్డి
చేవెళ్ల: మరపురాని మహానేత, ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఇంద్రారెడ్డి అని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. హోశాఖ మాజీ మంత్రి ఇంద్రారెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం మండల పరిధి కౌకుంట్లలో ఆయన సమాధి వద్ద కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌసిక్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇంద్రారెడ్డి జ్ఞాపకాలు, ఆశయాలు మరపురానివని పేర్కొన్నారు. నిరంతరం ఆయన ప్రజలకోసం తపించారని, వారి ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం పనిచేస్తుందని తెలిపారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మమేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.బాలరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు పి.ప్రభాకర్, కరుణాకర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దర్శన్, రాజు, మానిక్యరెడ్డి, మాదవ్గౌడ్, కరుణాకర్‌రెడ్డి, నర్సింహులు, కృష్ణ, మల్లారెడ్డి, గోపాలకృష్ణ, అంజయ్య, శేఖర్, ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే సబితారెడ్డి