ప్రమాదం జరగకముందే స్పందించండి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం జరగకముందే స్పందించండి

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

ప్రమాదం జరగకముందే స్పందించండి

ప్రమాదం జరగకముందే స్పందించండి

షాద్‌నగర్‌రూరల్‌: పట్టణంలోని చౌరస్తాలో రోడ్డు ప్రమాదాల బారినపడి మృతి చెందిన వారికి శనివారం ప్రజా సంఘాలు, బీసీసేన ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ముఖ్యకూడలిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. షాద్‌నగర్‌ మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయని.. పట్టణంలోని ముఖ్యకూడలి ఇరుకుగా ఉండటంతో ద్విచక్రవాహనదారులు భారీ వాహనాల చక్రాల కింద పడి మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. ముఖ్యకూడలిలో ఇప్పటి వరకు 62 మంది మృతి చెందగా 103 మంది గాయాలపాలయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికే వారి కుటుంబాలకు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయని మరో ప్రమాదం జరగకముందే ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎన్‌.రాము, చంద్రశేఖరప్ప, వెంకటేష్‌, స్రవంతిరాజ్‌, నర్సింలు, రాములు, రవికుమార్‌గౌడ్‌, టీజీ.శ్రీనివాస్‌, అర్జునప్ప, రవీంద్రనాఽథ్‌, తిరుమలయ్య, నర్సింలు, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement