ఉదయాన్నే ప్లైన్‌ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా? | Celebrity fitness trainer urges to stop having plain dosa in morning | Sakshi
Sakshi News home page

ఉదయాన్నే ప్లైన్‌ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా?

Apr 15 2026 2:49 PM | Updated on Apr 15 2026 4:31 PM

Celebrity fitness trainer urges to stop having plain dosa in morning

ఉదయం అల్పాహారం  అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ, దోసె.  మీకు కూడా  దోసె తినడం ఇష్టమా? అయితే, ఒక ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్  కీలక హెచ్చరిక చేస్తున్నారు మార్నింగ్‌ ప్లైన్ దోసె (Plain Dosa) తినడం మానేయమని ప్రజలను కోరుతున్నారు. అయితే దోసె అనారోగ్యకరమైందా? ఎలా తినాలి?  తెలుసుకుందాం.

ప్రధానంగా దక్షిణ భారతదేశంలో   దోసె అనేది ఒక  ఎమోషన్‌. రోజులో ఏ సమయంలోనైనా తినగలిగే తేలికైన, పోషకమైన టిఫిన్‌ అనుకుంటాం. కొందరు ఉపవాసాల సమయంలో, మరికొందరు బరువు తగ్గించుకునే  డైట్‌లో కూడా దీన్ని చేర్చుకుంటారు. అయితే ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్ దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. బరువు తగ్గాలనుకుంటే అల్పాహారంలో దోసె తినడం మానుకోవాలని ఇటీవల ఒక వీడియోలు పేర్కొన్నారు. విచిత్రంగా అనిపిస్తోందా? దీనికి గల కారణాలను కూడా ఆయన విశ్లేషించారు.

దోశలో స్వతహాగా అనారోగ్యకరమైనదేమీ లేదు.. అది కేవలం బియ్యం, మినపపప్పును పులియబెట్టి తయారు చేస్తారు. సాంబార్ కూడా ఒక పప్పు పదార్థమే కాబట్టి దానిలో అరోగ్యకరమే .అసలు సమస్య అది కడుపు నింపే గుణం విషయంలోనే ఉందని సింగ్ వెల్లడించారు.

దోసె సులభంగా జీర్ణమైనప్పటికీ, గంటలోపే  ఆకలి వేస్తుంది. ఆకలి ఎక్కువ కావడంతో అదనపు కేలరీలను తీసుకుంటాం అని సింగ్‌ చెప్పారు. దాన్నే ‘హై గ్లైసెమిక్ రెస్పాన్స్’ అంటారు. దోసె తిన్న వెంటనే,  రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతుంది. వెంటనే ఆకలి వేయడానికి కారణం ఇదేనట. మితంగా తినాలి. వెంటనే దోసెకు చెక్‌  పెడదాం అనుకుంటున్నారా. ఆగండాగండి. ఈ సెలబ్రిటీ ట్రైనర్ దగ్గర ఒక పరిష్కారం ఉంది. కడుపు నిండింది అనే ఫీలింగ్‌ రావడానికి దోసె లోపల రుచికరమైన ఫిల్లింగ్‌ను జోడించుకోమని సూచిస్తున్నారు. అంటే తురిమిన పనీర్‌ దట్టించిన దోసె కానీ,  మసాలా   దోసె గాని తీనమని సలహా ఇచ్చారు.

 

మరి దోసె ఆరోగ్యకరమైందేనా? 
ఆరోగ్యకరమైందే.  కానీ మితంగా తినాలి. పులియబెడతాం కాబట్టి, కడుపుకు తేలికగా ఉంటుంది, శక్తి కోసం కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. అధిక కేలరీలు గల చట్నీలకు బదులుగా సాంబార్ వంటి ఆరోగ్యకరమైన సైడ్ డిష్‌లతో కలిపి తీసుకుంటే మంచిది. మినప పప్పు  కలుస్తుంది కాబట్టి  కొంత ప్రోటీన్ ఉంటుంది. దీంతోపాటు సాంబార్‌తో కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఇంకా పెరుగుతుంది. పులియబెట్టడం ఇతర అల్పాహారాలతో పోలిస్తే దోస సులభంగా జీర్ణమవుతుంది.  మరీ సాదా దోసెలాగా కాకుండా పనీర్‌, కార్న్‌, మసాలా మష్రూమ్‌ లాంటివి యాడ్‌ చేసుకుంటే కడుపూ నిండుతుంది. ఎక్కువ సేపు ఆకలీ వేయదు. 

Advertisement
 
Advertisement
Advertisement