వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం? | Vaibhav Sooryavanshi To Be Punished For Romi Bhinders Act? | Sakshi
Sakshi News home page

BCCI: వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం?

Apr 13 2026 4:05 PM | Updated on Apr 13 2026 4:51 PM

Vaibhav Sooryavanshi To Be Punished For Romi Bhinders Act?

రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ ఫోన్‌లో వాడడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. రోమీ భిందర్ ఐపీఎల్ యాంటీ కరప్షన్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు కూడా వినిపిస్తుడడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది. "మేనేజర్‌గా రోమీ భిందర్ ఫోన్ తీసుకెళ్లవచ్చు. కానీ దానిని డగౌట్‌లో వాడకూడదు. వీడియో ఫుటేజీని, చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం" అని  బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఇప్పటికే రోమీ భిందర్ బీసీసీఐ అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఏమి జరిగిదంటే?
ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ డగౌట్‌లో  రోమీ భిందర్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాల కంట పడ్డాడు. అతడే పక్కన కూర్చున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ స్క్రీన్ చూస్తూ కన్పించాడు. ఇందుకు సబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై  ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ కూడా తీవ్రంగా స్పందించాడు.

దీంతో ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అంతర్గత విచారణ జరపనుంది. కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్‌ ఫోన్లు వాడటం నిషిద్ధం. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో మేనేజర్ ఫోన్ ఉపయోగించవచ్చు.

వైభవ్‌పై వేటు!
కాగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే భిందర్‌పై జరిమానా లేదా నిషేధం పడే అవకాశం ఉంది. అలాగే ప‌క్క‌న ఉండి ఫోన్ చూసిన వైభ‌వ్ సూర్య‌వంశీపై  కూడా బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకునే ఛాన్స్ ఉంది. అత‌డిపై జ‌రిమానా లేదా ఓ మ్యాచ్ నిషేధం విధించే అవ‌కాశ‌ముందని క్రికెట్ నిపుణ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement