'అచ్చం చిన్ని కృష్ణుడిలానే'..! | Adorable baby's video goes viral, just looks like little Krishna | Sakshi
Sakshi News home page

'అచ్చం చిన్ని కృష్ణుడిలానే'..!

Apr 15 2026 2:37 PM | Updated on Apr 15 2026 2:41 PM

Adorable baby's video goes viral, just looks like little Krishna

పసిపిల్లలు సహజంగానే ముద్దుగా అనిపిస్తారు. వారి అమాయకపు మోము ఎవ్వరినైనా.. ఇట్టే కట్టిపడేస్తుంది. కొందరు చిన్నారులను చూడంగానే ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంటుంది కూడా. కానీ ఈ చిన్నారిని చూడగానే వాసుదేవ నందనుడు, ఆ నందగోపాలుడే గుర్తుకొస్తాడు. చిన్ని కృష్టుడిలా ముద్దుగా ఆకర్షిస్తున్న ఈ చిన్నారిని చూసి ఎవ్వరూ కళ్లు తిప్పుకోలేరు. 

అంత అందంగా ముగ్ధమనోహరంగా ఉందా ఆ పాపాయి. ఆ జగన్నాథుడే మళ్లీ ఈ భువిపై ఇలా చిన్ని కృష్ణుడిలా అవతరించాడా అన్నంతగా అందంగా ఉంది ఆ చిన్నారి. ఆ చిన్నారి చిరునవ్వు నుంచి ఆడుకుంటున్న విధానం అన్ని చూస్తే..ఒక్కసారిగా మన కళ్లముందు శ్రీకృష్ణుడి బాల్య జ్ఞాపకాలు కదలాడతాయి. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనికి “అచ్చం చిన్ని కృష్ణుడిలాగే ఉన్నాడు!” అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. అంతేగాదు ఈ వీడియోకి వేలల్లో లైక్‌లు, వ్యూస్‌ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి మరి..!.

 

(చదవండి: చలువ చేసే మారేడు పానకం..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement