పిల్లలు 20 అడుగుల భారీ కొండచిలువ (Python)పై జారుడు బండ ఆడుకుంటున్న వీడియె నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వింత ఘటన ఇండోనేషియాకి చెందినదిగా భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దిగ్భ్రాంతికరమైన ప్రకారం సజీవంగా ఉన్న ఒక పెద్ద కొండచిలువపైకి ఎక్కి దానిపై నుంచి జారుతూ ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతేకాదు పిల్లలు అంత ప్రమాదకరమైన జీవితో ఆడుకుంటున్నా, అక్కడ ఉన్న పెద్దలు వారిని వారించకపోగా తమ స్మార్ట్‌ఫోన్లలో వీడియోలు తీస్తూ శాంతంగా చూస్తుండిపోవడం కొంతమంది బనెటిజనులను ఆశ్చర్యపరిచింది.
నెటిజన్ల స్పందన
అయితే ఇండోనేషియాలో అవి చాలా చౌకగా దొరుకుతాయనీ, వాటి లివర్ నూనె కోసం వేటాడతారని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. 90వ దశకంలో 5 అడుగుల పిల్ల పాము ధర సుమారు 5 డాలర్లు అని కూడా చెప్పారు. వీటిని రెటిక్యులేటెడ్ కొండచిలువ (Reticulated Python) అంటారట. ఇవి విషపూరితమైనవి కావు, కానీ ఇవి తమ బలమైన కండరాల శక్తితో ఎరను చుట్టి నలిపి మింగేయగలవు. కానీ అడవిలో ఉండేవి చాలా దూకుడుగా ఉంటాయి మరియు బెదిరిస్తే వెంటనే కాటు వేస్తాయి.ఈ వీడియో దాదాపు 1,60,000 కంటే ఎక్కువ మందికి చేరింది.
పిల్లలు ఇళ్లల్లో ఫోన్లకు అతుక్కుపోకుండా బయట ఆడుకుంటున్నారని ఒకరంటే, ఇండోనేషియాలో ఇవి సాధారణం, క్రమం తప్పకుండా మానవ స్పర్శకు అలవాటు పడినవి లేదా ఆహారం తిన్న తర్వాత ఉండే పాములు చాలా శాంతంగా ఉంటాయని మరికొందరు పేర్కొన్నారు.
వన్యప్రాణి ప్రేమికుల ఆందోళన: సాధారణ ప్రజలు దీనిని సరదాగా తీసుకున్నప్పటికీ, వన్యప్రాణి నిపుణులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండించారు. క్రూరమైన, ఎలాంటి శిక్షణ లేని వన్యప్రాణులతో పిల్లలు ఇలా ఆటలాడుకోవడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.


