Netherlands: బెలూన్లకు గురి.. మహిళ కంటికి చిల్లు! | Woman accidentally shoots another woman with air rifle at Netherlands fair | Sakshi
Sakshi News home page

Netherlands: బెలూన్లకు గురి.. మహిళ కంటికి చిల్లు!

Nov 11 2026 8:13 AM | Updated on Nov 11 2026 8:16 AM

Woman accidentally shoots another woman with air rifle at Netherlands fair

ఆమ్‌స్టర్‌డామ్‌: నెదర్లాండ్స్‌లో జరిగిన ఓ ఫెస్టివల్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. బెలూన్లను పేల్చేందుకు ఎయిర్ రైఫిల్‌తో కాల్పులు జరిపిన ఓ మహిళ పొరపాటున అక్కడ పనిచేస్తున్న మరో మహిళపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో బాధితురాలు ఒక కంటిచూపును శాశ్వతంగా కోల్పోయినట్లు తెలుస్తున్నది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ జాతరలోని షూటింగ్ స్టాల్ వద్ద ఎయిర్ రైఫిల్ పట్టుకుని కనిపించింది. బెలూన్లను లక్ష్యంగా చేసుకుని కాల్చాల్సిన ఆమె, అనుకోకుండా కౌంటర్ వద్ద ఉన్న మహిళా ఉద్యోగి వైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కింది. ఈ క్రమంలో తుపాకీ నుంచి వెలువడిన లోహపు గుళిక ఉద్యోగి కంటికి తగిలింది. దీంతో ఆమె కౌంటర్ వెనుక కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ఒక కంటిచూపును శాశ్వతంగా కోల్పోయింది.
 

వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిపే ముందు వేచి ఉండాలన్న భద్రతా సూచనలను ఎందుకు పట్టించుకోలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గాయపడిన మహిళకు వెంటనే సహాయం అందించేందుకు అక్కడున్నవారు ఎందుకు ముందుకు రాలేదని కూడా పలువురు నిలదీస్తున్నారు. మరోవైపు షూటింగ్ స్టాళ్లలో భద్రతా ప్రమాణాలపైనా చర్చ మొదలైంది. ఎయిర్ రైఫిళ్లతో కాల్పులు జరిపే సమయంలో ఉద్యోగులు, సందర్శకులు ప్రమాదానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది సూచించారు.

ఇదీ చదవండి: ట్రంప్‌కు బిగ్ షాక్.. చేతులు మారిన రిపబ్లికన్ పగ్గాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement