ఒక స్కూలులో దశాబ్దాల పాటు స్వీపర్‌గా చేసిన మహిళ అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో 39 ఏళ్ల పాటు స్కూల్ ఆయాగా సేవలుందించిన ఒక మహిళ గౌరవార్థం, ఏకంగా ఒక పాఠశాలకే ఆమె పేరును నామకరణం చేయడం విశేషంగా నిలుస్తోంది.
టెక్సాస్‌లోని ఓబ్రీ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (Aubrey ISD), 39 సంవత్సరాల పాటు స్కూలులో (custodian) పని చేసిన 76 ఏళ్ల మరిలిన్ హాంప్టన్ (Marilyn Hampton) గౌరవార్థం కొత్త ప్రాథమిక పాఠశాలకు "మరిలిన్ హాంప్టన్ ఎలిమెంటరీ స్కూల్" (Marilyn Hampton Elementary School) అని పేరు పెట్టింది. 1983 నుండి 2022 వరకు దాదాపు 39 ఏళ్ల పాటు పనిచేశారు. హాంప్టన్ తన విధుల్లో భాగమైన స్కూల్ పరిశుభ్రతతో పాటు, విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకు అవసరమైన పెన్నులు, పుస్తకాలు, భోజనం కోసం డబ్బులు ఇవ్వడం, హోమ్‌వర్క్‌లో సహాయం చేయడం, వారి చిన్న చిన్న తగాదాలను తీర్చడం వంటి పనులు చేసేవారు. అందుకే ఆమెను అంతా ప్రేమగా "స్కూల్ హెల్పర్" అని పిలుచుకునేవారు.
For nearly 40 years, Marilyn Hampton went above and beyond to help students in Texas. Now, the retired school janitor is getting a lasting tribute: a new elementary school named in her honor. https://t.co/8YUQ49KF77
— CBS Evening News with Tony Dokoupil (@CBSEveningNews) November 10, 2026
ఒక సాధారణ స్కూల్ బోర్డ్ మీటింగ్ అనుకుని వచ్చిన హాంప్టన్ ముందు 'మెరిలిన్ హాంప్టన్ ఎలిమెంటరీ స్కూల్' అని ఉన్న రెడ్ కార్పెట్‌ను ఆవిష్కరించమని అడగడంతో భావోద్వేగానికి లోనయ్యారు. కొత్త స్కూల్‌కు ఆమె పేరు పెట్టాలని బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ఇదీ చదవండి: అరుణా రాయ్ భర్త, బంకర్ రాయ్ కన్నుమూత
"సాధారణంగా ఆయాల పేర్లు స్కూళ్లకు పెట్టరు. అలాంటి వారిని ఎవరూ పట్టించుకోరు. కానీ నా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది" అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చిన్నతనంలో తను కూడా తీవ్ర పేదరికం అనుభవించడం వల్లే పిల్లలకు సహాయం చేయడానికి ముందుండేదాన్నని ఆమె తెలిపారు. ఈ కొత్త పాఠశాల వచ్చే ఏడాది ఆగస్టులో టెక్సాస్‌లోని ఓబ్రీలో ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు


