క్లబ్‌లో మభ్యపెట్టి..హోటల్‌లో అత్యాచారం | Rajasthani woman Incident | Sakshi
Sakshi News home page

క్లబ్‌లో మభ్యపెట్టి..హోటల్‌లో అత్యాచారం

Nov 6 2026 12:51 PM | Updated on Nov 6 2026 12:58 PM

Rajasthani woman Incident

బొమ్మనహళ్లి: బెంగళూరు టూర్‌కు వచ్చిన రాజస్థానీ యువతి (26)పై అత్యాచారం  జరిగిందని మడివాళ ఠాణాలో కేసు నమోదైంది.  ఫిర్యాదు మేరకు వివరాలు.. జైపూర్‌ నగరానికి చెందిన యువతి అక్టోబర్‌ 4న పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చింది. ఆమె హోసూరు రోడ్‌లోని ఒక హోటల్‌ గదిలో బస చేసింది. 

ఆ తర్వాత, ఆమె కమ్మనహళ్లిలోని స్నేహితురాలి ఇంట్లో 10 రోజులు ఉండి, తిరిగి అదే హోటల్‌కు వచ్చింది. గత నెల 24న కోరమంగళలోని ఒక క్లబ్‌కు వెళ్లగా సమీర్‌ (26) అనే యువకుడు ఆమెకు సిగరెట్‌ అంటించుకోవడానికి లైటర్‌ ఇచ్చి పరిచయం చేసుకున్నాడు. 

ఆ తర్వాత, ఇద్దరూ కలిసి మద్యం తాగి మొబైల్‌ నంబర్లు మార్చుకున్నారు. నిందితుడు ఆ యువతిని ప్రలోభపెట్టి మరో హోటల్‌లో గదిని బుక్‌ చేసి తీసుకెళ్లాడు. ఆమె మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆమె 28వ తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలించి నిందితున్ని అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలుకు పంపారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement