కూతురును కాపాడేందుకు తండ్రి పోరాటం.. చివరకు ఇద్దరూ! | Father Dies While Trying To Save Daughter Who Fell Into A Pond In Telangana Kamareddy, Check More Details Inside | Sakshi
Sakshi News home page

కూతురును కాపాడేందుకు తండ్రి పోరాటం.. చివరకు ఇద్దరూ!

Nov 6 2026 9:37 AM | Updated on Nov 6 2026 10:11 AM

Father Daughter Drown Nizamabad Kamareddy Lake Incident

సాక్షి, తెలంగాణ: నిజామాబాద్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో ప్రమాదవశాత్తు పడిన కుమార్తెను కాపాడబోయి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో తండ్రి, కుమార్తె ఇద్దరూ నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మండలం కోటాల్‌పల్లి గ్రామంలోని గోరిగారి చెరువులో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంకరి పెద్ద నర్సింలు (60), ఆయన కుమార్తె సోమిశెట్టి రజిత (40) చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో రజిత ప్రమాదవశాత్తు చెరువులో జారిపడింది. గమనించిన తండ్రి ఆమెను కాపాడేందుకు వెంటనే నీటిలోకి దిగాడు.

అయితే, కుమార్తెను రక్షించే ప్రయత్నంలో నర్సింలు కూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి, తండ్రి, కుమార్తె మృతదేహాలను వెలికితీశారు.

అనంతరం పోలీసులు మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కోటాల్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. మృతుల్లో చిన్నారులు, మహిళలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement