రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కుంతి జిల్లాలో జనాలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అతి వేగమే కారణమని సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#WATCH | Khunti, Jharkhand: Visuals from the spot after seven people died and one sustained injuries in a tragic road accident in the Karra police station area of Khunti district. An overspeeding truck ran over several people who had gathered at the spot following an accident involving a scooty rider.
— ANI (@ANI) November 6, 2026
ఇదీ చదవండి: దారుణం : భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు!


