హైదరాబాద్ : వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తుండడంతో నగర మార్కెట్లు కళకళలాడుతున్నాయి. షాపింగ్ సందడితో కిక్కిరిస్తున్నాయి. దీపావళి అంటే నగరంలో పెద్ద పండుగే.
దీపకాంతులు వెదజల్లే ప్రమిదలు, రంగురంగుల తోరణాలు, బొమ్మల కొలువులు, అలంకరణ వస్తువులు, డెకరేషన్ సామగ్రి, రకరకాల విద్యుత్, ఎల్‌ఈడీ లైట్లు ఒకవైపు..పూలు, పండ్లు, గుమ్మడికాయలు, స్వీట్లు, టపాసులు ఒకపైపు మార్కెట్లను ముంచెత్తాయి.
దీంతో బేగంబజార్, చార్మినార్, జనరల్ బజార్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, అమీర్‌పేట, మెహిదీపట్నం తదితర ముఖ్యప్రాంతాలు బిజీగా మారాయి. పండుగకు రెండు రోజుల ముందే కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
వస్త్ర దుకాణాలు, జ్యువెలరీ షాపుల్లో ధన్‌తేరస్ కళ కనిపిస్తోంది. టపాసుల స్టాల్స్ వద్ద కూడా రద్దీ కొనసాగుతోంది.
మొత్తంగా ఈ ఏడాది దీపావళి సంప్రదాయ ప్రమిదల వెలుగులు, ఆధునిక ఎల్‌ఈడీ లైట్ల కలయికతో భాగ్యనగరం మరింత మెరిసిపోనుంది.


