కరీంనగర్ జిల్లా: జిల్లాలోని వివిధ మండలాల్లో గురువారం సద్దుల వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి.. సాయంత్రం ఆటలు ఆడారు. డీజే పాటలతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
మెట్పల్లిలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు నివాసంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
ధర్మపురి మండలం రాయపట్నంలో మహిళలు ఆటపాటల్లో మునిగి తేలారు.
అనంతరం బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేశారు.


