మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గా తేజ్) పెళ్లి పీటలెక్కెందుకు రెడీ అయిపోయాడు. తన చిన్ననాటి ఫ్రెండ్ కిరణ్మయితో ఏడడుగులు వేయనున్నాడు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది.
ఈ ఎంగేజ్‌మెంట్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా కొత్త జంటకు అభినందనలు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెగా హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా.. వీరిద్దరి వివాహం డిసెంబర్ 10న జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనున్నట్లు సమాచారం.


