జంతర్‌మంతర్‌ నిరసనల్లో హింస.. ఎలాంటి ఫిర్యాదులు అందలేదు | Supreme Court asks inquiry panel to submit its report on police excesses in a month | Sakshi
Sakshi News home page

జంతర్‌మంతర్‌ నిరసనల్లో హింస.. ఎలాంటి ఫిర్యాదులు అందలేదు

Nov 6 2026 6:40 AM | Updated on Nov 6 2026 6:40 AM

Supreme Court asks inquiry panel to submit its report on police excesses in a month

సుప్రీంకోర్టుకు తెలిపిన హెచ్‌పీఈసీ

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ)సారథ్యంలో జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనల సమయంలో భద్రతా బలగాలు మితిమీరి బలప్రయోగానికి పాల్పడ్డాయంటూ వచ్చిన ఆరోపణలపై బాధితుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ(హెచ్‌పీఈసీ) తెలిపింది. 

ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని ధర్మాసనం గురువారం హింసకు సంబంధించిన ఆరోపణలపై బాధితుల నుంచి అందిన వీడియో క్లిప్పుల వంటి ఆధారాలను తమ ఎదుట వెల్లడించాలని హెచ్‌పీఈసీని కోరగా పైవిధంగా కమిటీ బదులిచ్చింది. బాధితులు ఆన్‌లైన్‌లో సైతం ఫిర్యాదులు, ఆధారాలను అందించేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌నూ అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి సారథ్యంలోని హెచ్‌పీఈసీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లోనూ, ప్రత్యక్షంగానూ ఎలాంటి ఆధారాలు బాధితుల నుంచి అందలేదని పేర్కొంది. 

బలగాల మితిమీరిన బలప్రయోగానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలున్నా ప్రత్యక్షంగా, రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా లేక వర్చువల్‌గా అందజేయవచ్చంటూ అక్టోబర్‌ 17వ తేదీన దేశవ్యాప్తంగా 149 వార్తా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చినట్లు అక్టోబర్‌ 31వ తేదీన జరిగిన విచారణ సమయంలో హెచ్‌పీఈసీ పేర్కొంది. అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని గురువారం ధర్మాసనం స్పష్టం చేసింది. తాము పిటిషన్లతోపాటే వీడియో క్లిప్పులు తదితర ఆధారాలను అందజేశామని పిటిషనర్ల తరఫున సీనియర్‌ లాయర్‌ బృందా గ్రోవర్‌ చెప్పారు. అప్పటి ఘటనలకు సంబంధించి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు. 

దీనిపై ధర్మాసనం..ఇప్పటికైనా బాధితులు తమ వద్ద ఉన్న అన్ని రకాల ఆధారాలను హెచ్‌పీఈసీకి అందజేసేలా ఇప్పటికైనా ప్రోత్సహించాలని పిటిషనర్ల లాయర్లు బృందా గ్రోవర్, శంకరనారాయణన్‌లను ధర్మాసనం కోరింది. అదేవిధంగా, ఇప్పటి వరకు అందిన వివిధ రకాలైన ఆధారాల ప్రాతిపదికగా నిజనిర్థారణ ప్రక్రియను ప్రారంభించాలని హెచ్‌పీఈసీని ధర్మాసనం కోరింది. కాగా, నీట్‌ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన వైదొలగాలంటూ జూన్‌–జూలై నెలల్లో సీజేపీ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో ఆందోళనలు కొనసాగడం తెల్సిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement