మరోసారి సీజేపీ ‘జంతర్ మంతర్’ | Jantar Mantar at Kochi: CJP announces Anti-SIR stir once again | Sakshi
Sakshi News home page

మరోసారి సీజేపీ ‘జంతర్ మంతర్’

Nov 5 2026 8:13 PM | Updated on Nov 5 2026 8:22 PM

Jantar Mantar at Kochi: CJP announces Anti-SIR stir once again

కొచ్చి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 7న కేరళలోని కొచ్చిలో ‘జంతర్ మంతర్ ఎట్ కొచ్చి’ పేరుతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రకటించింది. కొచ్చిలోని రాజేంద్ర మైదాన్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తన పదవి నుంచి దించే వరకూ తమ పోరాటం ఆపమని గంతంలేనే తేల్చి చెప్పిన నేపధ్యంలో జరగనున్న ఈ నిరసన కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.

ఈ నిరసన కార్యక్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పాల్గొననున్నారు. ఆ పార్టీ దక్షిణ జోన్ నాయకుడు విజయ్ మల్లంగి, జాతీయ కార్యదర్శి అఫ్రీన్ నవాజ్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సీజేపీ పిలుపునిచ్చింది.

ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన సీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అంతేకాదు అక్కడ జాతీయ జెండాలతో నిరసన తెలిపిన సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అరెస్టు చేసి వారం రోజుల తర్వాత విడుదల చేశారు.

ఆ సమయంలో అభిజీత్ దీప్కేని కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. అనంతరం ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆయనకు ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదనే షరతును విధించారు. కాగా నవంబర్ 1న ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీకి సీజేపీ మద్దతు ప్రకటించినప్పటికీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాంలీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీలో ఆ పార్టీ పాల్గొనలేదు.

ఇదీ చదవండి: హర్మూజ్ జలసంధిలో భారత్‌, చైనాకు ఇరాన్ కీలక మినహాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement