కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది. పోక్సో (POCSO) కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఒక నిందితుడు, బాధితురాలైన బాలికపై హత్యాయత్నం చేయడం కలకలం రేపింది.సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల సమాచారం ప్రకారం అరక్కప్పాడి సమీపంలోని పెరుమని నివాసి మహమ్మద్ అద్నాన్. జైలు నుండి విడుదలైన కొన్ని వారాల తర్వాత, సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిందితుడు బాధిత బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశాడు. ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. బాలిక కేకలు విని పరుగెత్తుకొచ్చిన ఒక యువకుడు వెంటనే స్పందించి, నిందితుడిని అడ్డుకున్నాడు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఈ పోరాటంలో ఆ యువకుడికి కత్తి గాయాలైనప్పటికీ, బాలిక ప్రాణాలను కాపాడ గలిగాడు. దాడి నుండి తనను తాను కాపాడుకునే క్రమంలో బాలిక రెండు చేతులకు గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. నిందితుడిని స్థానికుల సాయంలో అటవీ ప్రాంతంలో అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి మళ్లీ రిమాండ్‌కు తరలించారు.
ఆమెమెడ దగ్గర కత్తి పెట్టి, ఇంట్లోంచి బయటకు ఈడ్చుకు రావడం చూశాను. వెంటనే వెళ్లి అడ్డుకున్నాను. ఈ క్రమంలో తనకూ గాయమైందనీ, కానీ బాలికను కాపాడగలిగాను అని ఆ యువకుడు ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
ఇదీ చదవండి: ఫస్ట్ ఏసీలోనే నగలు,నగదు చోరీ మహిళ ఆగ్రహం : స్పందించిన రైల్వే
కాగా ఈ ఏడాది ఆగస్టు 8న నిందితుడు అద్నాన్ పోక్సో కేసు నమోదైంది. నిందితుడు సుమారు రెండున్నర నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి, అక్టోబర్ 18న బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఇదీ చదవండి : ఏసీపీ మనస్వి వసిష్ఠ్‌పై సస్పెన్షన్ వేటు


