ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. ఇద్దరు ట్రెక్కర్ల మృతి | Heavy snowfall in Uttarakhand two trekkers lost Breath | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. ఇద్దరు ట్రెక్కర్ల మృతి

Nov 3 2026 6:59 PM | Updated on Nov 3 2026 7:24 PM

Heavy snowfall in Uttarakhand two trekkers lost Breath

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో భారీ హిమపాతం కారణంగా గల్లంతైన ఎనిమిది మంది ట్రెక్కర్లలో ఇద్దరి మృతదేహాలను సహాయక బృందాలు మంగళవారం గుర్తించాయి. అక్టోబర్ 29న కేదార్‌తాల్ ట్రెక్కింగ్ మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కేదార్ ఖరక్ ప్రాంతంలో రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (NIM) సంయుక్త బృందం గాలింపు చేపట్టి ఒక పురుషుడు, ఒక మహిళ మృతదేహాలను వెలికితీసింది. అయితే వారి వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. బుధవారం తిరిగి గాలింపు కొనసాగించనున్నారు.

గల్లంతైన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐదుగురు పురుషులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళలతో పాటు ఓ స్థానిక గైడ్ కూడా ఉన్నారు. గంగోత్రి నుంచి అక్టోబర్ 27న ప్రారంభమైన 12 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం కేదార్‌తాల్ నుంచి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా హిమపాతం సంభవించింది. దీంతో ఎనిమిది మంది ఆచూకీ గల్లంతైంది. మిగిలిన నలుగురు సహాయక సిబ్బంది అక్టోబర్ 30న సురక్షితంగా గంగోత్రికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు.

ఇదీ చదవండి: రౌడీయిజం, గూండాయిజంతో భయభ్రాంతులకు గురిచేశారు: రోజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement