బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్‌ | Uttarakhand bride appeals to CM for road connectivity while waking 18 km in lehenga | Sakshi
Sakshi News home page

బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్‌

Oct 23 2026 2:47 PM | Updated on Oct 23 2026 2:55 PM

Uttarakhand bride appeals to CM for road connectivity while waking 18 km in lehenga

ఉత్తరాఖండ్‌లోని చక్రాత ప్రాంతంలో మౌలిక వసతుల లేమిని, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేస్తూ ఒక వధువు  చేసిన వీడియో వైరల్‌గా మారింది. పెళ్లి  ముస్తాబు, దుస్తుల్లోనే సుమారు 18 కిలోమీటర్ల దూరం కఠినమైన  బాటలో నడవాల్సి వచ్చిందట.  తన  పెళ్లి ప్రయాణం గురించి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి చేసిన విజ్ఞప్తి  నెట్టింట సందడి చేస్తోంది.

 తమ గ్రామానికి  రోడ్లు లేకపోవడం వల్ల  కేవలం పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలప్పుడు మాత్రమే  కాదు,  అత్యవసర వైద్య సహాయం కోసం వృద్ధులు, గర్భిణులు, రోగులు ఆసుపత్రులకు వెళ్లడం తీవ్రంగా ఇబ్బందికరంగా మారిందని వధువు  షర్మిల తన వీడియోలో చెప్పకనే చెప్పింది. బుల్హార్ గ్రామం నుండి పెళ్లికూతురు  షర్మిల బరాత్‌తో కలిసి వాహనంలో లోఖండీ వరకు చేరుకుంది. అక్కడి నుండి డెహ్రాడూన్ సమీపంలోని మారుమూల ప్రాంతమైన ఉండావాకు సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో సుమారు 18 కిలోమీటర్లు  కొండ దారిని ఆమె నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. గృహప్రవేశానికి సంబంధించిన శుభ ముహూర్తం సమయం దాటిపోకూడదనే ఆరాటంతో, ఆమె తాను ధరించిన బరువైన పెళ్లి లెహంగా, నగలతోనే ఆ కఠినమైన కొండ మార్గంలో దాదాపు 4 గంటల పాటు వేగంగా నడుస్తూ, కొన్ని చోట్ల పరుగెడుతూ కనిపించింది. 

ఇదీ చదవండి: రూ.800కి సేల్స్‌మేన్‌ ‌: క్లీనర్‌కి లంబోర్ఘిని ఇచ్చి, హైదరాబాదీ గొప్ప మనసు

గ్రామస్థులు తీసిన వీడియో ద్వారా, స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా తమ గ్రామాలకు కనీస రోడ్డు సదుపాయం, వైద్య సదుపాయాలు లేవని, వెంటనే రహదారి నిర్మించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి  విజ్ఞప్తి చేసింది. కాగా  షర్మిల ఉదావా గ్రామానికి చెందిన అనిల్ చౌహాన్‌తో వివాహం జరిగింది. ఇక్కడి జౌన్సారీ కమ్యూనిటీ ఆచారం ప్రకారం, పెళ్లికూతురే బరాత్ ద్వారా వరుడి ఇంటికి వెళ్తుంది. ఈ సాంప్రదాయాన్ని స్థానికంగా 'జోజోడే'అని పిలుస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement