ఫస్ట్ ఏసీలోనే నగలు,నగదు చోరీ మహిళ ఆగ్రహం : స్పందించిన రైల్వే | Woman weeps claims Rs 2-75 lakh jewellery cash stolen on train Railways reacts | Sakshi
Sakshi News home page

ఫస్ట్ ఏసీలోనే నగలు,నగదు చోరీ మహిళ ఆగ్రహం : స్పందించిన రైల్వే

Nov 3 2026 5:08 PM | Updated on Nov 3 2026 5:51 PM

Woman weeps claims Rs 2-75 lakh jewellery cash stolen on train Railways reacts

ఆనంద్ విహార్ టెర్మినల్-న్యూ జల్పాయిగురి ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నంబర్ 15726) ఫస్ట్ ఏసీ కూపేలో ప్రయాణిస్తున్న ఒక మహిళ లక్నో స్టేషన్  వద్ద బంగారు నగలు, రూ 25వేలు ఉన్న బ్యాగును కోల్పోయింది. దీంతో  ఫస్ట్ ఏసీ కేబిన్ కూడా సురక్షితం కాకపోతే ఎలా?" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  ఇంకా నయం అంటూ తన బిడ్డను ఎత్తుకెళ్లలేదు  కన్నీ ళ్లు పెట్టుకున్నవీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో రైల్వే విభాగం  స్పందించింది. అసలేం జరిగింది?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో తనకెదురైన అనుభవాన్ని గురించి    వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది.  రూ. 2.5 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 25వేల నగదు చోరీకి  గురయ్యానని తెలిపింది. తాళం వేసి ఉన్న ఫస్ట్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో కూడా ప్రయాణికులకు భద్రత లేకపోవడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.   దొంగతనం జరిగిన వెంటనే  అత్యవసర పద్ధతిలో చైన్ 4 సార్లు లాగినప్పటికీ, ఆర్పీఎఫ్ (RPF) గానీ, రైల్వే సిబ్బంది గానీ సహాయం చేయడానికి రాలేదని ఆమె ఆరోపించారు.  తన బిడ్డను ఎవరూ అపహరించక పోవడం అదృష్టం .. ఇంత  నిర్లక్ష్యమా అంటూ రైల్వే పనితీరుపై విమర్శలు గుప్పించింది.

నెటిజన్ల ఆగ్రహం:
'జెమ్స్ ఆఫ్ రైల్వేస్' (Gems of Railways) అనే ఎక్స్  ఖాతాలో ఈ వీడియో పోస్ట్  కావడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఫస్ట్ ఏసీలోనూ భద్రత లేకపోవడంపై విమర్శలు గుప్పిస్తూ, రైలులో విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  కోచ్ సిబ్బంది, పాంట్రీ ఉద్యోగులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

 ఈ ఘటనపై నార్తర్న్ రైల్వేకి చెందిన లక్నో డివిజన్ అధికారులు స్పందించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్పీఎఫ్ (RPF), ఉత్తరప్రదేశ్ జిఆర్‌పి (GRP) లను ఆదేశించారు. 

ఇదీ చదవండి : ఏసీపీ మనస్వి వసిష్ఠ్‌పై సస్పెన్షన్ వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement