మన ఆటోరిక్షాపై ప్రేమతో ఆ బ్రిటన్‌ దంపతులు ఏం చేశారంటే..?! | British Couple Takes Indian Auto Rickshaw To The UK After Unforgettable 75 Day Journey Across India, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

భారత ఆటో రిక్షాపై ప్రేమతో ఆ బ్రిటన్‌ దంపతులు ఏం చేశారంటే..?!

Nov 3 2026 2:38 PM | Updated on Nov 3 2026 2:58 PM

British couple refuses to leave Indian auto-rickshaw behind after 75-day trip

మన ఆటో రిక్షాకి ఇంత క్రేజ్‌ ఉందా. అది విదేశీ దంపతుల మనసునే దోచి..తమ వెంట తీసుకునే వెళ్లేదాక దారితీసింది. అంతేకాదండోయే ఏకంగా సముద్ర మార్గాన పట్టుకెళ్లారట వాళ్లు. 

ఆ దంపతులే బ్రిటన్‌కు చెందిన హెలెన్‌ మిక్‌లు. తమిళనాడులో చెన్నైలో రిజిస్టర్‌ చేయబడిని ఎరుపు నలుపురంగు బజాజ్‌ ఆటో రిక్షాలో 75 రోజులు భారతదేశం అంతటా 4,218 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆ జంట ఆ త్రీ వీలర్‌కు ‘టిమ్మీ ది టిన్ క్యాన్’ అని పేరు పెట్టారు. భారత్‌లో పర్యటిస్తున్నప్పుడూ వారికి రవాణా సాధానంగా ఉపయోగిపడింది ఆ మూడు చక్రాల వాహనమే. 

ఆ ఆటోలోనే ఆగ్రాతో సహా అనేక గ‍మ్యస్థానాలకు చేర్చింది. దాంతోనే తాజ్‌మహల్‌ని కూడా సందర్శించారు. దాని ప్రత్యేక రూపం ఆ దంపతలు మనసుని దోచింది. సుమారు 75 రోజులపాటు ఆ ఆటోలో ప్రయాణించడంతో తమకు ఆ ఆటతో విదదీయరాని అనుబంధం ఏర్పడిందని, అందువల్ల దాన్ని వదిలి ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేమని భావించారు. 

ఆ నేపథ్యంలోనే దాన్ని తమవెంటే యూకేకు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ఆ దంపతులు ఆ వాహనాన్ని భారతదేశం నుంచి యూకేకు సముద్ర మార్గం ద్వారా ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. అయితే ఆ ఆటో తమ వద్దకు చేరేందుకు సుమారు ఆరు నెలల సమయం నిరీక్షించక తప్పలేదు. 

అక్టోబర్‌23,2026న టిమ్మీ లండన్ గేట్‌వే పోర్ట్‌కు చేరుకోవడంతో వారి నిరీక్షణ ముగిసింది. భారతీయ రహదారులపై వేలాది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, ఆ మూడు చక్రాల వాహనం తన అంతర్జాతీయ ప్రయాణాన్ని పూర్తి చేసి బ్రిటన్‌కు చేరుకుంది. ఈ అసాధారణ కథను పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఒక భారతీయ ఆటో రిక్షా యూకేకి వస్తోంది. 

భారతీయ రోడ్ల నుంచి బ్రిటిష్‌ వీధుల వరకు ..ఎంత అద్భతమైన ప్రయాణం అని రాశారు పోస్ట్‌లో. కాగా, దీన్ని బ్రిటన్‌ తీసుకురావడం ఒక ఎత్తు అయితే..అక్కడ బ్రిటన్‌ రోడ్లపై నడపాలంటే మాత్రమే తగిన అనుమతులు పొందాల్సిందే. నెటిజన్లు కూడా బ్రిటిష్‌ రోడ్లపై భారత ఆటో రిక్షా.. చూసే అవకాశమా? గ్రేట్‌ అంటూ ఆ దపంతుల సాహసోపేతమైన నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు.

 

ఇదీ చదవండి: ఆకలిని జయించిన పట్టుదల..నిరాహారంగానే చార్‌ధామ్‌ యాత్ర!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement