చార్‌ధామ్ యాత్ర చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సరదా పోటీ..ఆ యాత్ర విశిష్టతపై ఆసక్తిని రేకెత్తించేలా చేసింది.
అసలేం జరిగిందంటే..ముంబైకి చెందని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగి ఉత్సవ్ కుమార్ ఝూ తన స్నేహితుడు ఇతీష్ కుమార్ రాయ్‌తో ఎవరు ముందుగా చార్‌ధామ్ యాత్రను పూర్తి చేస్తారనే అంశంపై పందెం కాశారు. అప్పటికే వీరిద్దరు నాలుగు పుణ్యక్షేత్రాలల్లో మూడింటిని సందర్శించారు. ఇతీష్‌కు కేవలం రామేశ్వరం మాత్రమే కలిగి ఉండగా, ఉత్సవ్‌కు ద్వారకను సందర్శించాల్సి ఉంది. నవంబర్4న ఇతీష్ రామేశ్వరానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకున్న ఉత్సవ్..ఈ పోటీని మరింత సీరియస్‌గా తీసుకున్నారు.
పందెంలో ఓడిపోకూడదని భావించిన ఆయన తన స్నేహితుడికి తెలియకుండానే ద్వారకకు బయలుదేరారు. ఆయన పందెంలో గెలవడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకుని ఆ రోజు డ్యూటీ ముగించుకుని హడావిడిగా తత్కాల్‌లో టికెట్ బుక్ చేసుకుని అప్పటి కప్పుడు యాత్రకు పయనమయ్యాడు. అక్కడ కృష్ణుడిని సందర్శించుకోవడమే గాక ఆ జర్నీ విశేషాలను వీడియో రూపంలో రికార్డు చేసి మరి నెట్టింట షేర్ చేయడమే గాక స్నేహితుడిని ఉద్దేశిస్తూ ఈ పందెంలో తాను గెలిచినట్లు చెప్పి..తన యాత్ర విశేషాలను కూడా పంచుకున్నాడు.
ఉత్సవ్ ఆ వీడియోలో..తాను పందెంలో గెలిచినట్లు చెబుతూ..తన స్నేహితుడిని ఉద్దేశించి ఇలా అన్నాడు. క్షమించు ఇతీష్ భాయ్. నాకంటే ముందే చార్‌ధామ్ యాత్ర పూర్తి చేశానని అనుకుంటున్నావా..వెనుక చూడు. ఇది ద్వారకా దేవాలయం. అంటే నీకంటే ముందే తాను నేను చార్‌ధామ్ యాత్ర పూర్తి చేసేశా. అంతేగాదు తాను ఆలయానికి చేరుకుని పూజలు చేశానని, అది కూడా నిరాహారంగానేనని చెప్పాడు.
ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక..ఉత్సవ్ ఉత్సాహాన్ని, స్నేహాన్ని ప్రశంసించారు నెటిజన్లు. చెప్పాలంటే..ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహపూర్వక పోటీగా ప్రారంభమై..చివరకు విశ్వాసం, సాహసం, గెలవాలన్న పట్టుదల కలగలిసిన అసాదారణ ప్రయాణ కథగా మారింది.
ఇదీ చదవండి: ఐఏఎస్ కల చెదిరినా ..130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!


