ఐఏఎస్‌ కల చెదిరినా ..130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం! | Failed IAS Aspirant Built A Rs 130 Crore Healthy Dessert Business | Sakshi
Sakshi News home page

Success Story: ఐఏఎస్‌ కల చెదిరినా ..130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

Nov 3 2026 11:21 AM | Updated on Nov 3 2026 11:46 AM

Failed IAS Aspirant Built A Rs 130 Crore Healthy Dessert Business

మనం అనుకున్న కలను ఒక్కోసారి సాకారం చేసుకోలేకపోతుంటాం. విజయం పదే పదే దోబుచులాడుతూ..వైఫల్యమే వెంటాడుతుంటుంది. కానీ ఓపికతో మరో మార్గంలో సక్సెస్‌ని వెతికే ఆలోచన చేస్తే..ఎంత పెద్ద సక్సెస్‌ని అందుకోగలమో ఊహకే అందదు. అదే నిరూపించి..తనలా సివిల్స్‌లో విఫలమై కుంగిపోతున్న యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. బహుశా కేవలం అందులోనే నీకు సక్సెస్‌ రానివ్వకుండా ఆపగలదేమో..ప్రతిదానిలో కాదు అని చెంపపగిలిలే కనువిప్పు కలిగించే విజయగాథ ఇది. 

అతడే సందీప్‌ జంగాలా. అతడికి ఐఏఎస్‌ అవ్వాలనేది డ్రీమ​. కానీ సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించ లేకపోయాడు. పోనీ స్టార్టప్‌తోనైనా నిలదొక్కునే ప్రయత్నం చూద్దామంటే..తన మొదలుపెట్టిన తొలి టెక్‌స్టార్టప్‌ సైతం వెక్కిరిస్తూ..వైఫల్యాన్నే అందించింది. అయినా సరే సందీప్‌ చతికిలపడిపోలేదు..తన సక్సెస్‌ని మరో మార్గంలో వెతుక్కేనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా అతడు తన భార్య సోనియా లంబాతో కలిసి 2022లో ‘యమ్మీ బీ’ అనే ఫుడ్‌ బిజినెస్‌ని ప్రారంభించాడు. తన కుమార్తె కోసం ఆరోగ్యకరమైన స్వీట్ల తయారీ కోసం అన్వేషిస్తున్న క్రమంలోనే ఈ ఆలోచన వచ్చింది అతడికి. సందీప్‌ సాధారణంగా తన కూతురు పుట్టని రోజు కోసం ఇంట్లో తయారు చేసే వంటకాలకే ప్రాధాన్యత ఇచ్చేవాడు. 

కనీసం కేక్‌ ఇవ్వాలనుకున్నా..అది కూడా ప్రిజర్వేటివ్‌లను వాడకుండా ఇచ్చేందుకే తాపత్రయపడేవాడు. అసలు ఈ ఆరోగ్యకరమైన వంటకాలనే వ్యాపారంగా మారిస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. అలా ప్రజలకు ఆరోగ్యకరమైన డెజర్ట్‌లు అందించే ‘యమ్మ బీ’ అనే ఫుడ్‌ బిజినెస్‌ని పెద్ద కేఫ్‌లా కాకుండా చిన్నగా ప్రారంభించి..క్లిక్‌ అవుతుందో లేదో చూసే ప్రయత్నం చేశాడు. అందుకని దీన్ని కేఫ్‌ మాదిరిగా కాకుండా చిన్న క్లౌడ్‌ కిచెన్‌గా ప్రారంభించాడు. అయితే దానికి ఊహించని రేంజ్‌లో స్పందన వచ్చింది. 

అలా సందీప్‌ తన వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా హైదరాబాద్‌లోనే తన తొలి స్టోర్‌ని ప్రారంభించాడు. దీనికి సెలబ్రిటీల నుంచి విశేష ఆదరణ లబించింది. ఆ గుర్తింపు సందీప్‌,  అతడి భార్య సోనియాలను తమ వ్యాపారం మరింత వృద్ధి చెందిలే చేసేందుకు దోహదపడింది. హైదరాబాద్‌లో లభించిన స్పందన చూసి బెంగళూరులో మరో అవుట్‌లెట్‌ తెరవాలని అనుకున్నారు. అయితే వంటగది ఒకటే అయ్యి ఉండాలని అనుకున్నారు. రెండు నగరాల్లో తన రెసిపీలు అందించేలా ఒకే వంట గది కేంద్రంగా అక్కడే తయారు అయ్యేలా కేర్‌ తీసుకున్నారు. 

ఆ నిమిత్తం వంటగదిలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం సుమారు రూ. 1 కోటి ఖర్చు చేశారు. అలా ‘యమ్మీ బీ’ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు రూ. 130 కోట్లుగా ఉంది.

 

ఇదీ చదవండి: తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement