సాంప్రదాయ ఉప్పుతో.. రూ. 5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం! | Success Story: Uttarakhands Traditional Salt Into A Rs 5 Crore Brand | Sakshi
Sakshi News home page

Success Story: రూ. వెయ్యితో ప్రారంభించి..రూ. 5 కోట్ల సామ్రాజ్యం! గృహిణి సృష్టించిన అద్భుతం

Oct 26 2026 12:13 PM | Updated on Oct 26 2026 12:55 PM

Success Story: Uttarakhands Traditional Salt Into A Rs 5 Crore Brand

ఓ సాధారణ గృహిణి తలుచుకుంటే అద్భుతాలు చేయగలదు. అంతేగాదు కోట్లలో ఆర్జించే వ్యాపార సామ్రాజ్యాన్ని సైతం సునాయాసంగా సృష్టించిగలదు. అదే చేసి చూపించి స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఈ గృహిణి. 

ఆ మహిళే ఉత్తరాఖండ్‌కు చెందిన శశి బహుగుణ. సంప్రదాయ రుచులను సజీవంగా ఉంచడం కోసం సాంప్రదాయ రాతి ఉప్పుతో అద్భుతాలు చేసింది. ఆ ఉప్పుని రుబ్బరోలులో నూరి, దానికి కొన్ని మసాలాలు జోడించి అద్భుతమైన 'పిస్యు లూన్' అనే రుచికరమైన సాల్ట్‌ని తయారు చేసింది. ఆ ఉప్పుతో వంటకు వచ్చే రుచి అంత ఇంత కాదు. అందుకే ‘నమక్వాలి’ అనే పేరుతో వ్యాపారం ప్రారంభించింది. దీంతో స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాలన్నది ఆమె ధ్యేయం. 

మొదట్లో ముగ్గురు మహిళలతో కలిసి చేసింది. ఆ తర్వాత ఆమె ఉత్పత్తుకు డిమాండ్‌ పెరగడంతో పనిచేసి మహిళల సంఖ్య కూడా పెరిగింది. ఆర్డర్లు ఊపందుకోవడంతో తల్లిపడుతున్న శ్రమకు తన వంతుగా సాయం అందించాలని భావించాడు సువేందు రతూరి. ఎక్కువ మంది వినియోగదారులు కొనేలా ఉత్పత్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాడు. అలా అతను పూర్తి స్థాయిలో వ్యాపారంలో చేరి..దానిని రూ. 5 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చాడు. 

ఆమె 52 ఏళ్ల వయసులో జస్ట్‌ రూ. వెయ్యిలతో ప్రారంభించింది ఈ వ్యాపారాన్ని. అప్పుడు ఆమె ఒకే ఒక్క సహాయకురాలు సాయంతో కొన్ని కాగితపు ప్యాకెట్లలో అందించేది ఉత్పత్తులను. ఎప్పుడైతే ఆమె కుమారుడు సోషల్‌ మీడియా సాయంతో ఉత్పుత్లను ప్రచారం చేయడం ప్రారంభించాడో అప్పుడు వ్యాపారం మంచి ఊపందుకుంది. నిజానికి మొదట్లో ఆమె వ్యాపారంపై అంతగా ఎవ్వరికీ నమ్మకం కలగలేదు. కానీ అవేమి పట్టించుకోకుండా తన లక్ష్యంతో ముందుకు సాగింది. అలాగే ముడిసరుకుల కోసం సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్లేది, తనతో కలిసి పనిచేయమని మహిళలను ప్రోత్సహించేది కూడా. 

అలా నెమ్మదిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఉత్పత్తులకు ఆదరణ పెరిగి ఎక్కువమంది కస్టమర్లను చేరుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె ఒక వెబ్‌సైట్‌ని ప్రారంభించి భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్లను స్వీకరించడం మొదలుపెట్టింది. అలా ఆమె వ్యాపారం 35 మంది మహిళలకు ఉపాధి కల్పించడం తోపాటు దాదాపు 500 మంది రైతులకు అండగా నిలుస్తోంది. 

ఆ తర్వాత శశి బహుగుణ, ఆమె కుమారుడు సువేందు షార్క్‌ ట్యాంక్‌ మూడవ సీజన్‌ షోలో పాల్గొన్నారు. అక్కడ జడ్జిగా వచ్చినా..'కార్‌దేఖో' (CarDekho) వ్యవస్థాపకుడు అమిత్‌ జైన్‌ వీరి ఉత్పత్తుల పట్ల ఆసక్తితో రూ. 5 లక్షల పెట్టుబడిని అందించి ప్రోత్సహించారు. అలా తన వ్యాపారాన్ని విస్తరించడానికి, మరింత మంది వినియోగదారులను చేరుకోవడానికి ఆయన వారికి మద్దతిచ్చారు. దాంతో చిన్నగా మొదలైన వ్యాపారం కాస్తా రూ. 5 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది.  

 

ఇదీ చదవండి: డిస్నీ వరల్డ్‌లో దీపావళి ధమకా..భారతీయ నృత్యాలతో మెరిసిన సిండ్రెల్లా కోట

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement