సిండ్రెల్లా కోట సాక్షిగా.. డిస్నీ వరల్డ్‌లో ఘనంగా దీపావళి సంబరాలు. | Diwali brings its light to Magic Kingdom at Walt Disney World Resort | Sakshi
Sakshi News home page

డిస్నీ వరల్డ్‌లో దీపావళి ధమకా..భారతీయ నృత్యాలతో మెరిసిన సిండ్రెల్లా కోట.

Oct 26 2026 11:02 AM | Updated on Oct 26 2026 11:15 AM

 Diwali brings its light to Magic Kingdom at Walt Disney World Resort

దీపావళికి ఇంకా రెండు వారాల సమయం ఉంది కానీ అప్పుడే అమెరికాకు ఆ పండుగ వైబ్‌ వచ్చేసింది. ఈ మేరకు అమెరికా ఫ్లోరిడాలోని ప్రసిద్ధ వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ వేదికగా దీపావళి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. 'జశ్న్ ప్రొడక్షన్స్' నిర్వహించిన ఈ 'దీపావళి డాన్స్ ఫెస్ట్ 2026' వేడుకల్లో భాగంగా ఐకానిక్ సిండ్రెల్లా కోట (Cinderella Castle) ముందర 'మెయిన్ స్ట్రీట్ USA' మార్గంలో ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శన జరిగింది. 

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు  ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 25 డాన్స్ స్టూడియోల నుంచి 500 మందికి పైగా దక్షిణాసియా నృత్యకారులు విచ్చేశారు. వారంతా సాంప్రదాయ దుస్తులు ధరించి గ్రాండ్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో  సిండ్రెల్లా కోట నేపథ్యంలో భారత శాస్త్రీయ (Classical) నృత్యం, బాలీవుడ్, ఫ్యూజన్ వంటి వివిధ నృత్యాలతో కళాకారులు అదరగొట్టారు. 

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే..డిస్నీ ప్రముఖ కార్టూన్ పాత్రలైన మిక్కీ మౌస్ ఎంబ్రాయిడరీ కుర్తా, అందమైన చీర, నగలతో పక్కా భారత సాంప్రదాయ శైలిలో కనిపించి సందర్శకులను కట్టిపడేశారు. ఈ దీపావళి ఉత్సవాలు కేవలం పరేడ్‌కే పరిమితం కాలేదు. 

ఎప్‌కాట్ (EPCOT) పార్కులో 'దీపావళి మేళా'తో మొదలై, యానిమల్ కింగ్‌డమ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు, అలాగే ప్రముఖ ప్రముఖ గాయకుడు 'టెషర్' (Tesher - జలేబీ బేబీ ఫేమ్) లైవ్ కాన్సెర్ట్‌ తదితరాలన్నీ ఘనంగా జరిగాయి. నిజానికి ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన డిస్నీ వరల్డ్ వేదికపై మన భారతీయ సంస్కృతి, కళలు, దీపావళి పండుగు వైభవం ఈ స్థాయిలో ప్రదర్శితమవ్వడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భారతీయులకెంతో గర్వకారణం. కాగా, తదుపరి దీపావళి నృత్యోత్సవం 2027, అక్టోబర్ 21–24 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమంతో ఐదవ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. ఈ వేడుకలో  పాల్గొనాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నృత్య స్టూడియోలు, కళాకారులు భాగస్వాములు జవనరి 01, 2027 కల్లా దరఖాస్తులు సమర్పించాల్సి  ఉంటుంది.

 

ఇదీ చదవండి: అమ్మ వంట అంటే అంత ఇష్టం..!: సచిన్‌ టెండూల్కర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement