‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య, నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం ‘సీన్’. నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషించారు.
జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 6న థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్– తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా ద్వారా ఎన్వీ ప్రసాద్, సురేశ్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


