breaking news
Naslen
-
ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో క్రేజ్ ఉండనే ఉంది. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఓ సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: మీ దుస్తులు మీ ఇష్టం.. వాడి కళ్లు వాడి ఇష్టం: సింగర్ సునీత)'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న నస్లేన్ లేటెస్ట్ మూవీ 'మాలీవుడ్ టైమ్స్'. సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. గతంలో 'ఉన్ని ముకుందన్ అసోసియేట్స్' అనే డార్క్ కామెడీ మూవీ తీసిన అభినవ్ సుందర్ నాయక్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ నెల 5న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.మాలీవుడ్ టైమ్స్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి హారర్ నవల్స్ చదివి, హారర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ, మనోజ్ నైట్ శ్యామలన్,స్పీల్బర్గ్ లాంటి దర్శకులని మించిపోవాలని ఓ కుర్రాడు ఆశపడుతుంటాడు. అలాంటివాడు.. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు? తన కథని, తన ఆలోచనల్ని వేరొకడు తెరపై ముందే ప్రెజెంట్ చేసేసినప్పుడు తన మూవీని చావుతో కనెక్ట్ చేసి హిట్ చేద్దామనుకున్నప్పుడు దర్శకుడిగా తన ప్రతిభ మాత్రమే తెరపై కనపడాలనుకుని కోరుకునే కుర్రాడు ఎలా ఫీలయ్యాడు? ఏం చేశాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నన్ను ‘బిగ్‌బాస్’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్)A love-hate letter to Malayalam cinema. Mollywood Times streaming from July 3, only on JioHotstar. Watch in Malayalam, Tamil. Telugu, Kannada and Hindi.@naslen__ @abhinavsnayak #MollywoodTimes #JioHotstar #JioHotstarMalayalam #Drama #Comedy #MalayalamMovie pic.twitter.com/8dNZEhtgSO— JioHotstar Malayalam (@JioHotstarMal) June 26, 2026 -
'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ
'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగులోనూ కాస్తంత గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు నస్లేన్.. ఇదే మూవీ దర్శకుడితో కలిసి చేసిన చిత్రం 'ఐ యామ్ కాదలన్'. 2024లోనే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి?విష్ణు(నస్లేన్) తన క్లాస్మేట్ శిల్ప(అనీష్మా)ని కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమిస్తాడు. కానీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విష్ణుకి జాబ్ రాకపోవడంతో శిల్ప నిరుత్సాహపడుతుంది. ఈమె.. తన తండ్రి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరిపోతుంది. ఓసారి తన ప్రేమ గురించి చెప్పేందుకు శిల్ప తండ్రి దగ్గరకెళ్లిన విష్ణుకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఇంతకీ అదేంటి? దీని తర్వాత శిల్ప తండ్రి కంపెనీని విష్ణు ఎలా హ్యాక్ చేశాడు? శిల్ప తండ్రిని ముప్పతిప్పలు పెట్టిన విష్ణు చివరకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తెలుగులో ఎప్పుడూ దాదాపుగా ఒకే కమర్షియల్ ఫార్ములా చుట్టూ స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు తిరుగుతుంటారు. మలయాళంలో మాత్రం తక్కువ బడ్జెట్లోనే కాస్త భిన్నంగా మంచి సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన మూవీనే ఇది. ప్రేమించిన అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకోవడం పాత కాన్సెప్టే. కానీ దానికి హ్యాకింగ్ అనే అంశం జోడించడం కాస్త చిత్రంగా అనిపించింది. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే సూపర్ కాకపోయినా పర్లేదు బాగానే ఉంది.అసలు పాయింట్ చెప్పడానికి కాస్త టైమ్ తీసుకున్న దర్శకుడు.. విషయం తెలిసిన తర్వాత ఎంటర్టైనింగ్గానే సినిమాని నడిపాడు. పెద్దగా టెక్నికల్ సెటప్ లేకపోయినప్పటికీ హీరో తన దగ్గరున్న డబ్బా కంప్యూటర్‌తోనే హ్యాకింగ్ చేయడం సహజంగానే ఉంది. హ్యాకింగ్ అనగానే ఏదేదో అనుకుంటాం కానీ సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా సింపుల్‌గానే చూపించారు. ఆ సీన్లు బాగానే కుదిరాయి. కాకపోతే కామెడీ లాంటి పెద్దగా ఉండవు.క్లైమాక్స్‌లో హీరో దొరికిపోతాడు అనుకున్న దగ్గర ఇచ్చిన ట్విస్ట్ అయితే నవ్వులు పూయిస్తుంది. ఇక హ్యాకర్ అయిన హీరోని పట్టుకునేందుకు హీరోయిన్ తండ్రి నియమించుకున్న లేడీ హ్యాకర్ చాలా ట్రై చేస్తుంది. మరి హీరో దొరికాడా లేదా? హ్యాకర్లు ఇద్దరూ ఏ సందర్భంలో ఎక్కడ కలుసుకున్నారనేది కూడా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. మలయాళంలో చాలా చిత్రాల్లో ఉన్నట్లే కాస్తంత సాగదీత కూడా ఉంటుంది. దాన్ని తట్టుకుని చూస్తే ఇదో టైమ్ పాస్ సినిమా.హీరోహీరోయిన్లు నస్లేన్, అనీష్మా బాగా చేశారు. మిగతా పాత్రధారులు కూడా సహజంగా నటించారు. టెక్నికల్ విభాగాలు కూడా తమ పని తాము చేశారు. ఓటీటీలో ఏదైనా కొత్త మూవీ.. అలా అలా సాగిపోయేలా ఉండేది చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. మలయాళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. అభ్యంతరకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.-చందు డొంకాన(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్)


