సూర్య 'సీన్' తెలుగు ట్రైలర్ రిలీజ్ | Suriya Scene Movie Trailer Telugu | Sakshi
Sakshi News home page

Scene Movie Trailer: డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా.. ట్రైలర్ చూశారా?

Nov 1 2026 12:02 PM | Updated on Nov 1 2026 12:02 PM

Suriya Scene Movie Trailer Telugu

ఈ ఏడాది ఇప్పటికే కరుప్పు(వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో హిట్స్ అందుకున్న సూర్య.. నెలల గ్యాప్‌లోనే మరొకటి రెడీ చేశాడు. అదే 'సీన్'. ఈ శుక్రవారమే(నవంబర్ 06) థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.

(ఇదీ చదవండి: లాంఛనంగా మొదలైన రామ్ చరణ్ కొత్త సినిమా)

'సీన్' ట్రైలర్ కాస్త వెరైటీగా ఉంది. ఓ కేసు విషయమై తన ఉద్యోగానికి రాజీనామా చేసే హీరో, అతడి దగ్గర పనిమనిషిగా చేరిన హీరోయిన్.. వీళ్లు కాకుండా ఓ సైకో కిల్లర్. అసలు వీళ్ల ముగ్గురికి కనెక్షన్ ఏంటి? అనేది ఈ హైపర్ యాక్టివ్ ఎంటర్‌టైనర్ చూసి తెలుసుకోవాలి. జీతూ మాధవన్ దర్శకుడు కాగా సుశీన్ శ్యామ్ సంగీతమందించాడు. జ్యోతిక-సూర్యనే నిర్మించారు.

ఇకపోతే ఈ సినిమా 06న రిలీజ్ కానుండగా.. అదే తేదీన నయనతార మూకుతి అమ్మన్ 2 (తెలుగులో 'మహాశక్తి') రానుంది. వీటికి ఒకరోజు ముందు 'రామాయణ'.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ డబ్బింగులకు తోడుగా తెలుగులో 'సమ్మర్ హాలీడేస్' అనే చిత్రం ప్రేక్షకులని పలకరించనుంది.

(ఇదీ చదవండి: మరో వివాదంలో 'ఇరుముడి'.. తెలంగాణ కార్మికశాఖ నోటీసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement