బాల్య జ్ఞాపకాల సమ్మర్ హాలీడేస్.. ట్రైలర్ చూశారా? | Tollywood Movie Summer Holidays Trailer out now | Sakshi
Sakshi News home page

Summer Holidays Trailer: బాల్య జ్ఞాపకాల సమ్మర్ హాలీడేస్.. ట్రైలర్ చూశారా?

Oct 28 2026 10:13 PM | Updated on Oct 28 2026 10:13 PM

Tollywood Movie Summer Holidays Trailer out now

మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషీ కీలక పాత్రల్లో వస్తోన్న మూవీ సమ్మర్ హాలీడేస్. ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా నవంబర్‌ 6న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ..'సమ్మర్ హాలిడేస్ సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు సెలవుల్లో ఊరెళ్లిన మెమొరీస్ గుర్తుకొచ్చాయి. ఈ సినిమా తప్పకుండా చూస్తా. ఈ దీపావళి పండక్కి మీరంతా ఫ్యామిలీతో కలిసి సమ్మర్ హాలిడేస్ సినిమా చూడాలని కోరుతున్నా. పిల్లలంతా బాగా నటించారు. ఈ యంగ్ టీమ్‌ను మీరంతా బ్లెస్ చేయండి. రోహన్ నాతో కలిసి నటించాడు. సమ్మర్ వస్తే అమ్మమ్మ, తాతయ్య ఊరికి వెళ్లడం అనేది మనం మర్చిపోయాం.  ఈ చిన్న పిల్లల సినిమాను పెద్ద మనసుతో పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేసే  ధైర్యం ధీరజ్‌కే ఉంది' అని అన్నారు.

డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ..'మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ట్రైలర్ చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతే సినిమా చూస్తున్నప్పుడు కూడా కలుగుతుంది. మా ప్రొడ్యూసర్ ధీరజ్ ప్యాషన్ వల్లే మా సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఆయన ఈ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. మా మూవీ నుంచి రిలీజ్ చేసిన 3 పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడి గుండెను తాకేలా మా సినిమా ఉంటుంది. మరికొన్నేళ్ల పాటు మా సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ప్రతి సీన్ ఎంజాయ్ చేసే చిత్రమిది' అని అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. "సమ్మర్ హాలిడేస్ కథ విన్నప్పటి నుంచి ఈ మూవీని క్వాలిటీగా చేయాలని అనుకున్నాం. అమ్మమ్మ పాత్రలో జయసుధ ఒదిగిపోయారు. హర్షవర్థన్, రాజీవ్ కనకాల, హర్షిణి..ఇలా ప్రతి ఆర్టిస్ట్ తమ నటనతో మా సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా. మా సినిమాను పిల్లల కంటే అనేక రెట్లు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. ఏమాత్రం బోర్ కొట్టదు. మా సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement