ఓటీటీకి లేటేస్ట్‌ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Latest Crime Thriller Movie The Dark Heaven ott Streaming Date locked | Sakshi
Sakshi News home page

Crime Thriller: ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Oct 28 2026 8:01 PM | Updated on Oct 28 2026 8:09 PM

Latest Crime Thriller Movie The Dark Heaven ott Streaming Date locked

ఓటీటీలు వచ్చాక ఎంటర్‌టైన్‌మెంట్‌ మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషల్లో వచ్చినా సినిమాలైనా ఇంట్లోనే కూర్చుని తెగ చూసేస్తున్నారు. ఈ వారంలో బత్తా, సిగ్మా లాంటి తమిళ డబ్బింగ్ చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. తాజాగా మరో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.

గత నెల 18న థియేటర్లలో విడుదలైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్. ఈ మూవీకి బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సిద్ధు సిద్, దర్శిక, రిత్విక కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓకేసారి నాలుగు ఓటీటీల్లో సందడి చేయనుంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా, సింప్లీ సౌత్‌, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 30 నుంచే ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే కేవలం తమిళంలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కథేంటంటే..

ఈ చిత్రం మెక్కరై (Mekkarai) అనే గ్రామంలో జరిగే హత్యల చుట్టూ తిరుగుతుంది. మరణాలను ముందే అంచనా వేసే ఒక ప్రాచీన పుస్తకం, పురాణ సంబంధిత శాపాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ మూవీలో హత్యల వెనుక ఉన్న ఎవరనే రహస్యాన్ని ఆఫీసర్ ఇలంపారి(సిద్ధు సిద్) ఎలా ఛేదించాడనేది ప్రధాన స్టోరీ. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement