ఈ ఫోటోలోని చిన్నారి ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా? | Actress Poorna Shares Rare Childhood Photo Leaves Fans Surprised With Her Cute and Innocent Look, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Childhood Pic: ఈ ఫోటోలోని చిన్నారి ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

Oct 28 2026 3:54 PM | Updated on Oct 28 2026 4:16 PM

Tollywood actress Childhood Pic Goes Viral In Social Media

చిన్నప్పటి ఫోటోలు ఒక్కసారి మళ్లీ చూసుకుంటే ఎలా ఉంటుంది. అందులో మనం ఎంతో క్యూట్‌గా, అమాయకంగా కనిపిస్తాం. అలాంటి రేర్ పిక్స్ దొరికితే ఇప్పుడున్న రోజుల్లో ఊరికే కూర్చుంటామా? వెంటనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తాం. ఎన్నికామెంట్స్, లైక్స్ వస్తాయో పనికట్టుకుని మరి చూసుకుంటాం. అలాంటి బాల్య జ్ఞాపకాలను షేర్ చేసుకోవాలని ఎవరికీ ఉండదు చెప్పండి. సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా బాల్యం అందరికీ ఒక్కటే కదా. అందుకే ప్రముఖ టాలీవుడ్ నటి తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మలయాళీ అయిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సీమటపాకాయ్‌, అవును సినిమాలతో తెలుగులో ఫేమస్ అయింది. శ్రీ మహాలక్ష్మి, నువ్వలా నేనిలా, రాజుగారి గది, అఖండ 2 ఇలా పలు చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ మూవీస్‌ చేసింది. తాను మరెవరో కాదు.. ఇటీవల జైలర్‌-2లో ఐటమ్ సాంగ్‌లో మెప్పించిన పూర్ణ. ప్రస్తుతం ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌తో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది.

గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి పాటతో నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ..మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా, సహాయ నటిగా కనిపించింది. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. అలా మలయాళంలో సూపర్ డ్యాన్సర్ అనే పోటీలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement