సిక్సర్లు కొట్టేది అభిషేక్ మాత్రమే కాదు.. మేము కొడతాం: వెంకటేశ్ | Hero Venkatesh Comments at Aadarsha Kutumbham Pre Release event | Sakshi
Sakshi News home page

Venkatesh: 'సిక్సర్లు కొట్టేది అభిషేక్ మాత్రమే కాదు.. మేము కొడతాం'

Oct 27 2026 10:16 PM | Updated on Oct 27 2026 10:22 PM

Hero Venkatesh Comments at Aadarsha Kutumbham Pre Release event

వెంకీమామ హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ‍‍అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో వెంకటేశ్ మాట్లాడారు.

దాదాపు 25 ఏళ్ల తర్వాత మేమిద్దరం మళ్లీ కలిసి మీ ముందుకొస్తున్నామని వెంకటేశ్ అన్నారు. కామెడీతో పాటు అన్ని ఎలిమెంట్స్‌ ఈ మూవీలో ఉన్నాయని తెలిపారు. ఏకే47 మీకు తప్పకుండా నచ్చుతుందన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీస్ చాలా చేశానని వెంకీమామ అన్నారు. ఏం జరిగినా నా ఫ్యామిలీ నేను కాపాడుకోవాలి.. అదే ఆదర్శ కుటుంబమని తెలిపారు. ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చుతుందన్నారు. మన టీమిండియా బ్యాటర్లు అభిషేక్, శాంసన్, వైభవ్, నితీశ్, తిలక్ వర్మ సిక్సర్లు కొట్టడమే కాదు.. ఈ మూవీతో మేము కూడా స్టేడియం బయట సిక్సర్లు కొడతామని వెంకటేశ్ సరదాగా చెప్పారు. మా సినిమా ఆడినా.. ఆడకపోయినా.. బాగున్నా.. బాగాలేకపోయినా.. ప్రతి ఒక్కరు బాగుండాలని నేను ఉదయాన్నేఆ దేవుడిని కోరుకుంటానని వెంకీమామ వెల్లడించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement