దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన టాలీవుడ్ మూవీ రణబాలి. విజయ్ దేవరకొండ- రష్మిక జంటగా నటించారు. పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా ఇది. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. వసూళ్ల పరంగా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఈ మూవీ మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓవర్‌సీస్‌లో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 9 లక్షల డాలర్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ పంచుకుంది.
కాగా.. ఈ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. బ్రిటీష్ హయాంలో వచ్చిన కరువు పరిస్థితుల ఆధారంగా రూపొందించారు. వరుసగా రెండేళ్లు కరవు రావడంతో దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని డైరెక్టర్ రాహుల్ అన్నారు. అందుకే ఈ కథను ప్రజలకు చెప్పాలనిపించిందని రణబాలి ఈవెంట్‌లో మాట్లాడారు.
𝐍𝐎𝐑𝐓𝐇 𝐀𝐌𝐄𝐑𝐈𝐂𝐀 𝐆𝐑𝐎𝐒𝐒 $𝟗𝟎𝟎𝐊 𝐚𝐧𝐝 𝐂𝐨𝐮𝐧𝐭𝐢𝐧𝐠 🔱❤️🔥 #Ranabaali Conquering Cinemas Now 💥 🔥 Book Your Tickets 🎟️ Overseas Release By @PharsFilm @PrathyangiraUS #NeverForget @TheDeverakonda @iamRashmika #ArnoldVosloo @Rahul_Sankrityn @MythriOfficial @TSeries @RanabaaliFilm @PrathyangiraOS
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 27, 2026


