హీరోయిన్‌తో టాలీవుడ్‌ హీరో డేటింగ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..! | tollywood Hero ram pothineni Pics viral with actress dating rumours | Sakshi
Sakshi News home page

Ram Pothineni: హీరోయిన్‌తో రిలేషన్‌లో రామ్ పోతినేని.. సోషల్ మీడియాలో వైరల్..!

Oct 27 2026 3:33 PM | Updated on Oct 27 2026 3:42 PM

tollywood Hero ram pothineni Pics viral with actress dating rumours

సెలబ్రిటీలపై రూమర్స్, గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాలపై మరింత ఫోకస్ ఉంటుంది. సినిమా వాళ్ల పర్సనల్ లైఫ్‌ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉండడం సహజం. తాజాగా టాలీవుడ్ హీరోపై సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

తనతో హీరోయిన్‌గా చేసిన ముద్దుగుమ్మతో ఆయన ప్రేమాయణం చేస్తున్నారంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. అవే మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ ఒకే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ కావడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరో మరెవరో కాదు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. గతంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్‌లో ఉన్నాడంటూ వార్తలొచ్చాయి.

తాజాగా వీరిద్దరు ఒకే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ కావడంతో మళ్లీ ప్యాచ్‌అప్‌ అంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే అవీ ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా ప్రమోషన్స్‌ సమయంలో తీసుకున్న నాటి ఫొటోలేనని తెలుస్తోంది. పాత ఫొటోలను మళ్లీ వైరల్‌ చేస్తూ కొత్తగా ప్రచారం చేయడంతో వీరిద్దరి రిలేషన్‌పై నెట్టింట చర్చ మొదలైంది. అయితతే తమపై వస్తున్న రూమర్స్‌పై ఇప్పటివరకు ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement