విడాకులు తీసుకున్న తర్వాత సాధారణంగా సదరు భార్యభర్తలు మళ్లీ కలిసేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ ఎదురెదురుపడినా గానీ ఎడమొహం పెడమొహం అన్నట్లే వ్యవహరిస్తారు. అయితే దీనికి భిన్నంగా సెలబ్రిటీలు ప్రవర్తిస్తుంటారు. విడిపోయిన తర్వాత కూడా కలుస్తుంటారు. సరేలే ఇందులో గొప్పేం ఉందనుకుంటే.. మాజీ భర్తతో పాటు ఉంటున్న ప్రేయసిని మెచ్చుకోవడం లాంటివి అరుదుగా జరుగుతుంటాయి. హీరో హృతిక్ రోషన్ విషయంలో అలాంటి సంఘటనే జరిగింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్.. 13 ఏళ్ల క్రితం భార్య సుసానే ఖాన్‌కి విడాకులు ఇచ్చేశాడు. కానీ పిల్లల విషయంలో కో-పేరెంటింగ్ చేస్తున్నారు. తాజాగా తమ లవ్ లైఫ్ గురించి మాట్లాడిన సుసానే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. విడాకుల తర్వాత ప్రేమపై నమ్మకం కోల్పోయిన టైంలో అర్స్లాన్ గోనీ తన జీవితంలోకి వచ్చాడని, అతడు అద్భుతమైన వ్యక్తి, తన హృదయాన్ని సంపూర్ణం చేశాడని సుసానే చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని, కెరీర్‌తో పాటు పిల్లలతో సమయం గడుపుతూ ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని సుసానే తెలిపింది. మరోవైపు తన మాజీ భర్త హృతిక్ రోషన్ ప్రేయసి సబా ఆజాద్‌ని సుసానే పొగిడేసింది. సబా అద్భుతమైన వ్యక్తి, ఆమె హృతిక్ జీవితంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పింది. హృతిక్, సుసానే 2000లో పెళ్లి చేసుకోగా.. 2013లో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకున్నా గానీ పిల్లల పెంపకంలో కలిసి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
(ఇదీ చదవండి: సాయిపల్లవి.. 15 రోజుల్లోనే ఇటు సీత.. అటు ఐపీఎస్ ఆఫీసర్)


