వారం క్రితం బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ముంబైలోని జుహు ప్రాంతంలోని ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి కారులో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ నటుడికి స్వల్ప గాయాలు కాగా డ్రైవర్, ఉమేశ్ అనే అభిమాని మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నుంచి కోలుకుంటున్న టైగర్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
(ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్ రోజూ తాగే నీరు ఖర్చు రూ.3,600)
ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ని టైగర్ ష్రాఫ్ రూ.9 కోట్లకు అమ్మేశాడు. అక్టోబర్ 18న ఇతడిపై కాల్పులు జరగ్గా సరిగ్గా నాలుగు రోజుల తర్వాత అంటే 22వ తేదీన ఈ ఫ్లాట్ లావాదేవీ రిజిస్ట్రేషన్ పూర్తయింది. అయితే దుండగులు తొలుత మరో బాలీవుడ్ స్టార్‌ని టార్గెట్ చేశారని, అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ప్లాన్ మార్చి టైగర్‌పై దాడికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.
(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఇల్లు కట్టిన కమెడియన్.. వీడియో వైరల్)


