breaking news
Juhu
-
కాల్పుల ఘటన.. హీరో టైగర్ ష్రాఫ్ సంచలన నిర్ణయం
వారం క్రితం బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ముంబైలోని జుహు ప్రాంతంలోని ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి కారులో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ నటుడికి స్వల్ప గాయాలు కాగా డ్రైవర్, ఉమేశ్ అనే అభిమాని మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నుంచి కోలుకుంటున్న టైగర్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.(ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్ రోజూ తాగే నీరు ఖర్చు రూ.3,600)ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ని టైగర్ ష్రాఫ్ రూ.9 కోట్లకు అమ్మేశాడు. అక్టోబర్ 18న ఇతడిపై కాల్పులు జరగ్గా సరిగ్గా నాలుగు రోజుల తర్వాత అంటే 22వ తేదీన ఈ ఫ్లాట్ లావాదేవీ రిజిస్ట్రేషన్ పూర్తయింది. అయితే దుండగులు తొలుత మరో బాలీవుడ్ స్టార్‌ని టార్గెట్ చేశారని, అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ప్లాన్ మార్చి టైగర్‌పై దాడికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఇల్లు కట్టిన కమెడియన్.. వీడియో వైరల్) -
రూ.711 కోట్ల ఇల్లు కొంటున్న ‘ఇంటర్’ బిజినెస్‌మ్యాన్!
స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ ఠక్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జుహూలో ఏకంగా ఓ పూర్తి రెసిడెన్షియల్ టవర్‌ను ఆయన కొంటున్నారు. ఎంబసీ డెవలప్మెంట్స్ లిమిటెడ్‌కు చెందిన ‘ఎంబసీ టెరాజ్జా’ ప్రాజెక్టులోని ఈ టవర్ విలువ సుమారు రూ.711 కోట్లు. ఈ డీల్‌ను దేశంలోనే అతిపెద్ద సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ లావాదేవీగా ఎంబసీ డెవలప్మెంట్స్ పేర్కొంది.భారీ విస్తీర్ణంజుహూ తారా రోడ్డులో ఉన్న ఎంబసీ టెరాజ్జా అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టులో భాగమైన ఈ నివాస టవర్ ఎనిమిది అంతస్తులు (G+7) కలిగి ఉంది. దీని కార్పెట్ ఏరియా సుమారు 63,000 చదరపు అడుగులు. ఒక్కో అంతస్తులో ఒకే నివాస యూనిట్ ఉండేలా ప్రాజెక్టును రూపొందించారు. సముద్రం, సుందర నగరం వీక్షించే సౌకర్యరాతోపాటు ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్, వెల్నెస్, లైఫ్‌స్టైల్ సదుపాయాలు ఇందులో ఉంటాయి.రెండు ఎకరాలకు పైగా విస్తరించిన ఎంబసీ టెరాజ్జాలో సుమారు 50 నివాసాలు, ఐదు టవర్లు ఉన్నాయి. ప్రాజెక్టు మొత్తం గ్రాస్ డెవలప్మెంట్ వ్యాల్యూ (GDV) రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని ఎంబసీ డెవలప్మెంట్స్ తెలిపింది.ఇంటి పేరు ఇదే..దినేశ్ ఠక్కర్ ఈ టవర్‌ను తన కుటుంబ నివాసంగా ఉపయోగించుకోనున్నారు. దీనికి ‘ఏంజిలస్’ (Angelus) అని పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు ప్రైవసీ, విశాలమైన స్థలం, సముద్ర వీక్షణం వంటి సౌకర్యాలతో కుటుంబంతో నివసించేందుకు విలాసవంతమైన ఇల్లు తన ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయని ఠక్కర్ వెల్లడించారు.12వ తరగతితోనే చదువు ఆపేసి..దినేశ్ ఠక్కర్ వ్యాపార ప్రయాణం కూడా ఆసక్తికరమే. ముంబైలోని ములుంద్‌లో వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆయన కుటుంబం వస్త్ర వ్యాపారంలో ఉండేది. థానేలోని సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ హైస్కూల్లో చదివిన ఆయన, అనంతరం ముంబైలోని కిషిన్‌చంద్ చెల్లారం కాలేజీలో సైన్స్ చదివారు. అయితే 12వ తరగతి తర్వాత ఉన్నత విద్యను కొనసాగించలేదు.కుటుంబ వ్యాపారంలో చేరినప్పటికీ, అక్కడి పరిమితులు తనకు నచ్చక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కుటుంబం నుంచి మూలధనం తీసుకుంటే దానితో పాటు కొన్ని పరిమితులు వస్తాయని, అందుకే స్వతంత్రంగా ఉండాలని భావించినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సుమారు రూ.2.5 లక్షల చిన్న మూలధనంతో తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.1988లో స్టాక్ మార్కెట్లోకి..ఠక్కర్ 1988లో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు ఆయనకు బ్రోకింగ్ రంగంపై పెద్దగా అవగాహన లేదు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ, మార్కెట్ పతనంతో పెట్టుబడిలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోయారు. అయినప్పటికీ మార్కెట్‌ను విడిచిపెట్టకుండా బ్రోకింగ్ వ్యాపారంలోని అవకాశాలను అధ్యయనం చేశారు.1992 హర్షద్ మెహతా సెక్యూరిటీస్ స్కామ్ ఆయన వ్యాపార ప్రయాణంలో మరో భారీ ఎదురుదెబ్బగా మారింది. ఖాతాదారులు చెల్లింపుల్లో విఫలమవడంతో ఆయనపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా వ్యాపారాన్ని పునర్నిర్మించుకున్నారు.1996లో ఏంజెల్ బ్రోకింగ్..ఈ అనుభవాల తర్వాత 1996లో ఏంజెల్ బ్రోకింగ్‌ను సంప్రదాయ స్టాక్ బ్రోకింగ్ సంస్థగా ప్రారంభించారు. కంపెనీ అధికారిక సమాచారం ప్రకారం, ఏంజెల్ వన్ 1996 ఆగస్టు 8న స్థాపించబడింది. తర్వాత సంప్రదాయ బ్రోకింగ్ సంస్థ నుంచి డిజిటల్-ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీగా రూపాంతరం చెందింది. 2019లో కంపెనీ డిజిటల్ జర్నీని ప్రారంభించింది.2020 అక్టోబర్ 5న ఏంజెల్ బ్రోకింగ్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఎన్ఎస్ఈ రికార్డుల ప్రకారం, కంపెనీ 1996లోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దినేశ్ ఠక్కర్ ఏంజెల్ వన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: కాబోయే రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు! -
కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318.. ఒక్క నాన్ 118!.. ఈ రేట్లు ఎక్కడంటే..
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అభిమానులను అలరించాడు. పెర్త్, అడిలైడ్‌లో డకౌట్లతో నిరాశపరిచిన ఈ రన్‌మెషీన్.. సిడ్నీలో మాత్రం సత్తా చాటాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆఖరి ఆస్ట్రేలియా టూర్ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 168 పరుగులు జోడించిన కోహ్లి.. విన్నింగ్ షాట్‌గా ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోహ్లి కెరీర్లో ఇదే ఆఖరి ఆస్ట్రేలియా టూర్ కానుంది. దీంతో అభిమానులతో పాటు కింగ్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఎట్టకేలకు సిడ్నీలో మరోసారి తన విలువను చాటుకుని ఆసీస్ పర్యటనను ముగించాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కోహ్లి పేరు వైరల్‌గా మారింది.ఈసారి ఆటతో కాకుండా వ్యక్తిగత విషయంతో కోహ్లి వార్తల్లోకి ఎక్కాడు. కాగా ఈ క్రికెట్ సూపర్‌స్టార్ వన్8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలో 2022లో తొలి రెస్టారెంట్ తెరిచిన కోహ్లి.. జుహులోనూ ఓ బ్రాంచ్ పెట్టాడు.ఐకానిక్ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్‌కు చెందిన ఐకానిక్ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్ నడుస్తోంది. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల ధరలు తాజాగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318జుహులోని వన్8 రెస్టారెంట్లో పావ్ భాజీ ధర రూ. 650. అదే విధంగా.. ఉడకబెట్టిన అన్నం ధర రూ. 318. సింగిల్ సర్వింగ్ ఫ్రైస్ ధర ఏకంగా రూ. 348. వీటి సంగతి ఇలా ఉంటే.. కిచిడీ, తందూరీ రోటీ, బేబీ నాన్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.విరాట్ రెస్టారెంట్లో ఒక తందూరీ రోటీ ధర రూ. 118. ఇక కిచిడీ ధర ఏకంగా అక్షరాలా 620 రూపాయలు. కాగా వన్8 రెస్టారెంట్లో మొక్కల ఆధారిత వంటకాలతో పాటు మాంసం, సీ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటాయి.విరాట్ ఫేవరెట్స్అంతేకాదు.. ‘విరాట్ ఫేవరెట్స్’ పేరిట ప్రత్యేక వంటకాలు కూడా ఈ రెస్టారెంట్లో లభిస్తాయి. టోఫు స్టీక్, మష్రూమ్ డంప్లింగ్స్ విత్ ట్రఫోల్ ఆయిల్, సూపర్‌ఫుడ్ సలాడ్ ఇక్కడి వెజిటేరియన్ స్పెషల్స్. ఇక పెంపుడు జంతువుల కోసం వన్8లో ఫుడ్ అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 518- 818 వరకు ఉంటుంది.ఇక అభిమానులను ఆకర్షించేందుకు వన్8 కమ్యూన్ ఎంట్రన్స్‌లోనే కోహ్లి క్రికెట్ ప్రయాణాన్ని సూచించేలా ఫొటోలు ఉంటాయి. కోహ్లి జెర్సీ (నంబర్ 18)ని అక్కడి గోడపై వేలాడదీసి ఉంచారు. గ్లాస్ రూఫ్ ద్వారా సూర్యకాంతి పడుతూ ఉంటుంది. ‘‘చక్కటి, ఆహ్లాకరమైన పరిసరాలు ఉండటం అత్యంత ముఖ్యం. భోజన నాణ్యత ఎలాగూ బాగానే ఉంటుంది. ప్రతి వంటకాన్ని శ్రద్ధ పెట్టి తయారు చేస్తాం. కానీ అన్నింటికంటే ఆంబియన్స్ బాగుంటేనే ఎవరైనా ఇక్కడి వరకు వస్తారు’’.. ఆతిథ్య రంగంలో రాణిస్తున్న కోహ్లి తరచూ చెప్పే మాట ఇది!!చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)


