టైగర్ ష్రాఫ్ రోజూ తాగే నీరు ఖర్చు రూ.3,600 | Water Tiger Shroff drinks every day costs Rs 3,600 | Sakshi
Sakshi News home page

టైగర్ ష్రాఫ్ రోజూ తాగే నీరు ఖర్చు రూ.3,600

Oct 24 2026 11:21 PM | Updated on Oct 24 2026 11:21 PM

Water Tiger Shroff drinks every day costs Rs 3,600

సినీ సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌ ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. ముఖ్యంగా వారి ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌ రొటీన్‌తో పాటు వారు ఉపయోగించే వస్తువుల గురించి కూడా తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు. తాజాగా బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ తాగే వాటర్‌ బాటిల్‌ ధర సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

టైగర్‌ ష్రాఫ్‌ టేబుల్‌పై కనిపించిన బాటిల్‌ ప్రముఖ ఇటాలియన్‌ బ్రాండ్‌ శాన్‌ పెల్లెగ్రినోకు చెందినదిగా ప్రచారం జరుగుతోంది. ఈ బ్రాండ్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. 750 మిల్లీలీటర్ల ఈ స్పార్క్లింగ్‌ వాటర్‌ బాటిల్‌ ధర సుమారు రూ.600గా పేర్కొంటున్నారు.

టైగర్‌ ష్రాఫ్‌ రోజుకు ఆరు లీటర్ల నీరు తాగితే.. ఇదే ధరతో లెక్కించినప్పుడు రోజువారీ నీటి ఖర్చు రూ.3,600 అవుతుంది. అయితే ఒక్కో బాటిల్‌ ధర, కొనుగోలు చేసే ప్రాంతాన్ని బట్టి ఖర్చు మారవచ్చు.

సెలబ్రిటీలు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేకమైన ఉత్పత్తులను ఎంచుకోవడం సాధారణమే. అయితే ఖరీదైన నీటిని తాగడమే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుందని భావించకూడదు. టైగర్‌ ష్రాఫ్‌ వాటర్‌ బాటిల్‌ ధరపై జరుగుతున్న చర్చ మరోసారి సెలబ్రిటీల విలాసవంతమైన జీవనశైలిని తెరపైకి తెచ్చింది.

అయితే తాగునీరు విషయంలో విరాట్ కోహ్లితో పోలిస్తే, టైగర్ ఖర్చు చేసేది చాలా తక్కువనే చెప్పాలి. విరాట్, షారూక్, కత్రినా లాంటి స్టార్లు కేవలం తాగే నీటి కోసం రోజుకు 10వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement