సర్‌ప్రైజ్ చేసిన దీపిక.. కూతురికి దేవుడి పేరు | Deepika Padukone Second Daughter Name Details | Sakshi
Sakshi News home page

Deepika Padukone Daughter Name: దీపిక రెండో కూతురి పేరు ఇదే

Oct 21 2026 8:45 AM | Updated on Oct 21 2026 9:35 AM

Deepika Padukone Second Daughter Name Details

ఇప్పుడంతా రకరకాల పేర్లు పెట్టడం ట్రెండ్ అయిపోయింది. ఒకప్పటిలా అందంగా ఉండే దేవుడి పేర్లు పెట్టడం జనాలు బాగా తగ్గించేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ దంపతులు మాత్రం తమ రెండో కూతురికి మంచి పేరు పెట్టారు. దసరా సందర్భంగా ఆ విషయాన్ని బయటపెడుతూ పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోల పెళ్లి వార్తలు.. ఇద్దరూ నవంబరులోనే!)

కెరీర్ పరంగా రణ్‌వీర్, దీపిక స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో కలిసి పద్మావత్, రామ్ లీల్ సినిమాలు చేసిన వీళ్లిద్దరూ ప్రేమించి పెద్దల్ని ఒప్పించి 2018లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం కూతురు పుట్టగా దువా అని పేరు పెట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 19న మళ్లీ కూతురు పుట్టింది. ఆ పాపకు 'దేవి పదుకొణె సింగ్' అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ పోస్టుకి బాలీవుడ్ స్టార్స్ అందరూ కామెంట్స్ పెడుతూ విషెస్ చెబుతున్నారు.

రణ్‌వీర్ సింగ్ విషయానికొస్తే.. మంచి నటుడే కానీ కొన్నాళ్ల ముందు వరకు హిట్స్, ఫ్లాప్స్ ఉండేది. కానీ రీసెంట్ టైంలో 'ధురంధర్' రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'ప్రళయ్' అని ఓ మూవీ చేస్తున్నాడు. మరోవైపు దీపిక.. కల్కి, స్పిరిట్ చిత్రాల నుంచి బయటకొచ్చేసిన తర్వాత ప్రస్తుతం హిందీలో షారుఖ్ 'కింగ్', తెలుగులో అల్లు అర్జున్ 'రాకా'లో హీరోయిన్‌గా చేస్తోంది.

(ఇదీ చదవండి: ఏకంగా ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన మమిత బైజు ప్రేమకథా సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement