టాలీవుడ్ హీరోల పెళ్లి వార్తలు.. ఇద్దరూ నవంబరులోనే! | Saitej And Teja Sajja Marriage News | Sakshi
Sakshi News home page

Saitej And Teja Sajja: తేజ సజ్జా నిశ్చితార్థం.. సాయితేజ్ పెళ్లి!

Oct 20 2026 3:49 PM | Updated on Oct 20 2026 4:11 PM

Saitej And Teja Sajja Marriage News

తెలుగులో మరో ఇద్దరు హీరోలు శుభవార్తలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హీరో, పెళ్లికి రెడీ అవగా.. మరో హీరో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడట. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ టైమ్ లూప్ ‍థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి.. గత కొన్నేళ్లలో 'హనుమాన్', 'మిరాయ్' లాంటి సూపర్ హీరో సినిమాల్లో హీరోగా చేసి ప్రస్తుతం మిరాయ్ 2 మూవీ చేస్తూ మరోవైపు 'ద ట్రైటర్స్' అనే రియాలిటీ షోకి హోస్ట్‌గా చేస్తున్న తేజ సజ్జా.. వచ్చే నెలలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోనున్నాడట. త్వరలో వివాహం కూడా ఉండొచ్చు. అయితే ఇది ప్రేమపెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది.

చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్.. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ చేశాడు గానీ అవి పెద్దగా ఆడలేదు. మధ్యలో బైక్ యాక్సిడెంట్ జరగడంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. తర్వాత 'విరూపాక్ష' అనే థ్రిల్లర్‌తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' మూవీ చేస్తున్న ఇతడు.. చిన్ననాటి స్నేహితురాలిని వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరు ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.

వీళ్లే కాదు నవంబరులో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కూతురు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. వచ్చే నెల 11న గ్రీస్‌లో ఈ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. 21న చెన్నైలో రిసెప్షన్ జరగనుంది.

(ఇదీ చదవండి: దుర్గాదేవి ఈవెంట్‌కి మందేసి వచ్చారా? దలేర్ మెహందీపై మంత్రి ఆరోపణ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement