బోలో తా రా రా, హో జాయేగీ బల్లే బల్లే లాంటి హిట్ పాటలతో 90ల్లో గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ సింగర్ దలేర్ మెహందీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. దుర్గాదేని నవరాత్రుల సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఈయన మందు తాగి స్టేజీపై పాటలు పాడారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రమంత్రి ఈ ఆరోపణలు చేయడమే దీనికి కారణం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
ఇంతకీ అసలేం జరిగింది?
ఆదివారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని న్యూ తెహ్రీలో చారిత్రాత్మక సిద్ధపీఠ్ మా కుంజాపురి పర్యాటక, అభివృద్ధి జాతర జరిగింది. ఇందులోని పాటల కార్యక్రమంలో దలేర్ మెహందీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే ఈ గాయకుడు పాడుతున్న టైంలో స్టేజీపైకి వచ్చిన రాష్ట్రమంత్రి సుభోద్ ఉనియాల్.. మీరు సరిగా మాట్లాడలేకపోతున్నారు. నిలబడేందుకు కూడా ఇబ్బందిపడుతున్నారు. మందు కొట్టి వచ్చారా? పెదవులు కదిలిస్తూ ప్రేక్షకుల్ని ఫుల్స్ చేస్తున్నారా? అని ప్రశ్నించాడు. దీంతో వివాదం చెలరేగింది.
దలేర్ మెహందీకి సపోర్ట్ చేస్తూ మికా సింగ్, పలాష్ సేన్ తదితరులు మాట్లాడారు. దలేర్ మెహందీ ఒకవేళ మద్యపానం చేసుంటే తాను సింగింగ్ కెరీర్ వదిలేస్తానని మికా సింగ్ ఛాలెంజ్ చేశారు. ఇక తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న మంత్రి సుభోద్.. ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆయన(దలేర్ మెహందీ) ఒక గొప్ప కళాకారుడు. అలాంటి వ్యక్తి తన కళకు న్యాయం చేయకపోతే ఎలా? వేదికపై ఆయన అయోమయంగా కనిపించారు. నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. తన పాటలకు పెదవులు మాత్రమే కదుపుతున్నారు. ఆయన ఒక గొప్ప కళాకారుడని, తన కళకు న్యాయం చేయాలని నేను చెప్పాను. ప్రదర్శన ఇవ్వడానికి ఆయనకు రూ.35 లక్షలు ఆఫర్ చేశారు. కానీ ఆయన పాటలు కూడా పాడటం లేదు. అందుకే నేను నా అసంతృప్తిని వ్యక్తం చేశాను అని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' కొత్త రిలీజ్ డేట్.. ఈసారైనా వస్తారా?)
A video from the Kunjapuri Mela in Narendranagar, Tehri Garhwal, is drawing attention, showing Cabinet Minister and local MLA Subodh Uniyal objecting on stage during a performance by Punjabi singer Daler Mehndi. In the video, Uniyal can be heard telling him, “Bol toh jaa nahi raha, gaana kya gaoge?”
— Kumaon Jagran (@KumaonJagran) October 19, 2026


